kruthi

శ్యామశాస్త్రి

శ్యామశాస్త్రిశ్యామశాస్త్రి, కర్నాటక సంగీతంలో ప్రముఖ వాగ్గేయకార త్రయంలో త్యాగరాజు , ముత్తుస్వామి దీక్షితుల సరసన నిలిచే తెలుగు పెద్దలలో శ్యామశాస్త్రి ప్రముఖులు. శ్యామశాస్త్రి వయస్సులో వారిద్దరికన్నా పెద్దవాడు. శ్యామశాస్త్రి తండ్రి విశ్వనాథ శాస్త్రి. ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని గిద్దలూరుకు సమీపంలోగల కంభం ప్రాంతీయులు. అయితే, 17వ శతాబ్దంలో తమిళనాడుకు వలస వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. శ్యామశాస్త్రి అసలు పేరు వేంకట సుబ్రహ్మణ్యము. అయితే, చిన్నతనంలో ముద్దుపేరుగా శ్యామకృష్ణ గా పిలుస్తూ, ఆ పేరే చివరకు వ్యవహరికంలో సార్ధకమైందని ఆయన శిష్యులు పేర్కొంటారు.

 తండ్రి విశ్వనాధ శాస్త్రి సంస్కృత, తెలుగు భాషలలొ పండితుడు కావడంతో- శ్యామశాస్త్రి చిన్నతనంలో తండ్రి దగ్గరే సంస్కృతాంధ్రభాషలు అభ్యసించాడు. సంగీతంలో తన మేనమామ దగ్గర స్వరపరిచయం కల్గినా, ఆ పిదప తంజావూరులో ‘సంగీత స్వామి’ అనబడే ప్రముఖ తెలుగు సంగీత విద్వాంసుని దగ్గర, తంజావూరులోని రాజాస్థానంలో సంగీత విద్వాంసుడైన శ్రీ పచ్చిమిరియము ఆది అప్పయ్య సహకారంతో సంగీత శాస్త్రాలలో మర్మములు ఎన్నో అధ్యయనం చేశాడు.

Subscribe to RSS - kruthi