చెట్టులేని చేను, చుట్టం లేని వూరన్నట్టు

నిరుపయోగమైన వాటి గురించి పోల్చాల్సిన సందర్భాల్లో ఉపయోగించే జాతీయమిది. పంటపండే చేను అయితేనే దానివల్ల ఎవరికైనా ఉపయోగం. ఆ చేలో ఉన్న చెట్టు చేమ వల్ల ఏదో ఒక ప్రయోజనం నెరవేరుతుంటుంది. అలా లేనప్పుడు ఆ చేను బీడు భూమి అయినప్పుడు ఏ ఉపయోగమూ ఉండదు. చేలో చెట్టు ఉన్నప్పుడు ప్రయోజనం సమకూరినట్టుగానే వూళ్లో చుట్టాలున్నప్పడు ఉపయోగం ఉంటుంది. ప్రతి మనిషీ చుట్టాలను, స్నేహితులను సమకూర్చుకోవాలన్న సూచన కూడా కన్పిస్తుంది.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్