రాజు పగ, తాచు పగ ఒకటేనన్నట్లు

రాజు అంటే ప్రజల మీద సర్వాధికారాలు ఉన్నవాడు. అలాంటి అధికార సంపన్నుడు ఎవరి మీదైనా కోపం తెచ్చుకొని పగబడితే అది తాచుపాము పగలాంటిదేనని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. తాచుపాము పగపడితే చాలా ప్రమాదమని జన బాహుళ్యంలో ఉన్న నమ్మకం. దాంతోపాటు అధికారం చేతిలో ఉన్నవారి క్రూర స్వభావం రెండింటినీ సరిపోల్చుకుంటూ అధికార మదోన్మత్తులతో తగాదాపడవద్దని హెచ్చరించే సందర్భంలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్