కోడిగుడ్డును కొట్టేందుకు గుండ్రాయి కావాలా అన్నట్టు

అల్పులను శిక్షించేందుకు అధికమైన బలం అక్కరలేదని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. వాటం చూసి గట్టిగా వేలితో కొట్టినా కోడిగుడ్డు పగులుతుంది. అలాంటి దానికి గుండ్రాయి అనవసరం. అదే తీరులో అల్పుడైన శత్రువును కొట్టడానికి అధిక బలం అనవసరమని చెప్పే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడడం కనిపిస్తుంది.