తెలుగు జాతీయాలు

గారాబాల బిడ్డకు...

గారాబాల బిడ్డకు గడ్డపారతో చెవులు కుట్టి చెవులకు పారలు తగిలించినట్టు అన్నది జాతీయం. కొంతమంది తమ పిల్లల విషయంలో అతి గారాబాన్ని చూపిస్తూ వారికి మేలు చేయటానికి బదులు కీడు కలిగించే పనులు చేస్తుంటారు.

మూలం/సేకరణ: 
eenadu.net

గాడిద గుడ్డు పెడుతుందా? గద్ద పిల్లను కంటుందాన్నట్టు

కొన్ని కొన్ని అసాధ్యాలను గురించి స్పష్టం చేసేటప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. గాడిద గుడ్డు పెట్టడం, గద్ద నేరుగా పిల్లను కనడం సృష్టిలో జరిగే పనికాదు. అలాగే ఎదురుగా ఉన్న పని అసంభవం అని చెప్పాల్సివచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

మూలం/సేకరణ: 
eenadu.net

గాజుపూసల గనిలో మణి దొరకదన్నట్టు

విలువలు లేనివారు ఎక్కువగా ఉన్నచోట విలువ కలిగినవారు ఉండరు అని నిర్ధరించి చెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. మణిమాణిక్యాల కన్నా గాజుపూసలకు విలువ తక్కువగా ఉంటుంది.

గరుడాయ లెస్సా అంటే...

గరుడాయ లెస్సా అనంటే శేషాయ లెస్సా అన్నట్టు అన్నది జాతీయం. గరుడుడు, శేషుడు ఎవరి స్థాయిలలో వారు గొప్పవారే. కానీ ఒకరినొకరు పలకరించుకోవటానికి వారి మధ్యన ఉండే జాతి వైరాలులాంటివి అడ్డు వచ్చే అవకాశాలుంటాయి. ఆత్మాభిమానం కూడా అడ్డురావచ్చు.

మూలం/సేకరణ: 
eenadu.net

గడ్డేసిన తావునే గొడ్డును కట్టెయ్యాలన్నట్టు

వనరులు ఉన్నచోటే నివాసం ఉండటం మేలన్న విషయాన్ని తెలియచెప్పే జాతీయమిది. గడ్డి ఒకచోట వేసి గొడ్డును ఇంకొక చోట కట్టేస్తే మేత తినక గొడ్డు ఆకలితో మాడుతుంది. గడ్డి గొడ్డుకు ఆహారపు వనరు.

గడ్డపార తినేవాడికి...

గడ్డపార తినేవాడికి శొంఠి కషాయం ఏం పన్చేస్తుంది అన్నది జాతీయం. దుర్మార్గాలలోనూ, దురలవాట్లలోనూ మితిమీరిన వారికి కొద్దిపాటి శిక్షవల్ల ఏ ప్రయోజనమూ ఉండదని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

గంధద్రవ్యాలు మోసినా గాడిద గాడిదేనన్నట్టు

కొంతమంది ఎన్ని మంచి మాటలు చెప్పినా మరెంతమంది సత్పురుషులు వారి చుట్టూనే ఉన్నా వారి మనస్సు మాత్రం మారదు. దుర్మార్గం వైపే వారి అడుగులు పడుతూ ఉంటాయి. అలాంటి వారిని గురించి తెలియచెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.

కోడిగుడ్డును కొట్టేందుకు గుండ్రాయి కావాలా అన్నట్టు

అల్పులను శిక్షించేందుకు అధికమైన బలం అక్కరలేదని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. వాటం చూసి గట్టిగా వేలితో కొట్టినా కోడిగుడ్డు పగులుతుంది. అలాంటి దానికి గుండ్రాయి అనవసరం.

కోడికి గజ్జెలు కడితే...

కోడికి గజ్జెలు కడితే కుప్ప కుళ్లగించదా అన్నది జాతీయం. కసువు కుప్పలను కుళ్లగించి పొట్టపోసుకోవటం కోడి జీవలక్షణం. ఒకాయన ఓ కోడిని ఎంతో ముద్దుగా పెంచుకుంటున్నాడట. అలా తన పెంపుడుకోడి కసువు కుప్పలను కుళ్లగించటం ఆయనకు బాగాలేదనిపించింది.

కోకలు వెయ్యి ఉన్నా కట్టుకొనేది ఒకటే

కొంతమంది తామెంతో భాగ్యవంతులమని విర్రవీగుతుంటారు. అలాంటివారి గర్వాన్ని నిరసిస్తూ చెప్పే జాతీయం ఇది. జాతీయాలు వాస్తవ పరిస్థితులను ఉదాహరణలుగా చూపి సంఘటనలను సందర్భాలను సమీక్షిస్తూ విమర్శిస్తుంటాయనటానికి ఇదొక ఉదాహరణ. పెట్టెనిండా కోకలున్నాయని ఒకామె తెగ గర్వపడసాగిందట.

Pages