ఆత్మ సంతోషానికి రోకటిబండ తంబురా అన్నట్టు

ఎవరి పిచ్చి వారికానందం అనేలాంటిది ఇది. రోకటిబండతో రోట్లో పచ్చడి నూరుకోవచ్చేమో కానీ తంబురా లాగా దాన్ని ఉపయోగించటం సాధ్యం కాదు. కానీ అలా చేస్తున్నాడంటే పిచ్చికింద లెక్కే. ఆ పిచ్చి అతడి ఆత్మానందానికి సంబంధించింది. దీని ఆధారంగానే ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. ఎవరైనా అందరూ మెచ్చేలాగా కాకుండా కేవలం తమకు మాత్రమే నచ్చినట్లు ప్రవర్తిస్తున్నప్పుడు ''ఏం చేస్తాం ఆత్మ సంతోషానికి రోకటిబండ తంబురా అన్నట్టు వాడిపని వాడికే నచ్చినట్టుంది మరి'' అనేలాంటి ప్రయోగాలున్నాయి.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్