ఏకుతో తాకితే మేకుతో మొట్టినట్టు

చాలా అల్పమైన అపకారానికి భయంకరమైన శిక్షను విధించటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఏకుతో ఎదుటి వ్యక్తిని తాకటమంటే ఎదుటి వ్యక్తికి శారీరకంగా ఏమాత్రం బాధను కలిగించే విషయం కాదు. కానీ చాలా అల్పమైన ఆ పనికి మేకుతో మొట్టాడట ఎదుటి వ్యక్తి. మేకుతో మొట్టడమంటే ఎంతగా బాధను కలిగిస్తుందో ఎవరైనా వూహించవచ్చు. ఈ భావన ఆధారంగా ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది.