panappakam

శ్రీ పనప్పాకం ఆనందాచార్యులు

పనప్పాకం ఆనందాచార్యులుతొలితరం జాతీయ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఒకరు పనప్పాకం ఆనందాచార్యులు. అఖిల భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షులు. బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ సభకు హాజరైన 72 మంది ప్రతినిధుల్లో ఆనందాచార్యులు ఒకరు.  

పనప్పాకం ఆనందాచార్యులు, చిత్తూరు జిల్లాకు చెందిన కడమంచి గ్రామంలో 1843 సంవత్సరంలో జన్మించారు. వీరి తండ్రి శ్రీనివాసాచార్యులు. వీరు చిత్తూరు జిల్లా కోర్టులో ఉద్యోగం చేశారు. తండ్రి మరణానంతరం ఆతని మిత్రుడైన సి. వి. రంగనాథ శాస్త్రులు సహాయంలో 1863లో మెట్రిక్యులేషన్, తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో 1865లో ఎఫ్.ఎ పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు. తర్వాత పచ్చియప్పా పాఠశాలలో ఉపాధ్యాయునిగా 1969 వరకు పనిచేశారు. ప్రైవేటుగా చదివి 1869లో బి.ఎల్ పరీక్షలో ఉత్తీర్ణులై మద్రాసు హైకోర్టు న్యాయవాదులలో అగ్రగణ్యులైన కావలి వెంకటపతిరావు వద్ద అప్రెంటిస్ గా పనిచేశారు. 1870లో వకీలుగా అనుమతిని పొంది హైకోర్టు న్యాయవాదులలో అగ్రగణ్యులయ్యారు. మద్రాసులో న్యాయవాదుల కోసం ఒక అసోసియేషన్ స్థాపన చేయడంతో పాటు , న్యాయ విచారణ పద్దతులు, న్యాయవాదుల స్థితిగతుల మెరుగుదల కోసం  చక్కని గ్రంధాలు శ్రీ అనంతాచార్యులు రచించారు. వీరు 1889లో మమద్రాస్ అడ్వకేట్స్ అసోసియేషన్ స్థాపించారు.
 

Subscribe to RSS - panappakam