తెలుగు వారి కీర్తి ప్రతిష్టలు పెంచిన ఎందరో మహనీయుల గురించిన వ్యాసములు
|
విభాగము:
వివరణ:
1906లో మచిలీపట్నంలో వైద్యవృత్తిని చేపట్టారు. గాంధీజీ పిలుపు మేరకు 1916 లో ఆ వృత్తిని వదిలిపెట్టి స్వాతంత్య్రోద్య మంలో పాల్గొన్నారు. అంతే కాకుండా భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించే వరకు ఎటువంటి వృత్తిని చేపట్టకూడదనే ధ్యేయంతో ముందుకు నడిచారు. 1948లో జైపూర్ కాంగ్రెస్ సమావేశం నాటికి కాంగ్రెస్ అధ్యక్షుని స్థాయి కి ఎదిగారు. 1952-57 మధ్యకాలంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా వ్యవరించారు. నేడు దేశంలో ప్రముఖ బ్యాంకుగా చలామణి అవుతున్న ఆంధ్రాబ్యాంక్‌ను 1923లో స్థాపిం చాడు. అంతేకాకుండా ఈయన స్థాపించిన ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెని (1925), హిందు స్తాన్ ఐడియల్ ఇన్సూరెన్స్ కంపెని (1935) లు తరువాతి కాలంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో విలీనమయ్యాయి. రాష్ట్రం బయట పనిచేసిననూ తెలుగు భాషపై మమకారం కోల్పోలేదు. తను స్థాపించిన ఆర్థిక సంస్థలలో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలని సూచించాడు. తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎన్నో చిరస్మరణీయ సేవలను అందించారు. నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైన ఆయనకు రాష్ట్ర మంత్రి వర్గంలో అవకాశం తలుపుతట్టినా, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతి పదవి గుమ్మం వరకు వచ్చినా సున్నితంగా తిరస్కరించి ప్రజాసేవలో, రాజకీయాల్లో మునిగిపోయిన మహనీయుడు డాక్టర్ పట్టాభి సీతారామయ్య. బాల్యం: పశ్చిమ గోదావరి జిల్లా గుండుకొలను గ్రామంలో 1880, నవంబర్ 24 న ఆరువేల నియోగి బ్రాహ్మణుల ఇంటిలో పట్టాభి జన్మించాడు. వారి ఇంట్లో ప్రతి సంవత్సరం రామపట్టాభిషేకం జరిపే ఆచారం ఉండేది. అందుకే తల్లిదండ్రులు పట్టాభీ సీతారామయ్య అనే పేరు పెట్టినారు. ప్రాథమిక విద్య స్థానికంగా బందరులోనే చదివి ఉన్నత విద్యకై మద్రాసు (నేటి చెన్నై) వెళ్ళి మద్రాసు క్రైస్తవ కళాశాల నుండి బి.ఏ. డిగ్రీ పొందిన పట్టాభి ఎం.బి.సి.ఎం. డిగ్రీ సాధించి డాక్టరు కావాలనే తన ఆశయాన్ని నెరవేర్చుకున్నాడు. స్వాతంత్ర్య సమరయోధుడు, కాంగ్రెస్ నాయకుడిగా : 1942లో క్విట్ ఇండియా ఉద్యమ ప్రారంభములో కాంగ్రేసు పార్టీ కార్యాచరణ వర్గంలో పనిచేస్తూ ఉండగా మొత్తం కార్యాచరణ వర్గ సహితంగా పట్టాభిని అరెస్టు చేసి మూడేళ్లపాటు అహ్మద్ నగర్ కోటలో బయటి వ్యక్తులెవ్వరితో సంబంధాలు లేకుండా బంధించి చిత్రవధ చేశారు. బందీగా ఉన్న ఈ సమయంలో పట్టాభి తన దినచర్యను గూర్చి విస్తారమైన డైరీ నిర్వహించాడు. దీన్నే ఆ తదనంతరం ఫెదర్స్ అండ్ స్టోన్స్ (ఈకలు మరియు రాళ్ళు)గా ప్రచురింన్చాత్థొ.లదుక ఆనీ నీకె తలుస్య్ ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఉద్యమానికి కృషి : వ్యాపారవేత్తగా : తెలుగు అభిమానిగా : గ్రంథకర్తగా : స్వాతంత్ర్యానంతరం
1906లో మచిలీపట్నంలో వైద్యవృత్తిని చేపట్టారు. గాంధీజీ పిలుపు మేరకు 1916 లో ఆ వృత్తిని వదిలిపెట్టి స్వాతంత్య్రోద్య మంలో పాల్గొన్నారు. అంతే కాకుండా భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించే వరకు ఎటువంటి వృత్తిని చేపట్టకూడదనే ధ్యేయంతో ముందుకు నడిచారు. 1948లో జైపూర్ కాంగ్రెస్ సమావేశం నాటికి కాంగ్రెస్ అధ్యక్షుని స్థాయి కి ఎదిగారు. 1952-57 మధ్యకాలంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా వ్యవరించారు. నేడు దేశంలో ప్రముఖ బ్యాంకుగా చలామణి అవుతున్న ఆంధ్రాబ్యాంక్‌ను 1923లో స్థాపిం చాడు. అంతేకాకుండా ఈయన స్థాపించిన ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెని (1925), హిందు స్తాన్ ఐడియల్ ఇన్సూరెన్స్ కంపెని (1935) లు తరువాతి కాలంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో విలీనమయ్యాయి. రాష్ట్రం బయట పనిచేసిననూ తెలుగు భాషపై మమకారం కోల్పోలేదు. తను స్థాపించిన ఆర్థిక సంస్థలలో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలని సూచించాడు. తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎన్నో చిరస్మరణీయ సేవలను అందించారు. నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైన ఆయనకు రాష్ట్ర మంత్రి వర్గంలో అవకాశం తలుపుతట్టినా, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతి పదవి గుమ్మం వరకు వచ్చినా సున్నితంగా తిరస్కరించి ప్రజాసేవలో, రాజకీయాల్లో మునిగిపోయిన మహనీయుడు డాక్టర్ పట్టాభి సీతారామయ్య. Body:
Post date: Sun, 11/25/2012 - 09:50
Path: /node/1102 |
|
విభాగము:
వివరణ:
కందుకూరి వీరేశలింగం పంతులు (1848 -1919)- తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త, మన తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి . సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు,తెలుగు సాహితీ వ్యాసంగంలోనూ నిరుపమానమైన కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. యుగకర్త గా,హేతువాదిగా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది.ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి. |
|
విభాగము:
వివరణ:
ఆయన సమర్పించిన ‘అసమ్మతిపత్రం’లో, లేఖల్లో కనిపించే ఆయన దృక్పథాన్ని బట్టి చూస్తే ఆయన విమర్శ రంగంలో కూడా ఎంత విశిష్టత సంపాదించగలరో అర్ధమవుతుంది. అయితే ఆయన తలపెట్టి, నిర్వహించలేకపోయిన పనుల్లో ఇదొకటి. దాని వల్ల తెలుగు సాహిత్యం ఆ మేరకు నష్టపోయింది. తాను సంకల్పించి చేయలేని పను గురించి ఆయన ఉత్తరాల్లో తెలుస్తూ ఉంటాయి. ‘తెలుగు వ్యాకరణం’ వ్రాతామనుకున్నానా ఆరంభించిన పని అలాగునే నిద్ర పోతూ ఉంది (ఒంగోలు ముని సుబ్రహ్మణ్యానికి, 1909 మే 17). మరొక నాటకం వ్రాతామని కథా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాను (ఆయనకే 1909 మే 24). ఆంధ్రకవుల, వారి పోషకుల కాల నిర్ణయం కోసం కావ్యాల ప్రథమాశ్వాసాలని పరిశీలించే పనీ ఒంగోలు మునిసుబ్రహ్మణ్యం మీద పడింది. అప్పారావుగారికి ‘ఆంధ్ర కవుల చరిత్రను వ్రాసి ప్రచురించవలెనని ఆశయమై ఉండె’నని ఆయన రాశారు. అయితే ఆ పనులు సాగలేదు.‘ఒక కావ్యాన్ని చదివి దాన్ని సునిశితంగా పరిశీలించి తూచినట్టు విలువ కట్టే విమర్శకులు మనలో బహు అరుదు’ (లేఖలు) అని ఆయన అభిప్రాయపడ్డారు. కావ్యాల విషయంలోనే కాదు, భాషాపరంగా కూడా సరైన విమర్శ లేదని ఆయన అభిప్రాయం. ఇవాళ తెలుగు కవితా పద ప్రయోగాల వ్యాకరణం పదకొండవ శతాబ్దినాటి ఆది కావ్యం నాటి వ్యాకరణం గానే ఉంది. ఇవాళ ఆ పాతగిల్లిన పదజాలాన్నే వాడుతూ ఉన్నారు. ఆ వ్యాకరణం పడికట్టునే పట్టుకు వేళాడుతున్నారు. భాషకు సంబంధించిన శాస్త్రీయ అధ్యయనమే జరగడం లేదు. ఒక్క గిడుగు రామమూర్తి పంతులు తప్ప యెవళ్ళూ ఈ కృషి చెయ్యడం లేదు’ అంటూ తన అభిప్రాయాలు వెల్లడించారు. ఆయన అభిప్రాయంలో సాంఘిక, రాజకీయ, సాహిత్య లక్ష్యాలు మారేయి. సాహిత్యం ఏ కొద్దిమందికో మాత్రమే గిరి గీసుకు పోయి కూర్చోలేదు. బ్రిటిష్ విద్యావిధానం వల్ల జీవితం పట్ల, భాష పట్లా, సాహిత్యం పట్లా ప్రజల దృక్పథం మారింది. ఒప్పుడు విద్యా, సాహిత్యాలు సమాజంలో ఒక శ్రేణికి మాత్రమే గుత్త హక్కుగా ఉండేవి. వారికి సంస్కృత మర్యాదలే అనుల్లంఘనీయంగా కనిపించేవి. పరిస్థితి మారింది. ప్రజాస్వామిక విధానం వల్ల జన సామాన్యానికి విద్య అందుబాటులోకి వచ్చింది. ఒక వర్గానికి మాత్రమే పరిమితమైన భాషా సాహిత్యాలు జనసామాన్యానికీ అందుబాటులోకి రావాలి. అంచేత పాతపడిన పదసంచయం, కాలం చెల్లిన కావ్యమర్యాదలూ పోవాలి. పాత పద్ధతిలో ఎంత పాండిత్య ప్రకర్షతో, పద గుంభనతో ఓ కావ్యం ఉంటే అంత గొప్ప. అందుకు గాను కావ్య భాషలో ఒక పదానికి అనేక పర్యాయ పదాలు ఉండేవి. దాంతో భాష గుది బండలా తయారైంది. అలాంటి ఇబ్బందులకు సెలవు చెప్పి ఆధునిక వ్యవహారిక తెలుగు వాడుకలోకి వస్తే తెలుగు గ్రంథాల రాశి, వాసి కూడా పెరుగుతాయి. కావ్యభాషలోనే రాయాలన్న నిబంధన వల్ల చదువుకున్నవాళ్ళు కూడా యెక్కడ వ్యాకరణ నియమాలకి భంగం కలుగుతుందో, ఎక్కడ శబ్దాలని అపసవ్యంగా ప్రయోగించడం జరుగుతుందో నని బెదిరిపోతున్నారు. మామూలుగా అయితే వాళ్ళు హాయిగా తమ భావాల్ని వెల్లడించగలరు. కాని రాతలో భాష ఆ పాత నియమాలకు కట్టుబడి ఉండాలన్న నియమం వల్ల జంకుతున్నారు. వాడుక భాష వస్తే ప్రజలకి స్వేచ్ఛ వస్తుంది. వికాసం వస్తుంది. భావవిప్లవం వస్తుంది. ఇలాంటి అభిప్రాయాలకి భిన్నంగా వ్యవహారిక భాషను వ్యతిరేకిస్తూ గ్రాంథిక భాషా వాదులు అనేక వాదనలు లేవదీశారు. వాటన్నిటికీ అప్పారావు సమాధానం చెప్పేరు. ఒక ప్రామాణిక భాష అన్ని మాండలికాల్నీ ఇముడ్చుకుంటూ పరిపుష్టం చేసుకుంటూ వెల్లివిరుస్తుందని చెప్పేరు. ఇంగ్లీషు, ఫ్రెంచి సాహిత్య భాషలు లండన్, పారిస్ పలుకుబళ్ళనుంచి రూపు తీసుకున్నాయని చెప్పేరు. అలాగే ఇటాలియన్ డక్కనీ నుడికారం నుంచి ప్రామాణికత సంపాదించుకుందని చూపించేరు (ఇవాళ ప్రాంతీయ నుడికారాల గురించి చర్చ జరుగు తూఉంది. కారణాలు ఏమిటైందీ వివరించడం అనవసరం. కాని అన్ని ప్రాంతాల వాళ్ళూ కొన్ని మినహాయింపులున్నా, అందరికీ బోధపడే భాషనే రాస్తున్నారు, మాట్లాడుతున్నారు). భాషా పరంగా ఇంత విమర్శనాత్మకంగా శాస్ర్తీయ దృక్పథాన్ని వివరించి గురజాడ సాహిత్యం గురించీ తన విమర్శను అసమ్మతి పత్రంలో ప్రకటించేరు. ఉత్తరాలలో వెల్లడించిన అభిప్రాయాలకి, అసమస్మతి పత్రంలో వెల్లడించిన అభిప్రాయాలకీ పునాది ఒక్కటే. శాస్త్రీయ పద్ధతిలో గ్రంథాల్ని విమర్శించడం. విజ్ఞాన చంద్రికా గ్రంథమాల ప్రచురించిన నవల ‘విజయనగర సామ్రాజ్యం’ గురించి సుదీర్ఘ విమర్శ చేశారు. దానికి బహుమతి కూడా వచ్చింది. ఆ నవలని ప్రధాన సంపాదకుడు, మేనేజర్ ఆమోదించి ప్రచురించినట్టు రచయిత ముందు మాటలో చెప్పుకున్నారు. సంపాదకులు ‘విజయ నగర సామ్రాజ్యం’ యెంత గొప్ప నవలో ప్రశంసించినట్టూ రచయిత చెప్పుకున్నారు. అంచేత సంపాదకులతో సహా అందరూ దాని బాగోగులకి బాధ్యత వహించాలని గురజాడ ముందే ప్రస్తావించేరు. రచయితకి చరిత్ర గురించిన పరిజ్ఞానమూ లేదు. విషయానికి సంబంధించి వాస్తవాలు ఏమిటైందీ జాగ్రత్తగా చూసుకునే మెలుకువా లేదు. రెండ్రోజులు మాత్రమే చరిత్ర చదివి, రచనకి శ్రీకారం చుట్టి, నెల లోపు పూర్తి చేసినట్టు జంకూ గొంకూ లేకుండా చెప్పుకోవడం యెంత ఆక్షేపణీయమో గురజాడ విశదీకరించేరు. అసలు చారిత్రక నవలల ఇతి వృత్తం విషయంలో ప్రామాణిక రచనలు చదవలేదు. సీవెల్ రాసిన ‘విస్మృత సామ్రాజ్యం’ గురించి తెలియదు. దాంతో చరిత్రలో యథార్థంగా జరిగిన విషయాన్నీ వక్రీకరించేడని గురజాడ తప్పు పట్టేరు. ఆయన ఉత్తమ సాహిత్య లక్షణాల గురించి మెరుపు మెరిసినట్టు సూచనలు చేశారు. తనే శాస్ర్తీయ పద్ధతిలో ఆంధ్ర కవుల చరిత్ర రాద్దామని సంకల్పించారు.కందుకూరి వీరేశలింగం రాసిన ‘కవుల చరిత్ర’ వచ్చింది. దాన్ని ఆయన పరిశీలించిన తీరు ఆయన దృక్పథానికి అద్దం పడుతుంది. ఈ పుస్తకం అటు పక్షుల్లోకీ రాదు, ఇటు జంతువల కిందకీ చేరదు. ఎలా వర్గీకరించాలి? అసలిది కవుల జీవితమే కాదు చెప్పాలంటే. కవుల జీవిత చిత్రణకి ప్రయత్నమే లేదు. ఇక కవుల క్రమం సంగతి సరే సరి అని చెబుతూ జాన్సన్ కృతిని యెత్తి చూపిస్తారు. గురజాడ లేఖల్లో, రచనల్లో వెల్లడించిన అభిప్రాయాల బట్టి ఆయన ఎంతటి విమర్శకుడు అయి ఉండేవాడో తెలుస్తుంది.
Body:
Post date: Tue, 09/25/2012 - 14:20
Path: /node/891 |
|
విభాగము:
వివరణ:
1941, 1943 సంవత్సరాల్లో భువనగిరిలో జరిగిన పదకొండవ, పన్నెండవ ఆంధ్ర మహాసభలకు అధ్యక్షత వహించి, విజయవంతం చేశారు. 1922-38 వరకు హైదరాబాద్ స్టేట్ హరిజన సేవక సంఘం కార్యదర్శిగా పనిచేశారు. గాంధీ, మావో, హోచిమిన్, కృశ్చేవ్‌లను స్వయంగా కలిసిన సమరశీలి. ఒకసారి మహాత్మాగాంధీ హైదరా బాద్‌కు వచ్చినప్పుడు తన భార్య సీతాదేవితో వెళ్ళి కలిశారు. భార్య ఒంటిపై ఉన్న నగల న్నింటినీ గాంధీ చేతిలో పెట్టి, హరిజన సేవక సంఘానికి ఇవ్వమని చెప్పిన నిరాడం బరుడాయన. సాయుధ పోరాట సమయంలో తన వందల ఎకరాల సొంత భూమిని రైతులకు పంచిన ఉదారవాది. రావి నారాయణరెడ్డి అందరికీ తెలిసిన కమ్యూ నిస్టు మాత్రమే కాదు. కొందరికే తెలిసిన సంఘ సంస్కర్త, ఉదార ప్రజాస్వామికవాది కూడా. 1939లో కమ్యూనిస్టు పార్టీలో చేరకముందు సుమారు 11 ఏళ్లపాటు ఆయన ‘సామాజిక న్యాయం’ సాధించడానికి శ్రమించారు. 23 ఏళ్ల వయసులో హరిజన సేవాసంఘాన్ని నెలకొల్పి దాని ప్రధాన కార్య దర్శి హోదాలో హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా 100 పాఠశాలలు ప్రారంభించారు. రెండు వసతి గృహాలను నిర్వహించారు. నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణ సమీపంలోని బొల్లేపల్లి గ్రామంలో 1908 జూన్ 5న భూస్వామ్య కుటుంబంలో జన్మించిన రావి నారాయణరెడ్డి ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా తలెత్తిన ప్రజాపోరాటానికి చూపునిచ్చిన జననేతగా ప్రసిద్ధుడు. భూస్వామ్య వ్యతిరేక తిరుగుబాటు ఉద్యమంలో నిజామాంధ్ర మహాసభలోని భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆర్యసమాజ్, హిందూ మహాసభలతో కలిసి పనిచేసిన కమ్యూనిస్టుగా ఆయన ఆచరణ అతి విశిష్టమైనది. ప్రజాజీవితంలో ఉన్న నాయకులు ఒక కీలకమైన చారిత్రక సన్నివేశంలో సిద్ధాంతపరంగా విభేదించే శక్తులతో ఐక్య సంఘటన ఏర్పరచి ఏకతాటిపై ఉద్యమాన్ని ఎలా నిర్మించవచ్చో తన ఆచరణ ద్వారా నిరూపించిన ప్రజాస్వామికవాది ‘రావి’. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌పై పోటీచేసి నెహ్రూకన్నా అధిక ఓట్లతో గెలిచి పార్లమెంటరీ రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించిన ఖ్యాతి ఆయనకే దక్కింది. 1975లో- సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్‌దూమ్ భవన్ శంకుస్థాపనకు -ఆనాటి సీపీఐ చైర్మన్- ఎస్‌ఏ డాంగే వచ్చారు. ఆయన్ను కలిసేందుకు కమ్యూనిస్టు నేతలు కొందరు ఒకచోట సమావేశమయ్యారు. అంతలో, ఆ గదిలోకి డాంగే ప్రవేశించారు. అందరూ లేచినిలబడి ఆయన పట్ల గౌరవం ప్రకటించారు. వారిలో రావి నారాయణరెడ్డి (ఆర్ ఎన్) కూడా ఉన్నారు. మిగతా అందరినీ వదిలి తిన్నగా రావి నారాయణ రెడ్డి దగ్గిరకు నడిచారు డాంగే. ‘కామ్రేడ్ ఆరెన్! మీరు నా గౌరవార్థం లేచి నిలబడడం తగదు! లక్షలాది మంది జనాన్ని ఒక్కమాటతో నియంత్రించిన సేనాని మీరు- మీ ముందు మేమెంతవాళ్లం?’ అంటూ వినయపూర్వకంగా అన్నారు. డాంగే ‘మాటతీరు’ తెలిసినవారికి, ఆయన వినయం చూసి మతిపోయింది. తెలంగాణ రైతాంగ సాయుధపోరాట సారథిగా చరిత్ర సృష్టించారు ఆర్ ఎన్. రజాకార్ రాక్షస రాజ్యాన్ని మట్టికరిపించిన చరితార్థుడు ఆయన. దాదాపు నాలుగేళ్లు సాగిన సాయుధ పోరాటం నిజామ్ పాలనలోని వేలాది గ్రామాలను ఫ్యూడల్ బంధనాలనుంచి విముక్తి చేసింది. జాతీయోద్యమం బలంగా వేళ్లూను కున్న ప్రాంతాల్లో మాత్రమే కమ్యూనిస్టు పార్టీ బలంగా ఉంటుందని, అందుకు కారణం ఉద్యమంలో పాల్గొన్న అనుభవం వలన వాళ్లు కేవలం విడివిడి వృక్షాలను కాక, మొత్తం అరణ్యాన్ని చూడగలరన్నది ఆయన విశ్వాసం. ఆంధ్రమహాసభ కార్యకలాపాల్లో క్రియా శీలంగా పాలుపంచుకొన్న అనుభవంతో రాటుదేలడం వల్లే తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టులు గణనీయమైన విజయాలను కైవసం చేసుకోవడం సాధ్యమైందని ఆయన తరచు అంటుండేవారు. 1941లో నల్లగొండ జిల్లా చిలుకూరులో జరిగిన ఎనిమిదవ నిజామాంధ్ర మహాసభకు, 1944లో భువనగిరిలో జరిగిన మహాసభకు ఆయనే అధ్యక్షత వహించారు. భువనగిరి సమావేశాల్లోనే ఆంధ్రమహాసభ అతివాద, మితవాద శిబిరాలుగా చీలిపోయింది. దేశ స్వాతంత్య్రానికి ముందు సాగిన సాయుధ పోరాటాన్ని వ్యూహాత్మకంగా సమర్థించిన రావి నారాయణరెడ్డి 1947 తరువాతి కాలంలో పోరాటాన్ని కొనసాగించాలనే ‘మెజారిటీ’ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను, సమ సమాజ ఆకాంక్షలతో కలగాపులగం చేయడం వల్లే 1948 ఫిబ్రవరిలో పార్టీ పోరాటం కొనసాగించాలనే తప్పుడు నిర్ణయం తీసుకుందన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం. చరిత్ర ఆయన మార్గమే సరైనదని తీర్పు చెప్పడం విశేషం. కాళోజీ నారాయణరావు ప్రవచించిన ‘వేరు తెలంగాణ’ను తాత్వికంగా వ్యతిరేకించడంతో ఆగక తాను ఎన్నటికీ ‘వీరతెలంగాణ’ వాదిగానే ఉంటానని చాటిన తెలంగాణ ముద్దుబిడ్డ రావి నారాయణరెడ్డి.
Body:
Post date: Thu, 09/13/2012 - 22:42
Path: /node/886 |
|
విభాగము:
వివరణ:
బాల్యము మరియు విద్యాభ్యాసము : సంజీవయ్య 1921 ఫిబ్రవరి 14న కర్నూలు జిల్లా, కల్లూరు మండలములో, కర్నూలు నుండి ఐదు కిలోమీటర్ల దూరములో ఉన్న పెద్దపాడు లో ఒక దళిత కుటుంబములో మునెయ్య, సుంకులమ్మ దంపతులకు జన్మించాడు. ఐదుగురు పిల్లలున్న ఆ కుటుంబములో చివరివాడు సంజీవయ్య. ఆయన కుటుంబానికి సొంత భూమి లేకపోవడము వలన నేత పనిచేసి, కూలి చేసి జీవనము సాగించేవారు. సంజీవయ్య పుట్టిన మూడు రోజులకు తండ్రి మునెయ్య చనిపోగా కుటుంబము మేనమామతో పాలకుర్తికి తరలివెళ్లినది. అక్కడ సంజీవయ్య పశువులను కాసేవాడు. మూడు సంవత్సరాల తరువాత తిరిగి పెద్దపాడు చేరుకున్నారు. సంజీవయ్య అన్న చిన్నయ్య కుటుంబ పోషణ బాధ్యతలు స్వీకరించి సంజీవయ్యను బడికి పంపించాడు. పెద్దపాడులో 4వ తరగతి వరకు చదివి ఆ తరువాత కర్నూలులోని అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ పాఠశాలలో చేరాడు. 1935 లో కర్నూలు మున్సిపాలిటీ ఉన్నత పాఠశాలలో చేరి 1938 లో SSLC (ఎస్.ఎస్.ఎల్.సీ) జిల్లాలోనే ప్రధమునిగా ఉత్తీర్ణుడయ్యాడు. ఉద్యోగాలు : ఆ తరువాత చిన్నయ్య ఆర్ధిక సహాయముతో అనంతపురం ప్రభుత్వ సీడెడ్ జిల్లాల కళాశాల లో గణితము మరియు ఖగోళ శాస్త్రములు అధ్యయనము చేశాడు. 1942లో బీ.ఏ పూర్తి చేసిన తర్వాత జీవనోపాధి కొరకు అనేక చిన్నా చితక ఉద్యోగాలు చేశాడు. అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధము వలన ఉద్యోగాలు దొరకడము చాలా కష్టముగా ఉన్నది. సంజీవయ్య కర్నూలు పట్టణ రేషనింగ్ ఆఫీసులో గుమస్తాగా 48.80 రూపాయల జీతముతో ఉద్యోగములో చేరాడు. 1944 లో కొంతకాలము మద్రాసు కేంద్ర ప్రజా పనుల శాఖ (CPWD) కార్యాలయములో సహాయకునిగా పనిచేశాడు. 1945 జనవరిలో కేంద్ర ప్రజాపనుల శాఖా తనిఖీ అధికారిగా బళ్లారిలో పనిచేశాడు. ఈ గజెటెడ్ హోదా కల ఉద్యోగము డిసెంబర్ 1945 లో రద్దయ్యేదాకా 11 నెలల పాటూ పనిచేశాడు. ఆ తరువాత కొంత సమయము మద్రాసులోని పచ్చయప్ప పాఠశాలలో అధ్యాపకునిగా పనిచేసాడు. సంజీవయ్య 1946 లో అప్పటి బళ్లారి జిల్లా జడ్జి కే.ఆర్.కృష్ణయ్య చెట్టి ప్రోత్సాహముతో మద్రాసు లా కాలేజీలో 'ఎఫ్.ఎల్' (F.L) లో చేరాడు. అప్పట్లో కాలేజిలో స్కాలర్‌షిప్ప్లు ఇచ్చే పద్ధతి ఉండేది కాదు. అందువలన సంజీవయ్య మద్రాసు జార్జ్‌టౌన్ లోని ప్రోగ్రెస్సివ్ యూనియన్ హైస్కూల్ లో పార్ట్ టైం గణిత అధ్యాపకునిగా పనిచేశాడు. అక్కడ ఇచ్చే 90 రూపాయల జీతముతో హాస్టలు ఖర్చులు భరించేవాడు. లా చదువుతున్నపుడు సంజీవయ్యకు రోమన్ న్యాయానికి సంభందించిన లాటిన్ పదాలు గుర్తుపెట్టుకోవడము కష్టమయ్యేది. లాలో ఆయనకు సహాధ్యాయి అయిన ప్రముఖ రచయిత రావిశాస్త్రి వాటిని తెలుగు పాటగా మలిచి పాడుకుంటే బాగా గుర్తుంటాయని సలహా ఇచ్చాడు. లా చదివే రోజుల్లో సంజీవయ్య చంద్రగుప్త అనే నాటకములో పాత్ర ధరించాడు. శివాజీ అనే ఇంకొక నాటకాన్ని తనే రచించి రంగస్థలము మీద ప్రదర్శించాడు. ఈయన గయోపాఖ్యానము గద్యముగా రచించాడు అయితే ఇందులో ఏ ఒక్కటి ప్రస్తుతము లభ్యము అవుటలేదు. లా పట్ట చేతపుచ్చుకొని సంజీవయ్య 1950 అక్టోబర్ లో మద్రాసు బార్ లో న్యాయవాదిగా నమోదు చేసుకొన్నాడు. ఈయన గణపతి వద్ద ఆ తరువాత జాస్తి సీతామహాలక్ష్మమ్మ వద్ద సహాయకునిగా పనిచేశాడు రాజకీయ రంగప్రవేశము : సంజీవయ్యకు విద్యార్ధిగా ఉన్న రోజుల్లో రాజకీయాలపై, స్వాతంత్ర్యోద్యమముపై ఏమాత్రము ఆసక్తి చూపలేదు. కానీ లా అప్రెంటిసు చేస్తున్న సమయములో వివిధ రాజకీయనాయకుల పరిచయము మరియు సాంగత్యము వలన రాజకీయాలలో ప్రవేశించాలనే ఆసక్తి కలిగినది. 1950 జనవరి 26న రాజ్యాంగము అమలులోకి రావడముతో అప్పటి దాకా రాజ్యాంగ రచన నిర్వహించిన భారత రాజ్యాంగ సభ ప్రొవిజనల్ పార్లమెంట్ గా అవతరించినది. అయితే ప్రొవిజనల్ పార్లమెంటులో, రాష్ట్రాల శాసనసభలలో రెండిట్లో సభ్యత్వము ఉన్న సభ్యులు ఏదొ ఒకే సభ్యత్వముని ఎన్నుకోవలసి వచ్చినది. షెడ్యూల్డ్ కులమునకు చెందిన ఎస్.నాగప్ప అలా తన శాసనసభ సభ్యత్వము అట్టిపెట్టుకొని ప్రొవిజనల్ పార్లమెంటుకు రాజీనామా చేయడముతో ఆ స్థానమును పూరించడానికి బెజవాడ గోపాలరెడ్డి, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రేసు కమిటీ తరఫున సంజీవయ్యను ఎంపిక చేశాడు. ఎన్నికలు జరిగి తొలి విధానసభ ప్రమాణస్వీకారము చేయడముతో 1952 మే 13 న ప్రొవిజనల్ పార్లమెంటు రద్దయినది. టంగుటూరి ప్రకాశం పంతులు మంత్రివర్గములో ఆరోగ్యశాఖా మంత్రిగా ఉండగానే సికింద్రాబాదులో పాఠశాల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న కృష్ణవేణి ని సంజీవయ్య 1954, మే 7 న పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు. వీరికి సంతానము లేదు. సుజాత అను ఒక బాలికను దత్తత తీసుకున్నారు. 1967లో ఎన్నికల ప్రచార సమయములో విజయవాడ నుండి హైదరాబాదుకు వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదం నుంచి పూర్తిగా ఎన్నటికి కోలుకోలేకపోయాడు. 1972 మే 7 వ తేదీ రాత్రి 10:30 గంటల ప్రాంతములో ఢిల్లీలో గుండెపోటుతో మరణించాడు. ఆయన అంత్యక్రియలు మే 9వ తేదీన సికింద్రాబాదులోని పాటిగడ్డలో అధికార లాంఛనాలతో జరిగినవి. ఆయన స్మారకార్ధం పాటిగడ్డ సమీపమున ఒక ఉద్యానవనమును పెంచి ఆయన పేరుమీదుగా సంజీవయ్య పార్కు అని పేరు పెట్టారు. నిర్వహించిన పదవులు :
బాల్యము మరియు విద్యాభ్యాసము : Body:
Post date: Thu, 09/13/2012 - 22:29
Path: /node/885 |
|
విభాగము:
వివరణ:
తొలి జీవితం :1866 సంవత్సరంలో ఫిబ్రవరి 22వ తేదీన పాత గుంటూరు లో కొండా వెంకటప్పయ్య జన్మించాడు. ప్రాధమిక విద్య గుంటూరు మిషన్ స్కూలులో, ఉన్నత విద్య మద్రాసు క్రైస్తవ కళాశాలలో పూర్తిచేసి తరువాత బి.ఎల్. పట్టాపొంది బందరులో న్యాయవాద వృత్తిని చేపట్టాడు. వెంకటప్పయ్యకు మొదటి నుండి పౌరవ్యవహారలలో ఎక్కువ ఆసక్తి వుండటం వలన, అదే పనులు చేయడానికి ఎక్కువ ఉత్సాహపడేవాడు. దేశభక్తి, ప్రజాసేవాతత్పరత కలిగిన వెంకటప్పయ్య చదువుకునే రోజుల్లోనే పిల్లలకు పాఠాలు చెప్పగా వచ్చే ఏడురూపాయిలు తన తోటి విద్యార్థికి సహాయంగా ఇచ్చేవాడు. కృష్ణా పత్రిక :ఇరవయ్యో శతాబ్ది ఆరంభంలో, జాతిని చైతన్యవంతం చేయడానికి అనేక రంగాలలో కృషి జరుగుతున్న రోజులలో వెంకటప్పయ్య 1902లో వాసు నారాయణరావుతో కలసి కృష్ణా పత్రిక ప్రచురణను ప్రారంభించాడు. 1905 వరకు ఆయనే ఆ పత్రికను నడిపి, గుంటూరులో స్థిరపడగానే దాని సంపాదకత్వ బాధ్యతలను ముట్నూరు కృష్ణారావు కు అప్పగించాడు. న్యాయవాద వృత్తిలో వెంకటప్పయ్య కేవలం ధనార్జనే ప్రధాన వృత్తిగా పెట్టుకోలేదు. దాన, ధర్మాల కోసం సొంత ఆస్తినే అమ్ముకొనవలసి వచ్చింది. ఉన్నవ దంపతులు స్థాపించిన శారదా నికేతన్కిస వెంకటప్పయ్య తన ఆస్తి నుంచి కొంత భాగం అమ్మివేసి పది వేల రూపాయల విరాళం ప్రకటించాడు. 1910లో బందరులో జాతీయ కళాశాలకు ఆయన ప్రారంభోత్సవం జరిపాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు ప్రతిపాదన :1912 మే నెలలో కృష్ణా గుంటూరు జిల్లాల రాజకీయ మహాసభ నిడదవోలులో జరిగింది. అప్పటికి పశ్చిమ గోదావరి జిల్లాలేదు. కొవ్వూరు నుంచి బెజవాడ వరకు కృష్ణా జిల్లాయే. ఆ సభలోనే కొండా వెంకటప్పయ్య సలహాపై ఉన్నవ లక్ష్మీనారాయణ మొదలగు గుంటూరు యువకులు పదకొండు తెలుగు జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలనే విషయంలో మంతనాలు జరిపారు. 1913లో గుంటూరు జిల్లా రాజకీయ మహాసభ బాపట్లలో జరిగింది. అదే ప్రదేశంలో కొండా వెంకటప్పయ్య సలహా మేరకు ప్రధమాంధ్ర మహాసభ బి.ఎస్.శర్మ అధ్యక్షతన జరిగింది. దేశవ్యాప్త ప్రచారం కోసం ఏర్పడిన రాయబార వర్గంలో కొండా వెంకటప్పయ్యదే ప్రధాన పాత్ర. నెల్లూరు లో జరిగిన ఆంధ్ర మహాసభకు అతనే అధ్యక్షుడిగా ఎన్నికై ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికి ఒక నిర్దిష్ట కార్యక్రం రూపొందించాడు. 1917లో రాజ్యాంగ సంస్కరణల విషయమై పరిశీలనలు జరపడానికి మాంటేగ్ - చమ్స్ఫపర్డ్ ప్రతినిధి వర్గాన్ని ప్రభుత్వం నియమించింది. ఈ ప్రతినిధివర్గం మద్రాసు కు వచ్చినప్పుడు భాషా ప్రాతిపదిక మీద రాష్ట్రాల విభజన అవసరాన్ని ఉగ్గడించిన ఆంధ్ర ప్రతినిధులలో కొండా వెంకటప్పయ్య ముఖ్యుడు. 1918లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీ ఏర్పడింది. రాష్ట్ర సాధనలో ఇది తొలివిజయం. ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీకి తొలి కార్యదర్శి వెంకటప్పయ్యే. ఆ రోజుల్లో కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు కలసి ఒకే నియోజక వర్గంగా ఉండేది. ఓటర్లు అంతా కలిపితే 500 మంది మాత్రమే. ఈ నియోజక వర్గం నుంచి పోటీ చేసి కొండా వెంకటప్పయ్య మద్రాసు కౌన్సిలుకు ఎన్నికయ్యాడు. సహాయక నిరాకరణోద్యమం కొనసాగించడానికి వీలుగా కాంగ్రెసు పార్టీ తన సభ్యుల రాజీనామా కోరగానే కొండా వెంకటప్పయ్య అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ఆ తరువాత ఆయన ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడై అభిలభారత కాంగ్రెస్ సభ్యుడయ్యాడు. 1921 మార్చి 31, ఏప్రిల్ 1 తేదీలలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు బెజవాడలో జరిగాయి. మహాత్ముని ఆంధ్ర పర్యటన వెంకటప్పయ్య ఆధ్వర్యంలోనే జరిగింది. వేలాది రూపాయల విరాళాలుగా స్వీకరించి స్వరాజ్యనిధికి సమర్పించాడు. పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యంలో పాల్గొన్నందుకు ఆయన మొదటిసారి శిక్ష అనుభవించాడు. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా :1923 లో కాకినాడ లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు చారిత్రాత్మకమైనవి. సహాయనిరాకరణ శాసనోల్లంఘనల అనంతరం శాసన సభా ప్రవేశ వాదులకు, బహిష్కరణ వాదుల మధ్య తీవ్ర చర్చలు జురుగుతున్న రోజులవి. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన దేశబంధు చిత్తరంజన్ దాస్ ఈ విభేదాల మధ్య తన పదవికి రాజీనామా చేశాడు. మధ్యే మార్గంగా వెంకటప్పయ్యని అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శి అయ్యాడు. స్వల్పకాలమే అయినా అఖిల భారత కాంగ్రెస్ కార్యాలయాన్ని బెజవాడకు తరలించారు. ఇది ఆంధ్ర రాజకీయ చరిత్రలో స్వర్ణ ఘట్టం. గాంధీజీ తలపెట్టిన ప్రతి ఉద్యమానికి ఆంధ్రలో కొండా వెంకటప్పయ్యే ఆ రోజుల్లో నాయకత్వం వహించేవాడు. ఆంధ్ర ఖద్దరుకి యావద్దేశ ప్రచారం లభించడానికి కొండా వెంకటప్పయ్య కృషి ప్రాధనమైనది. 1933లో మహాత్ముడు ఆంధ్రలో హరిజన యాత్ర సాగించాడు. అనేక గ్రామాలలో హరిజనులచేత దేవాలయ ప్రవేశం చేయించాడు. ఆంధ్రదేశంలో ౬౫వేల రూపాయలు హరిజన నిధి వసూలైంది. ఒక వంక భార్య మృత్యుశయ్యపై ఉన్నప్పటికీ కొండా వెంకటప్పయ్య హరిజన సేవలో ఉన్నతులై తిరుగుతున్నాడని మహాత్మాగాంధీ అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడుగా :1929లో సైమన్ కమీషన్ రాక సందర్భంలోనూ, 1930లో ఉప్పు సత్యాగ్రహంలోనూ, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నందుకు కొండా వెంకటప్పయ్యకు జైలు శిక్షలు విధించారు. 1937లో జరిగిన ఎన్నికల్లో ఆయన మద్రాసు శాసన సభకు ఎన్నికయ్యాడు. భాషా ప్రాతిపదిక మీద మద్రాసు రాష్ట్రాన్ని ఆంధ్ర, తమిళ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలుగా విభిజించాలని కొండా వెంకటప్పయ్య శాసన సభలో ప్రవేశ పెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా నెగ్గింది. 1920 నుంచి 1949లో కీర్తి శేషులయ్యే వరకు ఆంధ్రదేశమే తానుగా వ్యవహరించి ఆంధ్రల అభిమానానికి పాత్రుడైన మహానాయకుడు దేశభక్త కొండా వెంకటప్పయ్య. ఆంధ్ర రాజకీయాలలో ఆయన స్థానం దేశ రాజకీయలలో మదనమోహన మాలవ్యా స్థానం లాంటిది. కాంగ్రెస్ అగ్రనాయకులందరు దేశ భక్తను గౌరవించేవారు. ఏమైనా యావద్భారత రాజకీయరంగంలో ఆంధ్రజాతి తన ప్రతిభకు, త్యాగాలకు సముచిత స్థానం పొందలేకపోయినట్లే, "దేశభక్త " కొండా వెంకటప్పయ్య అఖిల భారత రాజకీయలలో తన ప్రతిభకు, త్యాగానికి సముచిత స్థానం పొందలేకపోయాడు. 1938లో మద్రాసు రాష్ట్రంలో రాజాజీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాష్ట్ర శాసన సభా కాంగ్రెస్ పక్షంలో ముగ్గురు కార్యదర్శులలో ఒకడిగా ఆయన్ను నియమించి ఆయన త్యాగలకు ఆ విధంగా విలువకట్టారు. ఆంధ్ర రాష్ట్ర హిందీ ప్రచార సభకు కూడా అధ్యక్షడిగా పని చేశాడు. అఖిల భారత చరఖా సంఘానికి జీవిత కాలం సభ్యుడిగా వున్నాడు. గ్రంథాలయోద్యమానికి కూడా తోడ్పడ్డాడు. రచనలు :కొండ కడలూరు జైలులో వున్నప్పుడు "డచ్ రిపబ్లిక్" అనే గ్రంథాన్ని రచించాడు. తన స్వీయ చరిత్రను రెండు భాగాలుగా రాశాడు. "శ్రీ వేంకటేశ్వర సేవానంద లహరి" అన్న భక్తి రసభరితమైన శతకాన్ని రచించాడు. ఆయన ఇంగ్లీషులోనూ తెలుగులోనూ మంచి వక్త, కవి. మొదటి నుంచి నాటకాలంటే కొండా వెంకటప్పయ్యకు చాలా మక్కువ, స్త్రీ పాత్రను పోషించి ప్రేక్షకుల మన్ననలను పొందాడు. కళాదృష్టితో, కళాతృష్ణతో, మానవతవాదిగా, దేశభక్తుడుగా జీవితాంతం కృషి చేసిన నిరాడంబరమూర్తి కొండా వెంకటప్పయ్య 1949 ఆగష్టు 15 వ తేదీన దేశ స్వాతంత్ర్య పుణ్యదినాన దేశభక్తులైన వారందరినీ సంతాప సాగరంలో ముంచుతూ స్వర్గస్థులయ్యాడు. స్వాతంత్రం తరువాత కాంగ్రెస్ గురించి :కొండా వెంకటప్పయ్య ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి. స్వాతంత్ర్యం తరువాత పెచ్చుపెరిగిన అవినీతి గురించి ఆయన మహాత్మా గాంధీకి ఇలా రాసాడు.
ఇది స్వాతంత్రం వచ్చిన నాలుగు నెలలలో, 1947 డిసెంబరులో కొండా వెంకటప్పయ్య మహాత్మా గాంధీకి వ్రాసిన లేఖ
Body:
Post date: Sun, 09/09/2012 - 20:00
Path: /node/835 |
|
విభాగము:
వివరణ:
పనప్పాకం ఆనందాచార్యులు, చిత్తూరు జిల్లాకు చెందిన కడమంచి గ్రామంలో 1843 సంవత్సరంలో జన్మించారు. వీరి తండ్రి శ్రీనివాసాచార్యులు. వీరు చిత్తూరు జిల్లా కోర్టులో ఉద్యోగం చేశారు. తండ్రి మరణానంతరం ఆతని మిత్రుడైన సి. వి. రంగనాథ శాస్త్రులు సహాయంలో 1863లో మెట్రిక్యులేషన్, తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో 1865లో ఎఫ్.ఎ పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు. తర్వాత పచ్చియప్పా పాఠశాలలో ఉపాధ్యాయునిగా 1969 వరకు పనిచేశారు. ప్రైవేటుగా చదివి 1869లో బి.ఎల్ పరీక్షలో ఉత్తీర్ణులై మద్రాసు హైకోర్టు న్యాయవాదులలో అగ్రగణ్యులైన కావలి వెంకటపతిరావు వద్ద అప్రెంటిస్ గా పనిచేశారు. 1870లో వకీలుగా అనుమతిని పొంది హైకోర్టు న్యాయవాదులలో అగ్రగణ్యులయ్యారు. మద్రాసులో న్యాయవాదుల కోసం ఒక అసోసియేషన్ స్థాపన చేయడంతో పాటు , న్యాయ విచారణ పద్దతులు, న్యాయవాదుల స్థితిగతుల మెరుగుదల కోసం చక్కని గ్రంధాలు శ్రీ అనంతాచార్యులు రచించారు. వీరు 1889లో మమద్రాస్ అడ్వకేట్స్ అసోసియేషన్ స్థాపించారు. మొదట్లో ఆనందాచార్యులు జర్నలిజం, రాజకీయాల పట్ల ఆసక్తి చూపారు. ఆయన ‘నేటివ్ పబ్లిక్ ఒపీనియన్, మద్రాసి’ అనే మ్యాగజైన్లకు వ్యాసాలు రాసేవారు. ఆ తర్వాత హిందూ పత్రిక స్థాపనకు సహాయం చేసి, వ్యాసాలు రాశారు. రాజకీయాల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి అనేక రకాలుగా సేవలందించారు. 1884లో మద్రాసు మహాజన సభను స్థాపించారు. 1885లో అఖిలా భాత జాతీయ కాంగ్రెస్ మహాసభ బొంబైలో ఏర్పాటు చేసిన నాటి నుండే, దేశ స్వాతంత్ర్య సమర సంగ్రామంలో పాల్గొని గణనీయమైన సేవచేశారు. 1891 నాగపూర్ లో జరిగిన 7వ జాతీయ సభకు వీరు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ పదవిని అలంకరించిన మొట్టమొదటి దక్షిణ భారతీయులు వీరు. వీరు కాంగ్రెసు కార్యనిర్వహక సంఘంలో సభ్యులుగాను, అలహాబాదు కాంగ్రెసు కార్యదర్శులలో ఒకరుగా ఎన్నికయ్యారు. 1896లో భారతీయ సామ్రాజ్య శాసనసభకు చెన్నై నుండి ప్రతినిధిగా ఎన్నుకోబడ్డారు. ఆ సభలో నిర్భయంగా ప్రజల హక్కులను పరిరక్షించుటలో ఎనిమిది సంవత్సరాలు పనిచేసి 1903లో రాజీనామా చేశారు. ఈయన ప్రతిభకు మెచ్చి 1887లో ఆనాటి ప్రభుత్వం రాజబహుదూర్ బిరుదు ప్రదనంతో సత్కరించారు. ఆంధ్ర భాషా సారస్వత పోషకుడిగా కీర్తి గడించడమే కాకుండా ‘పద్యావినోద’అనే బిరుదుతో ఆనాటి సాంస్కృతిక సమాజాలు సత్కరించి గౌరవించాయి. కడుపేదరికం నుండి తన మేధాసంపత్తితో కృషి, పట్టుదలతో అత్యంత ఉన్నత పదవులు అలంకరించిన ఆనందాచార్యులు 1907లో కీర్తిశేషులైనారు.
పనప్పాకం ఆనందాచార్యులు, చిత్తూరు జిల్లాకు చెందిన కడమంచి గ్రామంలో 1843 సంవత్సరంలో జన్మించారు. వీరి తండ్రి శ్రీనివాసాచార్యులు. వీరు చిత్తూరు జిల్లా కోర్టులో ఉద్యోగం చేశారు. తండ్రి మరణానంతరం ఆతని మిత్రుడైన సి. వి. రంగనాథ శాస్త్రులు సహాయంలో 1863లో మెట్రిక్యులేషన్, తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో 1865లో ఎఫ్.ఎ పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు. తర్వాత పచ్చియప్పా పాఠశాలలో ఉపాధ్యాయునిగా 1969 వరకు పనిచేశారు. ప్రైవేటుగా చదివి 1869లో బి.ఎల్ పరీక్షలో ఉత్తీర్ణులై మద్రాసు హైకోర్టు న్యాయవాదులలో అగ్రగణ్యులైన కావలి వెంకటపతిరావు వద్ద అప్రెంటిస్ గా పనిచేశారు. 1870లో వకీలుగా అనుమతిని పొంది హైకోర్టు న్యాయవాదులలో అగ్రగణ్యులయ్యారు. మద్రాసులో న్యాయవాదుల కోసం ఒక అసోసియేషన్ స్థాపన చేయడంతో పాటు , న్యాయ విచారణ పద్దతులు, న్యాయవాదుల స్థితిగతుల మెరుగుదల కోసం చక్కని గ్రంధాలు శ్రీ అనంతాచార్యులు రచించారు. వీరు 1889లో మమద్రాస్ అడ్వకేట్స్ అసోసియేషన్ స్థాపించారు. Body:
Post date: Sun, 09/09/2012 - 19:00
Path: /node/834 |
|
విభాగము:
వివరణ:
తండ్రి విశ్వనాధ శాస్త్రి సంస్కృత, తెలుగు భాషలలొ పండితుడు కావడంతో- శ్యామశాస్త్రి చిన్నతనంలో తండ్రి దగ్గరే సంస్కృతాంధ్రభాషలు అభ్యసించాడు. సంగీతంలో తన మేనమామ దగ్గర స్వరపరిచయం కల్గినా, ఆ పిదప తంజావూరులో ‘సంగీత స్వామి’ అనబడే ప్రముఖ తెలుగు సంగీత విద్వాంసుని దగ్గర, తంజావూరులోని రాజాస్థానంలో సంగీత విద్వాంసుడైన శ్రీ పచ్చిమిరియము ఆది అప్పయ్య సహకారంతో సంగీత శాస్త్రాలలో మర్మములు ఎన్నో అధ్యయనం చేశాడు.
శ్యామశాస్త్రి రచించిన అనేక కీర్తనలు ఉల్లాసం కలిగించేవి, చక్కని లయ, తాళ ప్రదర్శనలకు అనుగుణంగా ఉండేవి. నాడోపాసన ద్వారా ఆత్మానందం సాధించవచ్చని ఆయన అభిప్రాయ పడేవారు. శ్యామశాస్త్రి తెలుగు, తమిళ, సంస్కృత భాషలలొ అనేక కృతులు, కీర్తనలు రచించినా అధికభాగం తెలుగులోనే వ్రాశారు. అయితే, త్యాగరాజు తన కీర్తననలో భావ రాగలకు అధిక ప్రాధాన్యత ఇవ్వగా, శ్యామశాస్త్రి కీర్తనలలో క్లిష్టమైన ‘తాళ’ రచన చేసినట్లు సంగీతాభిమానులు అంటారు. శ్యామశాస్త్రి కీర్తనలలో క్లిష్టమైన రచనతోపాటు, ఆయనకు శిష్యులు అధిక సంఖ్యలో లేకపోవడం వల్ల కూడా, ఈయన కీర్తనలు అధిక ప్రాచుర్యం పొందలేదని వారు భావిస్తారు. శ్యామశాస్త్రి రచించిన “ప్రోవవమ్మ” , “మాంజిరాగం” అలాగే ‘కల్లడ ’(కలగడ ), ‘చింతామణి ’ రాగాలు, “హిమాద్రిసుతీ ” అనే కీర్తన, ఒకే స్వరంతో సంస్కృతం,తెలుగు భాషలలొ వేరు వేరుగా రాసిన ఆయన కీర్తనలు సంగీత కళాకారులందరికి సుపరిచతమే. శ్యామశాస్త్రి ప్రసిద్ధి చెందిన ఆనంద భైరవీ, ధన్యాసి, కల్గడ, కళ్యాణి, కాంభోజి, కాపి, చింతామణి వంటి రాగాల్లో కృతులు స్వర పరిచాడు. సంగీత పాఠాల్లో సరళీ స్వరాలు, జంట స్వరాలు, గీతాలు, స్వరజతులు, వర్ణాలు, కృతులు అనేవి ఒక పద్ధతిలో నేర్పుతారు. వీటిలో స్వరజతి రూపకర్త శ్యామశాస్త్రి. తోడి రాగంలో “రావే హిమగిరి కుమారి”, భైరవి రాగంలో ‘కామాక్షీ అనుదినము’వంటివి కొన్ని ప్రసిద్ధి జెందిన స్వరజతులు. ఈ స్వరజతులే కాకుండా విలోమ చాపు తాళాన్ని కూడా శ్యామశాస్త్రి బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. సాధారణంగా చాపు తాళం గతి 3 + 4 పద్ధతిలో ఉంటుంది. ఇలా కాకుండా 4 + 3 రీతిలో తాళ గతిని మార్చి కొన్ని కీర్తనలు స్వరపరిచాడు. పూర్వి కళ్యాణి రాగంలో ‘నిన్ను వినగ మరి’, ఫరజ్ రాగంలో ‘త్రిలోకమాత నన్ను’ అనేవి ఈ విలోమ చాపు తాళంలో ప్రసిద్ది చెందిన కీర్తనలు.
శ్యామశాస్త్రి ఇంటి ఇలవేల్పుగా కామాక్షిదేవిని కీర్తిస్తూ, తమ ఇంటి ‘ఆడపడుచుగా’ అమ్మవారిని భావిస్తూ – అపూర్వం, అనన్య సామాన్య కృతులెన్నింటినో శ్యామశాస్త్రి రచించాడని ఆయన శిష్యులు – ప్రముఖ సంగీత కళారాధకులు పేర్కొంటారు. అందువల్లనే, శ్యామశాస్త్రి తన కీర్తనలలో కొన్నింటిని “శ్యామకృష్ణ - సహోదరి” అని పేర్కొన్నట్లు వారు అంటారు. శ్యామశాస్త్రి కుమారుడు శ్రీ సుబ్బరాయశాస్త్రి కూడా ప్రముఖ వాగ్గేయకారిడిగా ప్రసిద్ది చెందాడు. శ్రీ అలసూరు కృష్ణయ్య , శ్రీ తలగంబాడి పంచనాదయ్య తదితరులు శ్యామశాస్త్రి శిష్యులలో ప్రముఖులు. కొన్నిశ్యామశాస్త్రి కృతులునవరాత్రి దేవి కృతులు : కామాక్షీ నాతో వాదా దయ లేదా , శ్యామశాస్త్రి కృతి, బేగడ రాగం
నవరాత్రి దేవి కృతులు : సరోజ దళ నేత్రి హిమ గిరి పుత్రీ , శ్యామశాస్త్రి కృతి, శంకరాభరణం రాగం
హిమాచల తనయ బ్రోచుటకి - శ్యామశాస్త్రి , ఆనందభైరవి రాగం
కనకశైల విహారిణీ అంబ - శ్యామశాస్త్రి , పున్నాగవరాళి రాగం
నిన్నువినా మరిగలదా గతి లోకములో - శ్యామశాస్త్రి కృతి
తండ్రి విశ్వనాధ శాస్త్రి సంస్కృత, తెలుగు భాషలలొ పండితుడు కావడంతో- శ్యామశాస్త్రి చిన్నతనంలో తండ్రి దగ్గరే సంస్కృతాంధ్రభాషలు అభ్యసించాడు. సంగీతంలో తన మేనమామ దగ్గర స్వరపరిచయం కల్గినా, ఆ పిదప తంజావూరులో ‘సంగీత స్వామి’ అనబడే ప్రముఖ తెలుగు సంగీత విద్వాంసుని దగ్గర, తంజావూరులోని రాజాస్థానంలో సంగీత విద్వాంసుడైన శ్రీ పచ్చిమిరియము ఆది అప్పయ్య సహకారంతో సంగీత శాస్త్రాలలో మర్మములు ఎన్నో అధ్యయనం చేశాడు.
Body:
Post date: Sun, 09/09/2012 - 17:17
Path: /node/833 |
|
విభాగము:
వివరణ:
సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉన్నది. ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా అంటారు. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. ఇతడు శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అని భావన ఉంది. "పదకవితా పితామహుడు", "సంకీరత్నాచార్యుడు", "పంచమాగమ సార్వభౌముడు", "ద్రవిడాగమ సార్వభౌముడు" - ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాదరంగా ఇచ్చిన బిరుద నామాలు. అన్నమయ్య కీర్తనలు, రచనలుఅన్నమయ్య సంకీర్తనా సేవ సంగీత, సాహిత్య, భక్తి పరిపుష్టం. అధికంగా తెలుగులోనే పాడినా అతను సంస్కృత పదాలను ఉచితమైన విధంగా వాడాడు. కొన్ని వందల కీర్తనలను సంస్కృతంలోనే రచించాడు. కొన్నియెడల తమిళ, కన్నడ పదాలు కూడా చోటు చేసుకొన్నాయి. అతని తెలుగు వ్యావహారిక భాష. మార్గ, దేశి సంగీత విధానాలు రెండూ అతని రచనలలో ఉన్నాయి. అన్నమయ్యకు పూర్వం కృష్ణమాచార్యుల వచనాలవంటివి ఉన్నా గాని అవి "అంగాంగి విభాగం లేక, అఖండ గద్య ధారగా, గేయగంధులుగా" ఉన్నాయి. శివకవుల పదాలగురించి ప్రస్తావన ఉన్నాగాని అవి లభించడంలేదు. మనకు లభించేవాటిలో అన్నమయ్యవే తొలిసంకీర్తనలు గనుక అతను "సంకీర్తనాచార్యుడు", 'పదకవితా పితామహుడు" అయ్యాడు. అన్నమయ్య "యోగ వైరాగ్య శృంగార సరణి" మొత్తం 32,000 సంకీర్తనలు రచించాడని అతని మనుమడు చిన్నన్న పేర్కొన్నాడు. అతని పుత్రపౌత్రాదులు వీటిని రాగిరేకులమీద వ్రాయించారు. ఆ రేకులను తిరుమలలో సంకీర్తనా భండాగారంలో పొందుపరచారు. అయితే ప్రస్తుతం 12,000 మాత్రమే లభిస్తున్నవి. రేకులమీది అంకెల ప్రకారం కొన్ని రేకులు లభించడంలేదు. సంకీర్తనా లక్షణమనే సంస్కృత గ్రంధం కూడా అన్నమయ్య వ్రాశాడట. మంజరీ ద్విపదలో "శృంగార మంజరి" అనే కావ్యాన్ని రచించాడు. అతడు రచించాడని చెప్పబడే 12 శతకాలలో "వేంకటేశ్వర శతకము" ఒక్కటి మాత్రమే లభిస్తున్నది. ఇతర ప్రబంధాలు, వేంకటాచల మహాత్మ్యము, సంకీర్తనలక్షణం, ద్విపద రామాయణం వంటి గ్రంధాలు లభించలేదు. భగవంతుడ్ని ద్యానించే విషయంలో, మానవాళిని ప్రేమించడం గురించి తెలియజేస్తూ మానవతా విలువలతో జీవితాన్ని ఎలా సంతోషంగా ఉంచుకొవచ్చో అన్నమయ్య తన కీర్తనల ద్వారా తెలియబరిచాడు. పండితుడికి,పామరుడికి సమంగా అర్దమయ్యె రీతిలో సంస్కృతం, తెలుగు, జానపదాలలో ఆద్యాత్మిక, శృంగార సంకీర్తనలు రాశారు. మానవులందరూ ఒక్కటే అని చాటి చెప్పుతూ "బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే" అనిగానం చేశాడాయన. "చక్రవర్తి అయినా - నిరుపేదైనా, నిద్రలో పొందే సుఖం ఒక్కటే అని, బ్రహ్మణుడైనా, దళితుడైనా మట్టిలో కలిసేది ఒక్కచొటేనని - అన్నమయ్య అంటాడు. అలాంటప్పుడు ఏందుకీ వివక్షత? ఏందుకీ తారతమ్యాలు? అని ఆయన ప్రశ్నిస్తాడు. నైతిక విలువలు పాటిస్తే, ఎటువంటి కష్టాలు రావని అన్నమయ్య సుమారు ఐదు శతబ్దాల క్రితమే తెలియజేసాడు. "ఏమికలదిందు ఎంతకాలంబైన" అంటూ, ఈ ప్రపంచంలో శాశ్వతమైనది ఏదీలేదని, ఈ నిజాన్నీ తెలుసుకుంటే నీకు సంతోషం కల్గిస్తుందన్న ప్రతి విషయం ఎంత భయంకరమైందో గుర్తించగల్గుతారని ఆయన అంటాడు. జీవితం క్షణికమైందని, ఒక ఆకులాగా, పండి రాలిపోతుందని అన్నమయ్య ప్రభోదిస్తాడు. ఇంతటి దానికి ఈ స్వార్దపూరిత చింతన ఎందుకని ప్రశ్నిస్తూ, దైవచింతనలో కాలంగడపమని సందేశమిస్తాడాయన. భగవంతుడు ఒక్కడే శాశ్వత నిజం అని ఆయన అంటాడు. అలాగే, ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిలో నిమగ్నమవ్వాలని ఒంటరిగా పనిలేనివాడు సాదించేది ఏమి ఉండదని సంభొదిస్తాడాయన. ప్రస్తుత పరిస్తితిలో అన్నమయ్య పదవికవితలు ఎంతో అవసరం. తన రచనలు, సంకీర్తనలను ఆనాటి రాజుల కోరిక మేరకు, వారిపై సంకీర్తనలు రాయడానికి అంగీకరించలేదు. తన సంకీర్తనలను తిరుమల ఏడుకొండల వెంకటేశ్వరస్వామికే అన్నమయ్య అంకితమిఛ్చాడు. నారసింహుడి మీద,రాముడి మీద కూడా కొన్ని కీర్తనలు రాశాడు. అన్నమయ్య కీర్తనలలో తాత్విక సత్యాలు, సాంఘీక విమర్శలు, నీతి నియమాలు, లాలిపాటలు, బలక్రుశ్నలీలలు ఉన్నాయి. ఇలా అనేక గీతాలను ఆయన రచించాడు. ప్రముక కవి పండితులు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ మాటలలో అన్నమయ్య రచనలు "ఒక సారస్వత క్షీర సముద్రం. కావ్యముల ధర్మమైన బావార్జవంలో, శైలిలో, భావవైవిధ్యంలో, రాశిలో అన్నమాచార్యుని రచనను మించినది ఆంధ్ర వాఙ్మయంలో మరొక్కటి లేదు... నగుబాట్లైన ద్విపద, పద కవితలను ఉద్ధరించి ఉన్నత స్థానం కలిగించిన ప్రతిష్ఠ అన్నమాచార్యునిదే" అన్నారు. అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మనోహరంగా, వినసొంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటలలో ఆధ్యాత్మ సత్యాలను, వేంకటపతి తత్వాన్ని, జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించాడు. లోకనీతిని, ధర్మాన్ని, విష్ణుతత్వాన్ని కీర్తించాడు. దక్షిణాపధంలో భజన సంప్రదాయానికి అన్నమయ్యే ఆద్యుడు. ఉదాహరణలు
కులుకక నడవరో కొమ్మలాలా (రాగం - దేసాళం)
కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు. "మీ సంకీర్తనలు పరమ మంత్రాలు. వీటిని వింటే చాలు పాపం పటాపంచలౌతుంది. మీరు సాక్షాత్తు వేంకటపతి అవతారమే" అని పురందరదాసు అన్నాడట. అప్పుడు అన్నమాచార్యుడు "సంధ్య వార్చుకోవడానికి సాక్షాత్తు విఠలునితోనే నీళ్ళు తెప్పించుకొన్న భాగ్యశాలివి. మీ పాటలు కర్ణాటక సంగీతానికే తొలి పాఠాలు. మిమ్ము చూస్తే పాండురంగని దర్శించుకొన్నట్లే" అన్నాడట. అన్నమయ్య మనుమడు తాళ్ళపాక చిన్నన్న అన్నమాచార్య చరితము అన్న ద్విపద కావ్యములో అన్నమయ్య జీవిత విశేషాలను పొందుపరచాడు. ఈ గ్రంథం 1948లో లభ్యమై ముద్రింపబడింది. అన్నమయ్య జీవితం గురించి మనకు తెలిసిన వివరాలకు ఈ రచనే మౌలికాధారం. అవసానకాలంలో తన కొడుకు పెద తిరుమలయ్యను పిలచి, ఇంక దినమునకు ఒక్క సంకీర్తనకు తక్కువ కాకుండా శ్రీనివాసునకు వినిపించే బాధ్యతను అతనికి అప్పగించాడట. 95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన అన్నమయ్య దుందుభి నామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్వాదశి నాడు (ఫిబ్రవరి 23, 1503) పరమపదించాడు. రాగిరేకులమీద వ్రాసిన తిధుల కారణంగా అతని జన్మ, మరణ దినాలు తెలుస్తున్నాయి. 15వ శతాబ్ది ప్రజాజీవితం, తెలుగు భాషా విశేషాలకు అన్నమయ్య సాహిత్యం ప్రతిబింభంగా నిలిచింది. అన్నమయ్య సంకీర్తనలు పాడి, ప్రచారం చేయడానికి కర్ణాటక, తమిళ సంగీత విద్వాంసులు కూడా ఎంతో కృషి చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానము ఆద్వర్యంలో 'అన్నమాచార్య ప్రాజెక్టు' అన్నమయ్య సంకీర్తనల ప్రచారానికి ఎంతో కృషి చెస్తొంది. ప్రత్యేక కార్యక్రమాలు ప్రతీ ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నమయ్య వర్దంతిని ఘనంగా జరుపుతున్నారు. విశ్వవిద్యాలయ స్థాయిలో ఎం.ఎ విద్యార్థులకు అన్నమయ్య సంకీర్తనలను ప్రత్యేక పాఠ్యాంశాలుగా, అలాగే పరిశోదన (రీసేర్చి) కోసం కూడా అవకాశం కల్పించారు. అన్నమయ్య సంకీర్తనల్లోని మంచి భావాలను - ఆలొచనలను ప్రజలందరికీ పంచిపెట్టాల్సిన భాద్యత పండితుల-గాయకుల భుజస్కందాలపై ఉంది.
Body:
Post date: Sun, 09/09/2012 - 12:02
Path: /node/832 |
|
విభాగము:
వివరణ:
దేశం నలుమూలలా చెల్లాచెదురుగా పడివున్న సాహిత్య గ్రంధాలన్నింటినీ సేకరించి, విభిన్న తాళపత్రాలలో నిక్షిప్తమైయున్న కావ్యాలను కాగితాల మీదకు ఎక్కించి, పండితుల చేత సవరింపజేసి తెలుగు జాతికి తెలుగు సాహితీ సంపదను దానం చేసిన సాహితీ కర్ణుడు బ్రౌన్. జీవిత విశేషాలుసి.పి.బ్రౌన్ 1798 నవంబర్ 10న కలకత్తాలో జన్మించాడు. ఈయన తండ్రి డేవిడ్ బ్రౌన్ పేరొందిన క్రైస్తవ విద్వాంసుడు. తండ్రి మరణించిన తరువాత బ్రౌను కుటుంబం ఇంగ్లండు వెళ్ళిపోయింది. బ్రౌను అక్కడే హిందూస్థానీ భాష నేర్చుకున్నాడు. తరువాత 1817 ఆగష్టు 4 న మద్రాసు లో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా మద్రాసులో కోదండరామ పంతులు వద్ద తెలుగులో ప్రాధమిక జ్ఞానాన్ని సంపాదించాడు. 1820 ఆగష్టులో కడపలో డిప్యూటీ కలెక్టరుగా చేరాడు. ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో పనిచేసినపుడు తెలుగులో మాట్లాడడం తప్పనిసరి అయ్యింది. అయితే తెలుగు నేర్చుకోడానికి సులభమైన, శాస్త్రీయమైన విధానం లేకపోవడం వలన, పండితులు తమ తమ స్వంత పద్ధతులలో బోధిస్తూ ఉండేవారు. తెలుగేతరులకు ఈ విధంగా తెలుగు నేర్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. భాష నేర్చుకోవడం లోని ఈ ఇబ్బంది, బ్రౌనును తెలుగు భాషా పరిశోధనకై పురికొల్పింది. ప్రాచీన తెలుగు కావ్యాలను వెలికితీసి, ప్రజలందరికీ అర్ధమయ్యేలా పరిష్కరించి, ప్రచురించడం, భాషకు ఓ వ్యాకరణం, ఓ నిఘంటువు, ఏర్పడడానికి దారితీసింది. మచిలీపట్నం, గుంటూరు, చిత్తూరు, తిరునెల్వేలి మొదలైనచోట్ల పనిచేసి, 1826 లో మళ్ళీ కడపకు తిరిగి వచ్చి అక్కడే స్థిర నివాసమేర్పరచుకొన్నాడు. అక్కడ ఒక బంగళా కొని, సొంత డబ్బుతో పండితులను నియమించి, అందులో తన సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించాడు. అయోధ్యాపురం కృష్ణారెడ్డి అనే ఆయన ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ ఉండేవాడు కడపలోను, తాతాచారిబ్రౌన్ కొలువులో తొలి తెలుగు కథకుడు నేలటూరు వేంకటాచలం వురఫ్ తాతాచారి .తాతాచారి చెప్పిన కథలను విన్న సి.పి.బ్రౌన్ అందులోంచి 24 కథలను, దానితోపాటు శ్రీకృష్ణమాచారి చెప్పిన రెండు కథలను కలిపి 1855లో పుస్తకంగా ముద్రించారు. అదే సంవత్సరం వీటి ఆంగ్లానువాదాన్ని 'పాపులర్ తెలుగు టేల్స్' అనే పేరుతో ప్రచురించారు. 1916లో 'తాతాచారి కథలు ' గిడుగు వేంకట అప్పారావు సంపాదకత్వంలో ద్వితీయ ముద్రణ పొందాయి.1951లో వావిళ్ల వారి తృతీయ ముద్రణ, 1974లో బంగోరె సంపాదకుడిగా చతుర్థ ముద్రణ పొందాయి.నెల్లూరు జిల్లా గూడూరు తాలూకా గునుపాడు గ్రామవాసి.తిరుపతి బాలబాలికలకు వీధి బడుల్లో చదువు చెబుతూ జీవితం సాగించారు.1848లో చెన్నపట్నం వెళ్లి బ్రౌను కొలువులో ఏడేళ్లు తాను బ్రతికి వుండిన పరియంతరమున్నాడు. పల్నాటి వీర చరితం , వసు చరిత్ర మొదలైన గ్రంథా ల పరిష్కార కృషిలో ఆయనకు సాయపడ్డారు.తాతాచార్యులు కావ్య తర్క వ్యాకరణముల యందు ప్రవీణత గలవాడు.తాతాచారి కథలు నీతి బోధకాలే కాక, ఆనాటి సామాజిక స్థితికి దర్పణంగాను ఉన్నవి. అందులోని శైలి శుద్ధ వ్యావహారికమైనందు వల్ల పండిత శైలికి దూరంగా ఉందనే బ్రౌన్ ప్రశంసకు యోగ్యమైంది.తాతాచారి కథల్లో- గ్రామశక్తికి పొంగలి పెట్టిన కథ, దేవరమాకుల కథ, వెట్టి వాండ్ల పట్టీ కథ, వాలాజీపేట రాయాజీ మసీదు కథ, హాలింఖాన్ మోసపోయిన కథ, మనిషి సద్గతి దుర్గతి తెలిపే కథ, పొగచుట్ట కథ- లాంటివి ఉన్నాయి.-- ఈతకోట సుబ్బారావు. తెలుగు భాషకు చేసిన సేవ
రచనలు
ఇతరుల ప్రశంసలు
స్మృతి చిహ్నంబ్రౌను స్మృతి చిహ్నంగా, కడపలో ఆయన నివసించిన బంగళా స్థలంలో ప్రభుత్వము, ప్రజలు సంయుక్తంగా గ్రంథాలయాన్ని నిర్మించారు. వివిధ సంస్థలు, వ్యక్తులు గ్రంథాలను విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం ఇది భాషా,సాహిత్య పరిశోధనా కేంద్రంగా ద్రవిడ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పని చేస్తోంది.
దేశం నలుమూలలా చెల్లాచెదురుగా పడివున్న సాహిత్య గ్రంధాలన్నింటినీ సేకరించి, విభిన్న తాళపత్రాలలో నిక్షిప్తమైయున్న కావ్యాలను కాగితాల మీదకు ఎక్కించి, పండితుల చేత సవరింపజేసి తెలుగు జాతికి తెలుగు సాహితీ సంపదను దానం చేసిన సాహితీ కర్ణుడు బ్రౌన్. Body:
Post date: Sun, 09/02/2012 - 22:10
Path: /node/345 |