తెలుగు జాతీయాలు

ఎంత కరవొచ్చినా పులి గడ్డి మేయదన్నట్టు

పులి క్రూరజంతువే అయినా రాజసం, నీతినిజాయతీల లాంటివాటికి ప్రతీకగా చెప్పుకోవటం అలవాటుగా వస్తోంది. ఆయన పులి లాంటివాడు అనంటే క్రూరస్వభావం కన్నా గాంభీర్యం ఎక్కువగా ఉన్నవాడు అనే అర్థమే స్ఫురిస్తుంది.

ఎండిన మోడుకు ఎర్రని పూలు తగిలించినట్టు..

అసంబద్ధమైన పని అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఏ పనిచేసినా అతికినట్లుండాలని అంటారు. ఆ అతికింది సహజసిద్ధంగా ఉన్నట్లు కనిపింపజేయటంలోనే నైపుణ్యం అంతా ఇమిడి ఉంటుంది. అలాగాక పని చేతకాకపోతే మాసికలు వేసినట్లు అతుకులు అతుకులుగా ఉంటుంది.

మూలం/సేకరణ: 
eenadu.net

ఉప్పు లేదు, కారం లేదు అమ్మతోడు....

'ఉప్పు లేదు, కారం లేదు అమ్మతోడు అయినా రుచిగానే ఉందన్నట్టు' అన్నది జాతీయం. కొంతమంది మొహమాటస్తులను గురించి వివరించి చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. పదార్థానికి రుచి రావాలంటే ఉప్పు, కారం ఉండాలి. ఇది సర్వసాధారణమైన విషయం.

మూలం/సేకరణ: 
eenadu.net

ఉప్పు తిన్న ప్రాణం వూరుకోదన్నట్టు

కొంతమంది ఎదుటివారి దగ్గర మేలు పొందినప్పుడు తిరిగి ఏదో ఒక మేలు చేసి తమ కృతజ్ఞతను తెలుపుకోవాలని అనుకుంటారు. అలాంటివారి తత్వాన్ని గురించి వివరించే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ఉప్పు ఆహార పదార్థాలలో రుచి కోసం వేస్తుంటారు.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

ఉన్నమ్మ గాదె తీసేసరికి లేనమ్మ ప్రాణం పోయిందనట్టు

కొంతమంది దాతలు ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వకుండా అర్థులను తమ చుట్టూ విపరీతంగా తిప్పుకొంటుంటారు. అలా తిరగలేక కొంతమంది విసిగి వేసారిన సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. పూర్వం వడ్లను గాదెల్లో భద్రపరిచేవారు.

ఉంటే ఉగాది లేకపోతే శివరాత్రి అన్నట్టు..

పండుగలు జరుపుకొనే తీరును జీవన గమనానికి ముడిపెట్టి చెప్పిన జాతీయం ఇది. ఉగాది పండుగనాడు కొత్తబట్టలు, పిండివంటలతో అంతా సుఖసంతోషాలతో ఉంటారు. శివరాత్రి అంటే ఉపవాస ప్రధానమైన పండుగ. ఏవీ తినకూడదు. అంటే డబ్బులుంటే కొంతమంది ఉగాది పండుగ చేసుకున్నంత సంబరంగా కాలం గడుపుతారు.

మూలం/సేకరణ: 
eenadu.net

ఈ మొగానికి శేరు పసుపు...

ఒక్కొక్కసారి అనర్హులను అర్హులుగా భావించి వారికి సన్మానాలు, సత్కారాలు చేయటం జరుగుతుంటుంది. అలా అనర్హులకు లభ్యమయ్యే గౌరవాన్ని చూసినప్పుడు వారి విషయం తెలిసిన వారు విమర్శిస్తూ మాట్లాడే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం వినిపిస్తుంటుంది.

మూలం/సేకరణ: 
eenadu.net

ఈ జొన్న కూటికా ఈ స్తోత్ర పాఠమన్నట్టు

కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కని సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. జొన్న అన్నం కన్నా వరి అన్నం గొప్ప అని భావించే రోజుల్లో ఇది ఆవిర్భవించింది. ఒక వ్యక్తి ఒక సంపన్నుడి దగ్గరకు వెళ్లి స్తోత్రం చేశాడట (పొగిడాడట).

ఈ అన్నది లేదు, తే అన్నదే తరతరాలుగా వస్తున్నది..

ఈ (ఇవ్వు) అన్నది లేదని, తే (తీసుకురా) అన్నదే అలవాటని చెప్పటం ఈ జాతీయంలో అంతరార్థం. ఇక్కడ కనిపిస్తున్న ఈ, తే అనే రెండూ రెండు విభిన్నార్థాలను కలిగి ఉన్నాయి. ఈ అంటే దయచేసి ఇవ్వు అని బతిమలాడటం లేదా యాచించటం, తే అంటే తీసుకురా అని ఆజ్ఞాపించటం అనేది అర్థం.

మూలం/సేకరణ: 
eenadu.net

ఇర్రికొమ్ము అంటే బర్రెకొమ్ము అన్నట్టు..

చెప్పిన దానికి విరుద్ధంగా ప్రవర్తించటం, ఒకపని చేయమంటే మరోలా అర్థం చేసుకొని వేరే ఏదోపని చేయటం అనేది కొంతమంది దగ్గర కనిపిస్తుంటుంది. అలాంటి వారిని గురించి చెప్పేటప్పుడు 'ఇర్రి కొమ్ము అంటే బర్రెకొమ్ము అంటాడు.

మూలం/సేకరణ: 
eenadu.net

Pages