శ్రీ పనప్పాకం ఆనందాచార్యులు

పనప్పాకం ఆనందాచార్యులుతొలితరం జాతీయ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఒకరు పనప్పాకం ఆనందాచార్యులు. అఖిల భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షులు. బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ సభకు హాజరైన 72 మంది ప్రతినిధుల్లో ఆనందాచార్యులు ఒకరు.  

పనప్పాకం ఆనందాచార్యులు, చిత్తూరు జిల్లాకు చెందిన కడమంచి గ్రామంలో 1843 సంవత్సరంలో జన్మించారు. వీరి తండ్రి శ్రీనివాసాచార్యులు. వీరు చిత్తూరు జిల్లా కోర్టులో ఉద్యోగం చేశారు. తండ్రి మరణానంతరం ఆతని మిత్రుడైన సి. వి. రంగనాథ శాస్త్రులు సహాయంలో 1863లో మెట్రిక్యులేషన్, తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో 1865లో ఎఫ్.ఎ పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు. తర్వాత పచ్చియప్పా పాఠశాలలో ఉపాధ్యాయునిగా 1969 వరకు పనిచేశారు. ప్రైవేటుగా చదివి 1869లో బి.ఎల్ పరీక్షలో ఉత్తీర్ణులై మద్రాసు హైకోర్టు న్యాయవాదులలో అగ్రగణ్యులైన కావలి వెంకటపతిరావు వద్ద అప్రెంటిస్ గా పనిచేశారు. 1870లో వకీలుగా అనుమతిని పొంది హైకోర్టు న్యాయవాదులలో అగ్రగణ్యులయ్యారు. మద్రాసులో న్యాయవాదుల కోసం ఒక అసోసియేషన్ స్థాపన చేయడంతో పాటు , న్యాయ విచారణ పద్దతులు, న్యాయవాదుల స్థితిగతుల మెరుగుదల కోసం  చక్కని గ్రంధాలు శ్రీ అనంతాచార్యులు రచించారు. వీరు 1889లో మమద్రాస్ అడ్వకేట్స్ అసోసియేషన్ స్థాపించారు.
 

మొదట్లో ఆనందాచార్యులు జర్నలిజం, రాజకీయాల పట్ల ఆసక్తి చూపారు. ఆయన ‘నేటివ్ పబ్లిక్ ఒపీనియన్, మద్రాసి’ అనే మ్యాగజైన్లకు వ్యాసాలు రాసేవారు. ఆ తర్వాత హిందూ పత్రిక స్థాపనకు సహాయం చేసి, వ్యాసాలు రాశారు.  రాజకీయాల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి అనేక రకాలుగా సేవలందించారు. 1884లో మద్రాసు మహాజన సభను స్థాపించారు. 1885లో అఖిలా భాత జాతీయ కాంగ్రెస్ మహాసభ బొంబైలో ఏర్పాటు చేసిన నాటి నుండే, దేశ స్వాతంత్ర్య సమర సంగ్రామంలో పాల్గొని గణనీయమైన సేవచేశారు. 1891 నాగపూర్ లో జరిగిన 7వ జాతీయ సభకు వీరు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ పదవిని అలంకరించిన మొట్టమొదటి దక్షిణ భారతీయులు వీరు. వీరు కాంగ్రెసు కార్యనిర్వహక సంఘంలో సభ్యులుగాను, అలహాబాదు కాంగ్రెసు కార్యదర్శులలో ఒకరుగా ఎన్నికయ్యారు.

1896లో భారతీయ సామ్రాజ్య శాసనసభకు చెన్నై నుండి ప్రతినిధిగా ఎన్నుకోబడ్డారు. ఆ సభలో నిర్భయంగా ప్రజల హక్కులను పరిరక్షించుటలో ఎనిమిది సంవత్సరాలు పనిచేసి 1903లో రాజీనామా చేశారు. ఈయన ప్రతిభకు మెచ్చి 1887లో ఆనాటి ప్రభుత్వం రాజబహుదూర్ బిరుదు ప్రదనంతో సత్కరించారు. ఆంధ్ర భాషా సారస్వత పోషకుడిగా కీర్తి గడించడమే కాకుండా ‘పద్యావినోద’అనే బిరుదుతో ఆనాటి సాంస్కృతిక సమాజాలు సత్కరించి గౌరవించాయి. కడుపేదరికం నుండి తన మేధాసంపత్తితో కృషి, పట్టుదలతో అత్యంత ఉన్నత పదవులు అలంకరించిన ఆనందాచార్యులు 1907లో కీర్తిశేషులైనారు.

మూలం / సేకరణ: 
వికీపీడియా,"తెలుగు పెద్దలు" పుస్తకం