నేయి వెన్న కాచి నీడనే యుంచిన

పధ్యం:: 

నేయి వెన్న కాచి నీడనే యుంచిన 
బేరి గట్టిపడును పెరుగురీతి 
పోరిపోరి మదిని పోనీక పట్టుము 
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యము: 
వెన్నను కాచి నేతిగా మార్చి నీడలో ఉంచితో అది పేరుకుంటుంది. పెరుగులా గట్టిపడుతుంది. మనసు అదుపులో ఉన్నట్లే అనిపించినా... ఏమాత్రం ఉపేక్షించినా పట్టు జారిపోయే ప్రమాదం ఉంది.