వూళ్లో ఇల్లూ లేదు, వూరిబయట చేనూ లేదూ

ఏమంతగా ధనవంతుడైనవాడు కాడు, సాధారణమైన సంపాదన మాత్రమే ఉందని చెప్పాల్సినచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. సొంత ఇల్లూ, పొలమూ ఉండటం ఆస్తి ఉందని చెప్పటానికి, ధనవంతుడేనని నిర్ధరించటానికి కొంత ఆధారంగా ఉంటాయి. అలా లేనివాడు నిరుపేద అని భావించి చెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. 'వాడికి పిల్లనిచ్చేదెవరు? వూళ్లో ఇల్లూ లేదు, వూరి బయట పొలమూ లేదు' అనేలాంటి ప్రయోగాలున్నాయి.