గంధద్రవ్యాలు మోసినా గాడిద గాడిదేనన్నట్టు

కొంతమంది ఎన్ని మంచి మాటలు చెప్పినా మరెంతమంది సత్పురుషులు వారి చుట్టూనే ఉన్నా వారి మనస్సు మాత్రం మారదు. దుర్మార్గం వైపే వారి అడుగులు పడుతూ ఉంటాయి. అలాంటి వారిని గురించి తెలియచెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్లు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు అనే నానుడికి సరిసమానంగా దీన్ని చెబుతారు.