నరం లేని నాలుక...

నరం లేని నాలుక ఎటైనా తిరుగుతుందన్నది జాతీయం. అంటే మాట నిలుపుకోలేకపోవటం, ఇప్పుడు చెప్పింది మరికాసేపటికి కాదనటం అనేలాంటి అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. నాలుక అనేది మాటకు ప్రతీకగా, నరం అనే దాన్ని పటుత్వానికి గుర్తుగానూ చెబుతారు. ఈ భావంతోనే మాటమీద పట్టులేకపోవడం, మాట నిలుపుకోలేకపోవటం అనే అర్థాలొచ్చాయి. 'వాడిది నరం లేని నాలుక. వాడి మాటను నమ్మి మోసపోవద్దు' అనే లాంటి ప్రయోగాలున్నాయి.