తెలుగు జాతీయాలు

తల వంచుకుంటే ఏడు గోడల చాటన్నట్టు

లౌక్యం తెలుసుకొని మసులుకోవాలి అని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది. అనువుగాని చోట అధికులమనరాదు అనే దానికి ఇది సమానార్థకం.

జిల్లేళ్లకు మల్లెలు పూస్తాయా అన్నట్టు

కోపంతో, కసితో దుర్మార్గులు అనుకొన్నవారిని, వారి సంతానాన్ని దూషించే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. జిల్లేడు చెట్టుకు జిల్లేడు పూలే పూయటం ప్రకృతిసిద్ధంగా సహజంగా జరిగే పని. జిల్లేడు పూలను మల్లెపువ్వుల్లాగా ఎవరూ అంతగా ప్రేమించరు.

జరిగితే బండి, జరక్కపోతే బండ..

మనిషిగా గుర్తింపు పొందాలంటే నిత్యచైతన్యంతో విరాజిల్లాలి. అలాకాక బద్ధకంతో ఒకచోట పడి ఉంటే ఎవరూ లెక్కచేయరని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. బండి చైతన్యానికి, చలనానికి ప్రతీక. బండ మొద్దుతనానికి గుర్తు. జరిగి ముందుకు సాగిందంటే అది బండి లక్షణం.

మూలం/సేకరణ: 
eenadu.net

ఛీ కుక్కా అంటే ఏమక్కా అన్నట్టు..

కొంతమంది ఎదుటివారు నిందించినప్పుడు దానికి తగిన రీతిలో నర్మగర్భంగా సమాధానాలు చెబుతుంటారు. అలా మాటకు మాట అనటం కూడా ఓ గొప్ప కళ. ఒకామె మరో ఆమెనుఛీ కుక్కా పో అని తిట్టిందట. దానికి ఎదుటామె ఏమాత్రం బాధపడకుండా, ీఏమక్కా పిలుస్తున్నావు' అన్నదట.

మూలం/సేకరణ: 
eenadu.net

చేపల చెరువుకు కొంగను కాపలా ఉంచినట్టు

అసంబద్ధమైన నిర్ణయం తీసుకోవటం, రక్షణ కావలసినచోట శత్రువుకు అవకాశం కల్పించటం అనే లాంటి అర్థాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది. చేపలు కొంగకు ఆహారం. చేపల చెరువు దగ్గరకు కొంగలు రాకుండా రైతులు జాగ్రత్తపడుతుంటారు.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

చేతిలో పని ఉన్నా నోట్లో నాలుక ఉండాలన్నట్టు

భావవ్యక్తీకరణ నైపుణ్యాల అవసరాన్ని గురించి తెలియచెబుతుంది ఈ జాతీయం. ఇటీవలి కాలంలో గొప్పగొప్ప ఉన్నత విద్యలు ఎన్ని చదివినా భావవ్యక్తీకరణ నైపుణ్యం లేనందువల్ల ఉద్యోగాలలో యువత నిలబడలేకపోతున్నారన్న సత్యం తెలియవస్తోంది.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

చేతిలో కాసు నోటిలో దోసె అన్నట్టు

డబ్బిచ్చిన తర్వాతే ఏ పనైనా జరిగేది అని, అప్పు ఇవ్వడం లేదని చెప్పే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది. సర్వకాలాలలోనూ జాతీయాలు ఆవిర్భవిస్తూనే ఉంటాయి. ఆనాటి కాలపరిస్థితులు వీటికి వేదికలవుతాయి. అప్పుడు వాడుకలో ఉన్న పదాలతోనే జాతీయాలు రూపొందుతుంటాయి.

చేతికొచ్చింది నోటికొచ్చిందాకా నమ్మకం లేనట్టు..

స్థిరం లేని వ్యవహారం, నమ్మకంలేని పని అనేలాంటి అర్థాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

మూలం/సేకరణ: 
eenadu.net

చెరువు ముందు చలివేంద్రం అన్నట్టు

నిరుపయోగమైన పని అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పూర్వం చెరువులు, బావులులాంటివి మంచినీరు తెచ్చుకోవటానికి స్థానాలుగా ఉండేవి. కావలసినవారు కావలసినంత నీరు చెరువులో నుంచి తెచ్చుకుంటుండేవారు. ఓ వ్యక్తి అలాంటి చెరువు ముందు ఒక చలివేంద్రాన్ని పెట్టాడట.

చెప్పి చెప్పి...

'చెప్పి చెప్పి చెప్పుతో తన్నించుకో, మళ్లీ వచ్చి మాతో తన్నించుకో' అన్నది జాతీయం. ఓ మంచి విషయాన్ని ఎంత చెప్పినా ఎవరూ వినిపించుకోని సందర్భంలో విసిగివేసారిన వారు ఉపయోగించే జాతీయమిది. ఇరుపక్షాల నడుమ రాజీ కుదర్చాలని ఓ వ్యక్తి తెగ ప్రయత్నం చేశాడట.

Pages