చేపల చెరువుకు కొంగను కాపలా ఉంచినట్టు

అసంబద్ధమైన నిర్ణయం తీసుకోవటం, రక్షణ కావలసినచోట శత్రువుకు అవకాశం కల్పించటం అనే లాంటి అర్థాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది. చేపలు కొంగకు ఆహారం. చేపల చెరువు దగ్గరకు కొంగలు రాకుండా రైతులు జాగ్రత్తపడుతుంటారు. అలాంటిది ఏకంగా కొంగను తీసుకొచ్చి చేపల చెరువుకు కాపలాపెడితే ఏం జరుగుతుందో ఎవరైనా వూహించవచ్చు. అలాగే కొన్ని కొన్ని సందర్భాలలో అనాలోచితంగా వ్యవహరించి కొందరు శత్రువుకు స్థానం కల్పించి మోసపోతుంటారు. అలాంటి పరిస్థితులను గురించి వివరించాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్