ఇంటివారు గొడ్డు గేదంటే పొరుగువారు పాడి గేదె అన్నట్టు

ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. కానీ చాలామంది ఇంట్లో అవమానం పొందుతూ బయటవారి దగ్గర ప్రశంసలందుకుంటుంటారు. అలాంటి వారిని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. గొడ్డుగేదెవల్ల ఉపయోగం లేదని దానికి పెట్టే మేత, నీళ్లు అన్నీ వృథా అనుకొంటుంటారు. అదే పాడిగేదె పాలిస్తుంది కనుక దానికి మేత, నీళ్లు ఇవ్వటానికి వెనుకాడరు. ఇదే తీరులో తన ఇంట్లో దేనికీ పనికిరాడన్న చీత్కారాలను పొందుతూ మంచి పనిమంతుడు అని బయట పదిమంది ముందూ ప్రశంసంలందుకునే వారిని ఉద్దేశించి చెప్పింది ఈ జాతీయం. ''వాడి పరిస్థితి ఇంటివారి ముందు గొడ్డుగేదె పొరుగువారి ముందు పాడిగేదె అన్న చందంగా ఉంది'' అనేలాంటి ప్రయోగాలున్నాయి.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్