వూగే పంటి కింద రాయి పడ్డట్టు

అసలే కష్టాలలో ఉన్నప్పుడు దానికి తోడు మరిన్ని కష్టాలు వచ్చిపడి భరించలేని స్థితి ఎదురైన సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. వూగుతూ ఉన్న పన్ను బాధను కలిగిస్తూ ఉంటుంది. ఆ బాధను ఎలాగో ఒకలాగా భరిస్తూ ఆకలిని చల్లార్చుకోవటం కోసం ఆహారం తింటానికి ప్రయత్నిస్తే ఆ వూగే పంటికిందే రాయి పడితే ఎంత బాధో ఎవరైనా వూహించవచ్చు. అంతే బాధను రెట్టించిన కష్టకాలంలో పొందటం అనే విషయాన్ని గురించి వివరించేటప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.