రాగంలేని భోగం, త్యాగం లేని మనస్సు

జీవిత సత్యాన్ని తెలియచెప్పే జాతీయం ఇది. ఎంతగా భోగాలను అనుభవిస్తున్నా అలా అనుభవించింటేప్పుడు బంధుమిత్రుల అనురాగం ఉంటేనే ఆ భోగానుభవంలో ఆనందం ఉంటుంది. కానప్పుడు ఎన్ని భోగాలున్నా, ఎదురుగా ఇంకేమున్నా ఆనందమే ఉండదు. అలాగే ఎదుటి వారికోసం చిన్నదైనా, పెద్దదైనా త్యాగం చేసినప్పుడు మనస్సుకు కలిగే ఆనందం ఎంతో గొప్పగా ఉంటుంది. ఎలాంటి త్యాగమూ లేకుండా చ్కీజీజివితం గడుస్తూ ఉంటే మనస్సుకు ఆనందం ఉండదని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది.