పొద్దెప్పుడు కుంకుతుందా ముద్ద ఎప్పుడు మింగుతానా అన్నట్టు

పనిదొంగలు, తిండిపోతుల వ్యవహార శైలిని విమర్శిస్తూ పెద్దలు మాట్లాడే మాటల్లో ఈ జాతీయం వినిపిస్తుంటుంది. కొంతమందికి ఎప్పుడూ తిండి మీదే ధ్యాస ఉంటుంది. ఇది పూర్వకాలంనాడు ఆవిర్భవించిన జాతీయం. పూర్వం పొద్దుకుంకగానే అన్నం తినేసేవారు. ఓ వ్యక్తిని ఉదయం పూట పనిలోకి పెట్టకుంటే తిండి మీద ధ్యాస ఉన్న ఆ వ్యక్తి చెప్పిన పని చేయకుండా ఎప్పుడు పొద్దుకుంకుతుందా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళదామా అని ఎదురుచూస్తూ కూర్చున్నాడట. ఆ విషయం ఆధారంగా ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. 'వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, పొద్దెప్పుడు కుంకుతుందా ముద్దఎప్పుడు మింగుతానా అని అన్నట్టు ఉంది తప్ప ఇక్కడ ఎవరూ సరిగా పనిచేస్తున్నట్లే కనిపించటంలేదు' అనేలాంటి ప్రయోగాలున్నాయి.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్