కసవులో పనసకాయ తరగినట్టు

చెడు పనులకు, దుర్మార్గాలకు అవకాశం ఇవ్వటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పనసకాయ తరిగేటప్పుడు దానికుండే సహజమైన జిగటవల్ల చుట్టూ ఉన్నవి అతుక్కోవటానికి అవకాశం ఉంది. తినటానికి ఉపయోగించే ఆ పనస కాయను పరిశుభ్రమైన ప్రదేశంలో తరగటం మేలు. కసవున్నచోట ఆ కాయను తరిగితే దుమ్మూధూళి అంటుకొని అది తినటానికి పనికిరాకుండా పోతుంది. తినటానికి పనికిరాకుండా చెయ్యటమనేది దుర్మార్గమైన విషయం. దుర్మార్గాలకు అవకాశం ఇవ్వటమనే అర్థం. ఈ భావనతోనే ఈ జాతీయం ద్వారా ప్రయోగంలోకి వచ్చినట్లు కనిపిస్తుంది.