గాలిలో మాట రాసినట్టు నీరు మూటకట్టినట్టు

వృథా కార్యాలు, వ్యర్థ ప్రయత్నాలు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. గాలిలో ఎంతసేపు రాసినా, ఏం రాసినా కనిపించదు. నీరు వస్త్రంతో మూటకట్టాలని ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం ఫలించదు. ఇదే తీరులో కొన్ని కొన్ని పనులు అసాధ్యాలని తెలియచెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. 'వాడు చెప్పిన మాటలన్నీ గాలిలో రాసినట్టు నీరు మూటకట్టినట్టే ఉంటాయి జాగ్రత్త' అనేలాంటి ప్రయోగాలున్నాయి.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్