చీమలు పాకితే రాళ్లరుగుతాయా అన్నట్టు

అల్పులకు సహాయం చేసినందువల్ల సంపన్నులకు ఎలాంటి నష్టమూ ఉండబోదని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. చీమలు తమకు కావల్సిన ఆహారాన్ని పొందటానికి బండల మీద అటూఇటూ పాకుతూ ఉంటాయి. అంతమాత్రంతో ఆ బండ అరగటం కానీ ఇతరత్రా మరెలాంటి నష్టాన్ని పొందదు. ఇదే తీరులో ధనహీనులకు సహాయం చేసినందువల్ల సంపన్నులు నష్టపోయేది ఏమీ ఉండదని, కనుక సహాయం చెయ్యాలని తెలియచెప్పటమే ఈ జాతీయంలోని అంతరార్థ´ం. ''చీమలు పాకితే రాళ్లరుగుతాయా చెప్పండి.. ఈ కాస్త సహాయం మీకందినందువల్ల ఆయనకు కలిగే నష్టం ఏమీ ఉండదులే'' అనేలాంటి సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.