విశ్వనాథ సత్యనారాయణ (1895-1976) "కవి సామ్రాట్" బిరుదాంకితుడు. తెలుగు సాహిత్యంలో తొలిజ్ఞానపీఠ అవార్డు గ్రహీత. 20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు.