తెలుగు జాతీయాలు

చెట్టులేని చేను, చుట్టం లేని వూరన్నట్టు

నిరుపయోగమైన వాటి గురించి పోల్చాల్సిన సందర్భాల్లో ఉపయోగించే జాతీయమిది. పంటపండే చేను అయితేనే దానివల్ల ఎవరికైనా ఉపయోగం. ఆ చేలో ఉన్న చెట్టు చేమ వల్ల ఏదో ఒక ప్రయోజనం నెరవేరుతుంటుంది. అలా లేనప్పుడు ఆ చేను బీడు భూమి అయినప్పుడు ఏ ఉపయోగమూ ఉండదు.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

చీమలు పాకితే రాళ్లరుగుతాయా అన్నట్టు

అల్పులకు సహాయం చేసినందువల్ల సంపన్నులకు ఎలాంటి నష్టమూ ఉండబోదని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. చీమలు తమకు కావల్సిన ఆహారాన్ని పొందటానికి బండల మీద అటూఇటూ పాకుతూ ఉంటాయి. అంతమాత్రంతో ఆ బండ అరగటం కానీ ఇతరత్రా మరెలాంటి నష్టాన్ని పొందదు.

చవి ఎరిగిన కుక్క చావగొట్టినా పోదన్నట్టు..

కొంతమంది ఎదుటివారి ఇళ్లలో భోజనాలు చేసే సమయానికి, అల్పాహారం చేసే సమయానికి వచ్చి తిని వెళుతుంటారు.

మూలం/సేకరణ: 
eenadu.net

చచ్చిన పామును కొట్టడానికి అందరూ బంట్లేనన్నట్టు

హాని కలిగించని పని, కష్టం లేని పని అంటే ఆ పని చేయటానికి అందరూ ముందుకొస్తారని, శక్తిహీనులు కూడా తాము శక్తివంతులమని చెప్పుకోటానికి అలాంటి పనులకు ముందుకు వస్తారని తెలియచెప్పటమే ఈ జాతీయ లక్ష్యం.

మూలం/సేకరణ: 
eenadu.net

గోడకేసిన సున్నం

మనం ఏదో ఆశించి వెచ్చించేవాటిలో కొన్నిసార్లు ఆ వెచ్చించిన ధనం ఇక ఏపరిస్థితులలోనూ వెనక్కిరాదనుకున్నప్పుడు ఉపయోగంచే జాతీయమిది. తిరిగిరాని పెట్టుబడిని గోడకు వేసినసున్నం అంటుంటారు. శుభ కార్యాల్లాంటి సందర్భాలలో ఇళ్ళ గోడలకు వెల్లవేస్తుంటారు.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

గొర్రెలకు తోడేలు కాపరి అన్నట్టు

సంరక్షణ బాధ్యతలను అమాయకంగా నమ్మి మోసగాళ్లు, శత్రువులకు అప్పగించిన సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. గొర్రె తోడేలుకు ఆహారం. అలాంటిది ఆ తోడేలును గొర్రెలకు కాపలాగా ఉంచితే ఏం జరుగుతుందో ఎవరైనా వూహించవచ్చు, ఈ వూహ ఆధారంగానే ఈ జాతీయం ఆవిర్భవించింది.

గొర్రెలకు తోడేలు కాపరి అన్నట్టు

సంరక్షణ బాధ్యతలను అమాయకంగా నమ్మి మోసగాళ్లు, శత్రువులకు అప్పగించిన సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. గొర్రె తోడేలుకు ఆహారం. అలాంటిది ఆ తోడేలును గొర్రెలకు కాపలాగా ఉంచితే ఏం జరుగుతుందో ఎవరైనా వూహించవచ్చు, ఈ వూహ ఆధారంగానే ఈ జాతీయం ఆవిర్భవించింది.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

గురువుకు తిరుమంత్రం చెప్పినట్లు

కొంతమంది అన్ని విషయాలలోనూ తామే గొప్ప అని భావించుకొంటుంటారు. అలాంటివారు తమకంటే గొప్పవారి దగ్గర అల్పమైన తమ గొప్పతనాలను ప్రకటించుకొంటున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంటుంది. మంత్రజపం, సాధన చేయటంలో గురువు ఎప్పుడూ ముందడుగులోనే ఉంటాడు.

గుడిసెకు చాందినీ అన్నట్టు

అసంబద్ధమైన వ్యవహారం, అనవసరమైన అలంకారం అనే అర్థాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. చాందినీలను గొప్పగొప్ప అలంకారాలకు గుర్తుగా చెబుతారు. అలాంటి ఎంతో సుందరమైన చాందినీ చక్కటి భవనం ముందుంటే ఆ భవనపు అందం ఇనుమడిస్తుంది. ఆ చాందినీ వేసినందుకు సార్థకత చేకూరుతుంది.

గాలిలో మాట రాసినట్టు నీరు మూటకట్టినట్టు

వృథా కార్యాలు, వ్యర్థ ప్రయత్నాలు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. గాలిలో ఎంతసేపు రాసినా, ఏం రాసినా కనిపించదు. నీరు వస్త్రంతో మూటకట్టాలని ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం ఫలించదు.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

Pages