Content

ఉగాది శుభాకాంక్షలు

తెలుగు వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

UGADI

మహాశివరాత్రి శుభాకాంక్షలు

తెలుగు వారందరికీ,

మహాశివరాత్రి శుభాకాంక్షలు

మహాశివరాత్రి శుభాకాంక్షలు

 

పద్మనాభం

Padmanabham పద్మనాభం! తెలుగు తెర హాస్య నటశ్రేణిలో అగ్రగణ్యుడు. రెండు మూడు దశాబ్దాల పాటు ప్రేక్షక జనాన్ని నవ్వుల జల్లుల్లో తడిపిన నట ప్రముఖుడు. అనేకానేక చిత్రాలు నిర్మించి విజయాలూ ప్రశంసలూ పొందిన విలక్షణ కళాభిజ్ఞుడు. అనేకమంది కొత్తవారిని పరిచయం చేసి సినీజీవితం అందించిన అనుభవశాలి.

హాస్యనట చక్రవర్తి "రాజబాబు"

Rajababuతెలుగు సినీ వినీలాకాశంలో తనదైన హాస్యనటనతో అలరించి విభిన్నమైన శైలిలో ఓ ప్రత్యేకముద్రను వేసి మనందరి మదిలో చిరకాలం గుర్తిండిపోయే హాస్యనట చక్రవర్తి రాజబాబు.

భారత కోకిల శ్రీమతి సరోజినీ నాయుడు

Sarojini Naiduస్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న మహిళల కీర్తిప్రతిష్టలను ఇనుమడింపచేసిన వారిలో సరోజినీనాయుడు ప్రముఖు రాలు. కవిత్వంతో మాధుర్యన్ని కురిపించి ' నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా' గా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచారు.

64వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

తెలుగు వారందరికీ 64వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

భారతదేశ జాతీయ పతాకం

రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ

Rallapalli anantha krishna sharmaశాస్త్రీయమైన సాహిత్య విమర్శనకు కళాత్మకమైన రూపురేఖలు దిద్దిన ఆధునికాంధ్ర సాహిత్య విమర్శకులలో అగ్రగణ్యులు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ.  అన్నమాచార్యులు వారి కొన్ని వందల కృతులను ఆయన స్వరపరచి తెలుగువారికి అందించాడు. వేమనపై సాధికారమైన విమర్శ గ్రంధాన్ని వెలువరించాడు. సంగీత సాహిత్యాలు రెండింటిలోనూ సమ స్కందులు.

అయ్యదేవర కాళేశ్వరరావు

అయ్యదేవర కాళేశ్వరరావు స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మొదటి స్పీకరు. ayyadevara kaleswara rao

భారత స్వాతంత్య్ర సమరంలో ప్రాణాలను సైతం ఎదురొడ్డి పోరాటం సాగించిన మహా నాయకులలో తొలితరం తెలుగు నాయకులు కాశీనాథుని నాగేశ్వరరావు, కొండా వెంకటప్పయ్య, టంగుటూరి ప్రకాశం మొదలైనవారు కాగా మలితరం మహానాయకులు డా.పట్ట్భాసీతారామయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, బులుసు సాంబమూర్తి మొదలైనవారు.
 

స్వామి రామానంద తీర్థ

ramananda teertaస్వామి రామానంద తీర్థ : స్వాతంత్ర సమరయోధుడు, హైద్రాబాద్ సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు, భారత పార్లమెంట్ సభ్యుడు, సన్యాసి, కార్మిక నాయకుడు, విద్యావేత్త. 

ఈయన అసలు పేరు వెంకటరావు ఖేడ్గీకర్‌. తండ్రి భాపూరావు, తల్లి యసుబాయి.1903 అక్టోబరు 3వ తేదీన అప్పటి హైదరాబాదు సంస్థానంలోని గుల్బర్గా జిల్లా, ఝవర్గీ తాలూకా సింద్గీ గ్రామంలో ఆయన జన్మించారు. ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉండగానే 1920 జూలై 31 వ తేదీ రాత్రి లోకమాన్య బాలగంగాధర తిలక్‌ కాలధర్మం చెందారన్న వార్త విని బ్రహ్మచారిగా తన జీవితాన్నంతా మాతృభూమి సేవకే అంకితం చేయగలను అని ప్రతిజ్ఞ చేసి, ఆ ప్రకారమే ఉండిపోయిన ధీరోధాత్తుడు ఆయన. కళాశాల చదువుకు స్వస్తి చెప్పి, పూనాలోని తిలక్‌ విద్యాపీఠ్‌లో మూడేళ్ళు అధ్యయనం చేసి, ప్రజాస్వామ్యం, దాని క్రమాభివృద్ధి అనే అంశంపై సిద్ధాంత వ్యాసం రాసి పూనా విశ్వవిద్యాలయానికి సమర్పించి ఎం.ఏ పట్టాని పొందారు.
 

మాడపాటి హనుమంతరావు

Madapati Hanumantharaoఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు :  తెలుగు గడ్డను నైజాం పాలకులు ఏలుబడి కొనసాగుతున్న రోజుల్లో పారతంత్య్రంలో మగ్గిపోతున్న తెలుగుజాతిని మేల్కొలిపి వారిలో జాగృతి కలిగించి, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ వికాసానికై నిరంతరం కృషి చేసిన ప్రముఖుల్లో ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు ప్రథమ స్థానం వహిస్తారు.

ఎల్.వి.ప్రసాద్

L V Prasadఎల్.వి.ప్రసాద్ గా ప్రసిద్ధి చెందిన అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత .. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎల్‌.వి. ప్రసాద్‌ చలన చిత్రరంగానికి ఎనలేని సేవ చేశారు. హిందీ, తమిళ, తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రాలయిన  ఆలం ఆరా, కాళిదాస్ మరియూ భక్తప్రహ్లాద మూడింటిలోనూ ఆయన నటించాడు.

సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

sankranti

బోగి పండుగ శుభాకాంక్షలు

తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

sankranti festival

స్వామీ వివేకానంద

swami vivekanada‘‘ఒక వ్యక్తి తనను తాను ఎలా భావిస్తాడో అదే అవుతాడు. తాను బలహీనుడినని భావిస్తే బలహీనుడే అవుతాడు, బలవంతుడిని అని భావిస్తే బలవంతుడే అవుతాడు, కార్యసాధన యత్నంలో ఎదురయ్యే ఆటంకాలను, పొరపాట్లను లక్ష్యపెట్టకూడదు. ఓటమిని లెక్క చేయకూడదు. తిరోగమనాలనూ సహించాలి. లక్ష్యసాధన కోసం వెయ్యి ప్రయత్నాలైనా చేయాల్సిందే. అప్పటికీ ఫలించకపోతే మరో ప్రయత్నానికి సిద్ధం కావాలి’’

శాస్త్రీయ సంగీత రారాజు త్యాగరాజు

త్యాగరాజు కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడు. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి.

Tyagarajuసంగీతం అంటే కొంచెం తెలుసున్న వారెవరైనా, కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్నీ, త్యాగరాజునీ వేరు చేసి చూడ లేరు. ఎందుకంటే కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఆయన చేసిన అసమానమైన కృషి అలాంటిది. కర్ణాటక సంగీతానికీ, త్యాగరాజుకీ విడదీయరాని బంధం ఉంది. లాగుడు పీకుడు రాగాలతో శాస్త్రీయ సంగీతం అంటే ఆమడ దూరం పరిగెత్తే జనాలకి, అందులో ఉండే మాధుర్యం, మత్తూ చూపించీ, సంగీతం అంటే మరింత ఆసక్తిని కలిగించిన వాడు త్యాగరాజు. ప్రస్తుతమున్న కచేరీ పద్ధతికి ప్రాణం పోసిన వాళ్ళల్లో ఆద్యుడు. సరళమైన భాషలో వినసొంపైన శాస్తీయ సంగీతాన్ని అజరామరం చేసాడు. రామ భక్తుడిగా తనదైన ప్రత్యేకమైన ముద్రతో సంగీతాన్ని భక్తి వాహకంగా వాడుకొన్న వ్యక్తి.
 

శ్రీశ్రీ

ఆధునికతకు విరాట్‌రూపం శ్రీశ్రీ. ఇంటిపేరు, ఒంటి పేరుల్ని క్లుప్తీకరించి అణువుల్లా పేర్చుకోవటంతో పేట్రేగిన ఆధునికత ఆపై కవిత్వమై పేలింది.

రెండక్షరాల శ్రీశ్రీ అంటే లోతు,
శ్రీశ్రీ అంటే ఎత్తు.
శ్రీశ్రీ కవిత్వం అగ్ని.
శ్రీశ్రీ సాహిత్యం మార్పు.
శ్రీశ్రీ ఓ నేత, ఓ దూత, ఓ భావి!

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2013

తెలుగు వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

తిరుపతిలో ఘనంగా నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు

తెలుగుకు వరాభిషేకం జరిగింది. అమ్మ భాషపై కానుకల జల్లు కురిసింది.

తిరుపతిలో గురువారం అట్టహాసంగా ప్రారంభించిన 'నాలుగో ప్రపంచ తెలుగు మహాసభల' వేదికపై నుంచి భాషాభివృద్ధికి తోడ్పాటును అందించే దిశగా ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పలు వరాలను గుప్పించారు.

  • తెలుగు భాష, సంస్కృతికి ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు
  • సంగీత, నాటక, సాహిత్య, లలితకళల అకాడమీలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
  • ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి పదో తరగతి దాకా కచ్చితంగా తెలుగుభాష బోధనను చేపట్టాలని సంకల్పించినట్లు పేర్కొన్నారు. 
  • తెలుగును పాలనా, బోధనా, ప్రసార మాధ్యమ భాషగా సమర్థంగా అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు చేపడతామని ఉద్ఘాటించారు.
  • ఇప్పటికే తెలుగుభాషకు ప్రాచీన హోదా సాధించామని.. రాష్ట్ర రాజధానిలో తెలుగుపీఠాన్ని ఏర్పాటు చేస్తున్నామని గుర్తుచేశారు.

తెనుగు లెంక "తుమ్మల సీతారామమూర్తి"

Tummala Sitaramamurtyఆయన్ని చూస్తే అచ్చం తెలుగు రైతులాగా వుండేవాడు కాని 'కవి వేషం' కనబడేది కాదు. ఆరడుగుల నల్లని విగ్రహం. పల్లెటూరి పెద్దరికం తొణికసలాడే నుదురు.  పొడుగైన ముక్కు. గుబురైన మీసాలు. ఖద్దరు దుస్తులు. ఆచితూచి మాటలు. సద్గుణాల ప్రోగు. ఆయన ఒక విషయంలో మాత్రం గర్వి ష్ఠి! తాను తెలుగు వాడైనందుకు ఆయన గర్విస్తాడు.

క్రిస్మస్ శుభాకాంక్షలు

తెలుగు వారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు

jesus

 

 

క్రిస్టమస్

Jesus christ"క్రిస్మస్" క్రైస్తవులకు ముఖ్యమైన పండుగ. యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా జరుపుకునే ఈ పండుగ ఎంతో పవిత్రమైనది. యేసు జన్మించి ఇప్పటికి రెండు వేల సంవత్సరాలు దాటిపోయినా ఆయనను కరుణారస మూర్తిగా, దయామూర్తిగా నిత్యం ప్రార్థనలు చేస్తున్నారు భక్త జనులు.

భానుమతీ రామకృష్ణ

banumathi "మల్టీ ఫేసేటేడ్ క్వీన్ అఫ్ ఇండియన్ సినెమా" అన్న ఒక్క మాటలో భానుమతి గారికి చక్కగా నిర్వచనం ఇచ్చారు ఎవరోగాని. ఒక వ్యక్తిలో సంగీతం, సాహిత్యం, నటనా వైదుష్యం,కార్య నిర్వహణా దక్షత, దర్శకత్వ ప్రతిభా, ఎడిటింగ్ నైపుణ్యం, పాటలు వ్రాయడం, సంగీతం సమకూర్చడం, స్టూడియో నిర్వహణా, మంచితనం, మానవత్వం, ధైర్యం --ఇలా అన్నన్ని సుగుణాలు ఎలావచ్చాయో అని ఆలోచిస్తే అది భగవద్దత్తం అని అనిపించక మానదు.
 భారతదేశం గర్వంచదగ్గ నటీమణుల్లో ఆమె ఒకరు. నటిగానే కాకుండా గాయనిగా, రచయితగా, నిర్మాతగా, సంగీత దర్శకురాలిగా, దర్శకురాలిగా ఆమె అందుకున్న శిఖరాగ్రాలు అనితరసాధ్యమైనవి. ఏడు దశాబ్దాలు ఆమె సినీకళామతల్లికి చేసిన సేవలు అజరామరం.

 

ముగ్గులు :: ౫౮

 27 చుక్కలు, 3 వరుసలు, 3 వచ్చే వరకు

ముగ్గులు :: ౫౪

13 చుక్కలు, 3 వరుసలు, 3 వచ్చే వరకు

ముగ్గులు :: ౫౩

15 చుక్కలు, మధ్యచుక్క 8 వరకు

ముగ్గులు :: ౫౨

13 చుక్కలు, మధ్యచుక్క 7 వరకు

ముగ్గులు :: ౫౧

16 చుక్కలు, 2 వరుసలు, 2 వచ్చే వరకు

ముగ్గులు :: ౫౦

13 చుక్కలు, మధ్యచుక్క 7  వరకు

ముగ్గులు :: ౪౯

12 చుక్కలు, మధ్యచుక్క 8  వరకు

ముగ్గులు :: ౪౮

19 చుక్కలు, చుక్క విడిచి చుక్క 1  వచ్చే వరకు

ముగ్గులు :: ౪౭

7 చుక్కలు, 1 వరకు

ముగ్గులు :: ౪౬

15 చుక్కలు, 5 వరుసలు, 5 వచ్చే వరకు

ముగ్గులు :: ౪౫

7 చుక్కలు, మధ్యచుక్క 4  వరకు

ముగ్గులు :: ౪౪

15 చుక్కలు, చుక్క విడిచి చుక్క 1  వచ్చే వరకు

ముగ్గులు :: ౪౩

9 చుక్కలు, 1 వరకు

ముగ్గులు :: ౪౨

18 చుక్కలు, 2 వరుసలు, 2 వచ్చే వరకు

ముగ్గులు :: ౪౧

20 చుక్కలు, 6 వరుసలు, 6 వచ్చే వరకు

ముగ్గులు :: ౪౦

17 చుక్కలు 3 వరుసలు, 1౩ చుక్కలు 3 వరుసలు, 9చుక్కలు 2 వరుసలు,3 చుక్కలు 2

వరుసలు

ముగ్గులు :: ౩౯

26 చుక్కలు, 10 వరుసలు

ముగ్గులు :: ౩౮

26 చుక్కలు, 10 వరుసలు

ముగ్గులు :: ౩౬

33 చుక్కలు,  5 వరుసలు, 5 వరకు సరిచుక్క

ముగ్గులు :: ౩౫

21 చుక్క విడిచి 1

ముగ్గులు :: ౩౪

21 చుక్క, 1 సరిచుక్క

ముగ్గులు :: ౩౩

26 చుక్కలు, 10 వరుసలు, 10 వరకు

ముగ్గులు :: ౩౨

24 చుక్కలు, 8 వరుసలు, 8 వరకు సరిచుక్క

ముగ్గులు :: ౨౭

17 చుక్కలు, మధ్యచుక్క 9 వరకు

ముగ్గులు :: ౨౬

20 చుక్కలు, మధ్యచుక్క 11  వరకు

ముగ్గులు :: ౨౫

21 చుక్కలు, మధ్యచుక్క 11  వరకు

ముగ్గులు :: ౨౪

21 చుక్కలు, మధ్యచుక్క 11  వరకు

ముగ్గులు :: ౨౩

23 చుక్కలు, మధ్యచుక్క 12 వచ్చే వరకు

ముగ్గులు :: ౨౨

21 చుక్కలు, 5 వరుసలు 5  వచ్చే వరకు

ముగ్గులు :: ౨౧

21 చుక్కలు, మధ్యచుక్క 11  వరకు

పి.వి.నరసింహారావు

pv narasimha raoప్రముఖ రాజనీతిజ్ఞుడు, బహు  భాషా కోవిదుడు,  దక్షిణాది రాష్ట్రాల నుండి ఎన్నికైన తొలి భారత ప్రధాని, గొప్ప సంస్కరణ అభిలాషి  కీ.శే. పి.వి.నరసింహారావు.  గొప్ప పండితుడు. వేయిపడగల్ని  హిందీలోకి  అనువదించాడు.

ముగ్గులు :: ౨౦

13 చుక్కలు, మధ్యచుక్క 7  వరకు

ముగ్గులు :: ౧౯

21 చుక్కలు, మధ్యచుక్క 11  వరకు

ముగ్గులు :: ౧౮

20 చుక్కలు, 2 వరుసలు 2 వచ్చే వరకు
 

ముగ్గులు :: ౧౭

16 చుక్కలు, 2 వరుసలు 2  వచ్చే వరకు

ముగ్గులు :: ౧౬

22 చుక్కలు, చుక్క విడిచి చుక్క 2  వచ్చే వరకు

ముగ్గులు :: ౧౫

21 చుక్కలు, చుక్క విడిచి చుక్క 1  వచ్చే వరకు

ముగ్గులు :: ౧౪

21 చుక్కలు, చుక్క విడిచి చుక్క 1  వచ్చే వరకు

ముగ్గులు :: ౧౩

16 చుక్కలు, 5 వరుసలు 5  వచ్చే వరకు

ముగ్గులు :: ౧౨

15 చుక్కలు, చుక్క విడిచి చుక్క 1  వచ్చే వరకు

ముగ్గులు :: ౧౧

19 చుక్కలు, చుక్క విడిచి చుక్క 1  వచ్చే వరకు

ముగ్గులు :: ౧౦

13 చుక్కలు, మధ్యచుక్క 7 వచ్చే వరకు

ముగ్గులు :: ౯

15 చుక్కలు,  మద్యచుక్క 8 వరకు

ముగ్గులు :: ౮

15 చుక్కలు,  మద్యచుక్క 8 వరకు

ముగ్గులు :: ౭

15 చుక్కలు,  మద్యచుక్క 8  వచ్చే వరకు

ముగ్గులు :: ౬

15 చుక్కలు,  మద్యచుక్క 8 వరకు

ముగ్గులు :: ౫

18 చుక్కలు, 18 వరకు సరిచుక్క

ముగ్గులు :: ౪

21 చుక్క, 1 వరకు సరిచుక్క

ముగ్గులు :: ౨

21 చుక్క, 1 వరకు సరిచుక్క

ముగ్గులు :: ౩

22 చుక్కలు, 10 వరసలు, 10వరకు సరిచుక్క

ముగ్గులు ౧

21 చుక్క వరకు సరిచుక్క

కాకతీయుల వైభవం

kakateeyulu  రుద్రదేవ మహారాజు కాకతీయ సామ్రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా నెలకొల్పి ఈ ఏటికి 850 సంవత్సరాలు, కాకతీయ మహా సామ్రాజ్ఞి రుద్రమదేవి పట్టాభిషేకం జరిగి ఈ ఏటికి 750 సంవత్సరాలు, హనుమకొండలో  వేయి స్థంబాల గుడి నిర్మించి ఈ ఏటికి 850 సంవత్సరాలు, అంతే కాదు పాలం పేటలోని ప్రసిద్ద రామప్ప దేవాలయం నిర్మించి కూడా ఈ ఏటికి 800 సంవత్సరాలు..

అలనాటి స్వర్ణయుగ వైభవానికి ప్రతీక.. శిల్పకళా సౌందర్యానికి నిలయం.. సాహితీ వేత్తల సౌరభాలు గుబాళించిన నేల.. వెలకట్టలేని 'కోహినూర్' పుట్టినిల్లు.. కాకతీయ సామ్రాజ్యం. శాతవాహనుల తర్వాత తెలుగు దేశాన్నంతా ఒక రాజకీయ ఛత్రం క్రిందకు తెచ్చి దేశ సమగ్రత, సమైక్యతను చేకూర్చిన తెలుగుపాలకులు కాకతీయులు. ఆంధ్రదేశ చరిత్రలో కాకతీయులకు ఒక ప్రత్యేక, విశిష్టమైన స్థానం ఉంది. వీరు విశాల సామ్రాజ్యాన్ని పాలించడమే కాక పటిష్ట పరిపాలనావ్యవస్థను ప్రవేశపెట్టి వ్యవసాయానికి నీటి వనరులు కల్పించి,గ్రామీణ జనజీవితాలలో కళా సాహిత్యాలను సజీవపరిచి, విశిష్టమైన దేవాలయ నిర్మాణాలను కావించి, తెలుగువారి రాజకీయ, సాంస్కృతిక వారసత్వ జీవనానికి తోడ్పడినారు.కాకతీయుల కాలంలోనే ఆంధ్ర, త్రిలింగ పదాలు సమానార్థకాలై, దేశపరంగా, జాతిపరంగా ప్రచారం పొందాయి. వీరు ఆంధ్రదేశాధీశ్వర బిరుదు ధరించారు.

ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌

c p brown1817, ఆగస్ట్‌ 13. ఇంగ్లండ్‌ నుంచి భారతదేశానికి ఓడ ఒకటి బయల్దేరింది. దాని పేరు కర్ణాటక్‌. వందలాది ప్రయాణికులున్నారు అందులో. ఆ వందల్లో ఓ అనామకుడు. 19 ఏళ్లవాడు. పేరు.. ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌. భవిష్యత్తులో మరణశయ్యపై ఉన్న తెలుగు సాహిత్యాన్ని.. శాస్త్రీయతా అనే గంగతో బతికించే సాహితీ భగీరథుడు. 'కానీ ఆ ఓడ ఎక్కేటప్పుడు అసలు 'తెలుగు' అనే మూడక్షరాల మాట విన్లేదు' అంటాడతను నిజాయతీగా.

ప్రజా పాటల త్యాగయ్య "గరిమెళ్ళ సత్యనారాయణ"

గరిమెళ్ళ సత్యనారాయణ"మాకొద్దీ తెల్ల దొరతనం" అంటూ సత్యాగ్రహుల్లో గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించి... "దండాలు దండాలు భారత మాత" అంటూ ప్రజలను ఎంతగానో జాగృతం చేసిన కవి గరిమెళ్ళ సత్యనారాయణ. స్వాతంత్రోద్యమ కవుల్లో విశిష్టమైన స్థానం సంపాదించుకున్న ఈయన గేయాలన్నీ అప్పట్లో జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాలను ఉర్రూతలూగించాయి.

మాధవపెద్ది సత్యం

మాధవపెద్ది సత్యంరంగస్థల అనుభవం ఆయన్ని తీర్చిదిద్దింది
పద్యం ఆయన గళంలో వయ్యారాలు పోయింది

దుర్యోధనుడు, రావణుడు, ఘటోత్కచుడు....
ఇలా ఎన్నో పాత్రలకు ఆయన కంఠం జీవం పోసింది

ఎస్వీరంగారావు, రేలంగి, రమణారెడ్డి ......
ఇలా ఎందఱో నటులకు ఆయన కంఠం అమరి పోయింది

ఆంధ్రుల అభిమాన గయ్యాళి అత్త "సూర్యకాంతం"

suryakantamసూర్యకాంతం, ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆమె పాత్రలు అంతగా ప్రజా జీవితంలోకి చొచ్చుకుని పోయాయి. సూర్యకాంతం తెర మీద పాత్రలను ఎంత అద్భతంగా పోషించేవారో.. నిజ జీవితంలో అంతే ఉన్నతంగా జీవించేవారు.

రాణీ రుద్రమదేవి

రాణీ రుద్రమదేవి కాకతీయుల వంశంలో ఒక ధ్రువతారగా వెలిగిన మహారాణి. కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీరవనిత. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు. ఈమె అసలు పేరు రుద్రాంబ. ఈమె తండ్రి గణపతిదేవునికి పుత్ర సంతానం లేదు. అందువలన రుద్రాంబను తన కుమారుడిలా పెంచుకొని రుద్రదేవుడని నామకరణం చేసాడు. నిరవద్యపుర(నిడదవొలు)పాలకుడు వీరభద్ర ఛాళుక్యుడు ఈమె భర్త.

గాడిద గుడ్డు పెడుతుందా? గద్ద పిల్లను కంటుందాన్నట్టు

కొన్ని కొన్ని అసాధ్యాలను గురించి స్పష్టం చేసేటప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. గాడిద గుడ్డు పెట్టడం, గద్ద నేరుగా పిల్లను కనడం సృష్టిలో జరిగే పనికాదు. అలాగే ఎదురుగా ఉన్న పని అసంభవం అని చెప్పాల్సివచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

మూలం/సేకరణ: 
eenadu.net

కలుపు తియ్యని మడి... దేవుడు లేని గుడి

ఏ పని చేసినా సంస్కారవంతంగా ఉండాలంటారు పెద్దలు. ఈ విషయాన్ని వ్యవసాయానికి ముడిపెట్టి చెప్పిన జాతీయం ఇది. మడిలో కలుపు తియ్యకుండా ఉంటే చేను బాగా పండటం కష్టం. దానివల్ల రైతుకు ఎలాంటి ఉపయోగం ఉండదు.

మూలం/సేకరణ: 
eenadu.net

వూరోరి పత్తి వూరోరి చమురు వూగూగు దేవుడా..

కొంతమంది లోకుల సొమ్ముతో సరదాగా కాలక్షేపం చేస్తుంటారు. అలాంటి వారిని గురించి వ్యంగ్యంగా చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. దేవుడిముందు వెలిగించే దీపంలో వత్తికి సంబంధించిన పత్తి, చమురు అన్నీ వూరి వారివే.

మూలం/సేకరణ: 
eenadu.net

ఇచ్చిన వాడు తలమీద.. ఇవ్వనివాడు నేలమీద..

తమకు సహాయం చేసిన వారిని మాత్రమే కొందరు గౌరవిస్తుంటారు. ఇతరులను ఏమాత్రం పట్టించుకోకపోగా కొన్ని సందర్భాలలో అవమానిస్తుంటారు కూడా.

మూలం/సేకరణ: 
eenadu.net

పులికి ఏ అడవైనా ఒక్కటేనన్నట్టు..

పనిచేసేవారికి, శక్తిసంపన్నులకు ఏ ప్రదేశమైనా ఒకటేనని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ఉద్యోగుల బదిలీ విషయంలో ఇది ఎక్కువగా వినిపిస్తుంటుంది. పులి గాంభీర్యానికి, శక్తికి సంకేతం.

మూలం/సేకరణ: 
eenadu.net

బడిలేని చదువు, వెంబడిలేని సేద్యం..

వ్యవసాయాధారితమైన దేశం కనుక మన దేశంలో సేద్యాన్ని పోలికగా తీసుకొని అవతరించిన జాతీయాలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో ఇదొకటి. చదువు, వ్యవసాయం రెండూ సక్రమంగా ఉండాలంటే ఏ పరిస్థితులుండాలో దీనిలో చెప్పటం కనిపిస్తుంది.

మూలం/సేకరణ: 
eenadu.net

వంట అయింది కానీ వడ్లు ఇంకొంచెం ఎండాలన్నట్టు..

కొంతమంది అప్పగించిన పనిని సమయానికి ముగించకుండానే ఆ పని ముగించేసినట్టు చెబుతుంటారు. నిక్కచ్చిగా నిలదీసి అడిగితే తప్పించుకోవడానికి ఏవో కారణాలను చూపుతుంటారు.

మూలం/సేకరణ: 
eenadu.net

గరుడాయ లెస్సా అంటే...

గరుడాయ లెస్సా అనంటే శేషాయ లెస్సా అన్నట్టు అన్నది జాతీయం. గరుడుడు, శేషుడు ఎవరి స్థాయిలలో వారు గొప్పవారే. కానీ ఒకరినొకరు పలకరించుకోవటానికి వారి మధ్యన ఉండే జాతి వైరాలులాంటివి అడ్డు వచ్చే అవకాశాలుంటాయి. ఆత్మాభిమానం కూడా అడ్డురావచ్చు.

మూలం/సేకరణ: 
eenadu.net

కాలుజారి నేల మీద పడి...

కాలుజారి నేల మీద పడి నేల అచ్చిరాలేదన్నట్టు అన్నది జాతీయం. ఆడలేక మద్దెల ఓడన్న దానికి ఇది సమానార్థకం. ఓ వ్యక్తి సరిగా చూసుకోకుండా అజాగ్రత్తగా నడుస్తూ జారి కిందపడ్డాడట. అజాగ్రత్తగా ఉండటమన్నది అతడి వైపు నుంచి జరిగిన తప్పు.

మూలం/సేకరణ: 
eenadu.net

అమ్మా తల్లీ అంటే అప్పాలన్నీ తినేసిందన్నట్టు..

చనువిస్తే చంకనెక్కింది అన్న దానికి సమానార్థకం ఇది. కొంతమందికి ఏ కొంచెం అలుసిచ్చినా మొత్తం ఆక్రమించి అలుసిచ్చిన వారిని అణగదొక్కుతుంటారు. అలాంటి వారి గురించి ప్రస్తావించాల్సినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.

మూలం/సేకరణ: 
eenadu.net

ఎన్ని పుంగనూర్లు అయితే ఒక బెంగుళూరు అవుతుందన్నట్టు..

చుక్కల్లో చంద్రుడులాంటిది ఇది. అన్నిటికంటే అధికం అని చెప్పే సందర్భాలలో దీని ప్రయోగం కనిపిస్తుంది. ఇటువంటి జాతీయాలు స్థానికంగా మాండలికపరంగా ఎక్కడికక్కడ ఉంటూనే ఉంటాయి. కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన బెంగుళూరు నగరం చాలా గొప్పది అని చెప్పటం దీనిలో పైపైకి కనిపించే విషయం.

మూలం/సేకరణ: 
eenadu.net

చేతికొచ్చింది నోటికొచ్చిందాకా నమ్మకం లేనట్టు..

స్థిరం లేని వ్యవహారం, నమ్మకంలేని పని అనేలాంటి అర్థాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

మూలం/సేకరణ: 
eenadu.net

చచ్చిన పామును కొట్టడానికి అందరూ బంట్లేనన్నట్టు

హాని కలిగించని పని, కష్టం లేని పని అంటే ఆ పని చేయటానికి అందరూ ముందుకొస్తారని, శక్తిహీనులు కూడా తాము శక్తివంతులమని చెప్పుకోటానికి అలాంటి పనులకు ముందుకు వస్తారని తెలియచెప్పటమే ఈ జాతీయ లక్ష్యం.

మూలం/సేకరణ: 
eenadu.net

ఈ అన్నది లేదు, తే అన్నదే తరతరాలుగా వస్తున్నది..

ఈ (ఇవ్వు) అన్నది లేదని, తే (తీసుకురా) అన్నదే అలవాటని చెప్పటం ఈ జాతీయంలో అంతరార్థం. ఇక్కడ కనిపిస్తున్న ఈ, తే అనే రెండూ రెండు విభిన్నార్థాలను కలిగి ఉన్నాయి. ఈ అంటే దయచేసి ఇవ్వు అని బతిమలాడటం లేదా యాచించటం, తే అంటే తీసుకురా అని ఆజ్ఞాపించటం అనేది అర్థం.

మూలం/సేకరణ: 
eenadu.net

పూతకు ముందే పురుగు పట్టినట్టు...

పని ప్రారంభానికి ముందే విఘ్నాలు ఏర్పడటం లేదా ఆ పనికి సంబంధించినవేవైనా చెడిపోవటం అనేలాంటివి జరిగినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. పువ్వు పూయాలంటే మొగ్గగా ముందు అది ఉద్భవిస్తుంది. మొగ్గ విచ్చుకొని పువ్వవుతుంది.

మూలం/సేకరణ: 
eenadu.net

ఉంటే ఉగాది లేకపోతే శివరాత్రి అన్నట్టు..

పండుగలు జరుపుకొనే తీరును జీవన గమనానికి ముడిపెట్టి చెప్పిన జాతీయం ఇది. ఉగాది పండుగనాడు కొత్తబట్టలు, పిండివంటలతో అంతా సుఖసంతోషాలతో ఉంటారు. శివరాత్రి అంటే ఉపవాస ప్రధానమైన పండుగ. ఏవీ తినకూడదు. అంటే డబ్బులుంటే కొంతమంది ఉగాది పండుగ చేసుకున్నంత సంబరంగా కాలం గడుపుతారు.

మూలం/సేకరణ: 
eenadu.net

కుక్క వేషం వేసి మొరగనంటే ఎలా?

ఒక పనిని ఒప్పుకున్నప్పుడు దానికి సంబంధించిన వాటన్నిటినీ చెయ్యాల్సిందే. సగం పనులు చేసి మిగతావి చెయ్యటం నాకు ఇష్టం లేదు. నేను చెయ్యను అనంటే అది కుదిరేపనికాదు అని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ఇక్కడ కుక్క అని అనడం నీచత్వానికి ప్రతీక.

మూలం/సేకరణ: 
eenadu.net

ఎండిన మోడుకు ఎర్రని పూలు తగిలించినట్టు..

అసంబద్ధమైన పని అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఏ పనిచేసినా అతికినట్లుండాలని అంటారు. ఆ అతికింది సహజసిద్ధంగా ఉన్నట్లు కనిపింపజేయటంలోనే నైపుణ్యం అంతా ఇమిడి ఉంటుంది. అలాగాక పని చేతకాకపోతే మాసికలు వేసినట్లు అతుకులు అతుకులుగా ఉంటుంది.

మూలం/సేకరణ: 
eenadu.net

ఛీ కుక్కా అంటే ఏమక్కా అన్నట్టు..

కొంతమంది ఎదుటివారు నిందించినప్పుడు దానికి తగిన రీతిలో నర్మగర్భంగా సమాధానాలు చెబుతుంటారు. అలా మాటకు మాట అనటం కూడా ఓ గొప్ప కళ. ఒకామె మరో ఆమెనుఛీ కుక్కా పో అని తిట్టిందట. దానికి ఎదుటామె ఏమాత్రం బాధపడకుండా, ీఏమక్కా పిలుస్తున్నావు' అన్నదట.

మూలం/సేకరణ: 
eenadu.net

రాగల వసంతాన్ని కాకులు ఆపుతాయా అన్నట్టు..

ఒకరి అదృష్టాన్ని మరొకరు పాడుచేయలేరని అంటారు. అలాంటిదే ఇది. రుతువుల క్రమంలో వసంత రుతువు రావటం, కోయిలలు కూయటం ఇవన్నీ మామూలే. అయితే వసంతంలో కోయిలలు కూస్తాయని అప్పుడు వాటినే అందరూ మెచ్చుకొంటారని కుళ్లుకునే కాకులు వసంతం రాకూడదు, రాకూడదు అంటూ అనుకుంటూ కూర్చున్నాయట.

మూలం/సేకరణ: 
eenadu.net

చవి ఎరిగిన కుక్క చావగొట్టినా పోదన్నట్టు..

కొంతమంది ఎదుటివారి ఇళ్లలో భోజనాలు చేసే సమయానికి, అల్పాహారం చేసే సమయానికి వచ్చి తిని వెళుతుంటారు.

మూలం/సేకరణ: 
eenadu.net

కాణీకి టెంకాయ ఇస్తారని కాశీదాకా వెళ్లినట్టు

కొంతమంది అత్యాశకు పోయి అధికంగా ఖర్చు చేస్తుంటారు. అలాంటి వారిని గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. పూర్వం కాణీలు, అణాలు ఉన్న రోజుల్లో ప్రచారంలోకి వచ్చిన జాతీయమే అయినా ఈ నాటికీ చాలామందికిది వర్తిస్తుంది.

మూలం/సేకరణ: 
eenadu.net

వడ్డీ వేగానికి వడిగుర్రాలు కూడా ఆగవన్నట్టు..

వడ్డీకి డబ్బు అప్పు తెచ్చిన వారి బాధను తెలిపే జాతీయం ఇది. వడ్డీ కట్టేశాం కదా అని అనుకొనేంతలోపే మళ్లీ నెల తిరిగి రావటం, తిన్నా తినకపోయిన అప్పులవాళ్లకు వడ్డీ కట్టడం జరుగుతుంటుంది. వడ్డీ కట్టేరోజు ఎంతో వేగంగా వస్తున్నట్టు అనిపిస్తుంటుంది.

మూలం/సేకరణ: 
eenadu.net

దరిలేని బావి దాపులేని కొంప అన్నట్టు

వెళ్లటానికి సమీపంలో లేని విషయాలను గురించి చెప్పుకొనేటప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. మనిషికి కావలసిన ప్రధాన అవసరాలలో తాగటానికి నీరు, ఉండటానికి ఇల్లు ముఖ్యమైనవి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ జాతీయం అవతరించింది. బావి దగ్గరగా ఉంటే నీటి సౌకర్యం బాగా ఉంటుంది.

మూలం/సేకరణ: 
eenadu.net

అత్త మెత్తన వేము తీయన ఉండవన్నట్టు..

సామాన్య కుటుంబ జనజీవనంలో అత్తకోడళ్ల నడుమ తగాదాలు చెలరేగే పరిస్థితులను చూసిన కొందరు చెప్పిన జాతీయం ఇది. అత్తలు కోడళ్లను నెగ్గుకురానివ్వరని కఠినంగా ప్రవర్తిస్తూ వారని హింసిస్తుంటారన్న భావనతో అవతరించిన జాతీయమిది.

మూలం/సేకరణ: 
eenadu.net

ఎద్దుకు చొప్పవేసి ఆవును పాలియ్యమన్నట్టు..

దౌర్జన్యం చేసేవారిని పెంచి పోషిస్తూ మంచివారిని పనిచెయ్యండని ఒత్తిడి చేస్తుంటారు కొందరు. అలాంటివారిని గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. ఆవు సాధుజంతువు. ఎద్దును బలవంతులకు పోలికగా చెబుతారు. ఈ పోలికే ఈ జాతీయ ఆవిర్భావానికి వేదికైంది.

మూలం/సేకరణ: 
eenadu.net

అత్త మెత్తన వేము తీయన ఉండవన్నట్టు..

సామాన్య కుటుంబ జనజీవనంలో అత్తకోడళ్ల నడుమ తగాదాలు చెలరేగే పరిస్థితులను చూసిన కొందరు చెప్పిన జాతీయం ఇది. అత్తలు కోడళ్లను నెగ్గుకురానివ్వరని కఠినంగా ప్రవర్తిస్తూ వారని హింసిస్తుంటారన్న భావనతో అవతరించిన జాతీయమిది.

మూలం/సేకరణ: 
eenadu.net

ఎద్దుకు చొప్పవేసి ఆవును పాలియ్యమన్నట్టు..

దౌర్జన్యం చేసేవారిని పెంచి పోషిస్తూ మంచివారిని పనిచెయ్యండని ఒత్తిడి చేస్తుంటారు కొందరు. అలాంటివారిని గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. ఆవు సాధుజంతువు. ఎద్దును బలవంతులకు పోలికగా చెబుతారు. ఈ పోలికే ఈ జాతీయ ఆవిర్భావానికి వేదికైంది.

మూలం/సేకరణ: 
eenadu.net

కలిగిన వారికి అందరూ చుట్టాలే..

లోకం తీరును వివరించే జాతీయం ఇది. కలిగిన వారు అనంటే సంపదలు కలిగినవారు అని అర్థం. డబ్బు లేని పేదవాడిని ఎవరూ తనవాడు అని చెప్పుకోరు.

మూలం/సేకరణ: 
eenadu.net

పిలిచి పెద్దపులికి పేరంటం చేసినట్లు..

ప్రమాదాలను కొనితెచ్చుకొని, ప్రమాదకారులను గౌరవిస్తూ ప్రమాదంలో పడటం తెలిసో తెలియకో చాలాసార్లు జరుగుతుంటుంది. అలాంటి సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. పెద్దపులి ఎంతటి క్రూరజంతువో అందరికీ తెలిసిందే.

మూలం/సేకరణ: 
eenadu.net

ఈ మొగానికి శేరు పసుపు...

ఒక్కొక్కసారి అనర్హులను అర్హులుగా భావించి వారికి సన్మానాలు, సత్కారాలు చేయటం జరుగుతుంటుంది. అలా అనర్హులకు లభ్యమయ్యే గౌరవాన్ని చూసినప్పుడు వారి విషయం తెలిసిన వారు విమర్శిస్తూ మాట్లాడే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం వినిపిస్తుంటుంది.

మూలం/సేకరణ: 
eenadu.net

ఆరాటమేకానీ పోరాటం లేదన్నట్టు

బద్ధకస్తులైన ఆశపోతుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. ఆశతో ఇది నాకు కావాలి అని ఆరాటపడిపోతే చాలదు. కావాలనుకున్న దాన్ని సాధించుకొనేందుకు పోరాటం చేయాలి.

మూలం/సేకరణ: 
eenadu.net

పంజరంలో పెట్టినా కాకి చిలుక పలుకులు పలకదన్నట్టు..

చిలుకలను పంజరంలో పెట్టి పెంచుకొనే అలవాటు కొందరికి ఉంటుంది. చిలుకలాగే కాకికూడా పక్షే కదా దాన్ని కూడా తెచ్చి పంజరంలో పెడితే చిలుకలాగే చక్కగా పలుకుతుందేమోనని ఓ వ్యక్తి అనుకున్నాడట. చిలుక పలకటానికి పంజరమే కారణమన్నది అతని భావన.

మూలం/సేకరణ: 
eenadu.net

పాడిపసరం, పసిబిడ్డ ఒకటేనన్నట్టు..

వ్యవసాయం ఆధారంగా జీవించే కుటుంబాలు ఎక్కువ ఉన్న మనదేశంలో వ్యవసాయ నేపథ్యం నుంచి అనేక జాతీయాలు ఆవిర్భవించాయి. ఈ జాతీయం కూడా అలాంటిదే. పసరం అంటే పశువు అని అర్థం. పాడిపసరం అంటే పాడిగొడ్డు. అది ఆవు కావొచ్చు, గేదె కావొచ్చు.

మూలం/సేకరణ: 
eenadu.net

ఆముదపు విత్తులు ఆణిముత్యాలవుతాయా అన్నట్టు..

కొంతమందిని మార్చి మంచి పద్ధతిలో పెట్టాలని ఎంత ప్రయత్నం చేసినా అది సాధ్యం కాదు. వారి సహజ గుణాన్ని మార్చుకోక పాత పద్ధతిలో అలాగే ఉండిపోతారు. ఆముదపు గింజల్ని ఎంతగా చెక్కి రంగులద్దినా వాటిని ఆణిముత్యాలు అని ఎవరికైనా చూపించి నమ్మించటం కూడా కష్టమే అవుతుంది.

మూలం/సేకరణ: 
eenadu.net

తెగితే లింగడు రాయేనన్నట్లు

స్థానబలిమి కాని తన బలిమి కాదు అని అన్నాడు వేమన. తమతమ నెలవులు తప్పిన తమ మిత్రులే శత్రువులవుతారన్నాడు బద్దెన. అట్లాంటిదే ఇది.

మూలం/సేకరణ: 
eenadu.net

జరిగితే బండి, జరక్కపోతే బండ..

మనిషిగా గుర్తింపు పొందాలంటే నిత్యచైతన్యంతో విరాజిల్లాలి. అలాకాక బద్ధకంతో ఒకచోట పడి ఉంటే ఎవరూ లెక్కచేయరని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. బండి చైతన్యానికి, చలనానికి ప్రతీక. బండ మొద్దుతనానికి గుర్తు. జరిగి ముందుకు సాగిందంటే అది బండి లక్షణం.

మూలం/సేకరణ: 
eenadu.net

భోజుడు వంటి రాజు ఉంటే, కాళిదాసులాంటి కవి ఉంటాడన్నట్టు..

పాలకులను బట్టే ప్రజల జీవన విధానం ఉంటుందని తెలియ చెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. భోజమహారాజు ప్రజలను చక్కగా పాలిస్తూ కవులను ఆదరించాడు కనుకనే కాళిదాసులాంటి కవి వెలుగు చూడగలిగాడు.

మూలం/సేకరణ: 
eenadu.net

వయస్సు తప్పినా వయ్యారం తప్పనట్లు..

ఏ వయస్సుకు ఆ ముచ్చటంటారు. ముద్దు ముచ్చట్లన్నీ యుక్తవయస్సులో ఉన్నప్పుడైతే చూడటానికి బాగుంటుందేమో కానీ వయస్సు మీరిన తర్వాత అవి అంతగా బాగుండవు. వయ్యారంగా ఉండటమనేది వయస్సులో ఉన్నవారికైతే చక్కగానే ఉంటుంది.

మూలం/సేకరణ: 
eenadu.net

ఉప్పు లేదు, కారం లేదు అమ్మతోడు....

'ఉప్పు లేదు, కారం లేదు అమ్మతోడు అయినా రుచిగానే ఉందన్నట్టు' అన్నది జాతీయం. కొంతమంది మొహమాటస్తులను గురించి వివరించి చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. పదార్థానికి రుచి రావాలంటే ఉప్పు, కారం ఉండాలి. ఇది సర్వసాధారణమైన విషయం.

మూలం/సేకరణ: 
eenadu.net

ఇంట ఆచారత్వం, బయట బడా చోరత్వం..

పైకి ఒకలాగా లోలోపల మరొలాగా ప్రవర్తించేవారుంటారు. అలాంటి వారిని గురించి చెప్పాల్సివచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. ఆచారత్వం, చోరత్వం అనే పదాలను ప్రాస కోసమో, తూగు కోసమో వాడినా అంతరార్థం మాత్రం ముక్కుసూటిగా తప్పును విమర్శించినట్టే ఉంటుంది.

మూలం/సేకరణ: 
eenadu.net

అదును చూసి పొదలో చల్లినా పండుతుందన్నట్టు

సమయ సందర్భాలను, సమయస్ఫూర్తిని పాటించినప్పుడే ఎవరికైనా విజయం దక్కుతుందనే విషయాన్ని వివరించి చెప్పే జాతీయం ఇది. సక్రమంగా వర్షాలు కురిసే నేల అదునుగా ఉన్నప్పుడు విత్తనాలు చల్లితే ఆ విత్తనాలు మొలకెత్తుతాయి.

మూలం/సేకరణ: 
eenadu.net

పనికి పరాకు... తిండికి హుషారు

బద్ధకస్తులను గురించి తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. బద్ధకస్తులు ఏదైనా పనిచేయమన్నప్పుడు పరాకుగా పరధ్యానంగా ఉంటుంటారు. అదే తినటానికి రమ్మంటే హుషారుగా ఎక్కడలేని ఓపికతో పరుగెత్తుతుంటారు.

మూలం/సేకరణ: 
eenadu.net

ఇర్రికొమ్ము అంటే బర్రెకొమ్ము అన్నట్టు..

చెప్పిన దానికి విరుద్ధంగా ప్రవర్తించటం, ఒకపని చేయమంటే మరోలా అర్థం చేసుకొని వేరే ఏదోపని చేయటం అనేది కొంతమంది దగ్గర కనిపిస్తుంటుంది. అలాంటి వారిని గురించి చెప్పేటప్పుడు 'ఇర్రి కొమ్ము అంటే బర్రెకొమ్ము అంటాడు.

మూలం/సేకరణ: 
eenadu.net

అనిత్యాని శరీరాణి.. అందరి సొమ్మూ మనకేరాని..

మనిషిలోని బలహీనతలను, మోసగుణాలను వెక్కిరించే జాతీయాలు కూడా కొన్ని ఉన్నాయి. వ్యంగ్యంమాటున చురుకు పుట్టించే అలాంటి జాతీయాలలో ఇదొకటి. కొంతమంది ఎదుటివారికి విపరీతంగా నీతులు చెబుతుంటారు. తత్వోపదేశం చేస్తుంటారు. వారు మాత్రం అందుకు భిన్నంగా స్వార్థంతో ప్రవర్తిస్తుంటారు.

మూలం/సేకరణ: 
eenadu.net

ఎద్దు ఎండకు దున్న నీడకు లాగినట్లు..

సరిపోని జోడి, కలయిక కలవని మనస్తత్వాలు అనే లాంటి అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. బండికి ఓ వ్యక్తి ఓ వైపు ఎద్దును, మరోవైపు దున్నను కట్టాడట. ఎద్దు ఒక వైపునకు, దున్న మరో వైపునకు బండిని లాగుతూ ఉంటే ఆ బండి ప్రయాణం ఎలా ఉంటుందో ఎవరైనా వూహించవచ్చు.

మూలం/సేకరణ: 
eenadu.net

ఓపలేని అత్తకు వంగలేని కోడలన్నట్టు..

బద్ధకంలాంటి వాటిలో ఒకరిని మించినవారు ఇంకొకరు అని వ్యంగ్యంగా చెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. అత్తకు ఓపిక లేదు ఏ పని చేసుకోలేదు అని అనుకొంటే ఆమెకు వచ్చిన కోడలు కూడా వంగటానికి ఇబ్బంది పడుతూ ఏ పనీ చెయలేని స్థితిలో ఉండిపోయిందట.

మూలం/సేకరణ: 
eenadu.net

కాగితం పులి .. ఏకుల ఏనుగు

ఆకారానికి మాత్రమే గంభీరంగా ఉండి వ్యవహారంలో తీసివేతగా ఉండే వ్యక్తులను గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. కాగితంలో చేసిన పులిబొమ్మ, ఏకులతో చేసిన ఏనుగు బొమ్మ ఆకారానికి మాత్రమే ఆ జంతువులను పోలి ఉంటాయి.

మూలం/సేకరణ: 
eenadu.net

గారాబాల బిడ్డకు...

గారాబాల బిడ్డకు గడ్డపారతో చెవులు కుట్టి చెవులకు పారలు తగిలించినట్టు అన్నది జాతీయం. కొంతమంది తమ పిల్లల విషయంలో అతి గారాబాన్ని చూపిస్తూ వారికి మేలు చేయటానికి బదులు కీడు కలిగించే పనులు చేస్తుంటారు.

మూలం/సేకరణ: 
eenadu.net

ఇదిగో దున్న అంటే అదిగో వెన్న అన్నట్టు

ఎవరేం చెబితే దాన్ని గుడ్డిగా నమ్మటం, దాన్నే ప్రచారం చేయటం చాలా సందర్భాలలో లోకసహజంగా కనిపిస్తుంది. అలా అమాయకంగా నమ్మి ఎవరైనా నమ్మినదాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. అదిగో పులి అనంటే ఇదిగో తోక అనేలాంటిదే ఇది. దున్న పాలివ్వదు.

మూలం/సేకరణ: 
eenadu.net

కొన్న దగ్గర కొసరు కానీ కోరిన దగ్గర కొసరా అన్నట్టు

ఒకరిని యాచించేటప్పుడు లేదా కోరి అడిగి తీసుకొనేటప్పుడు ఇచ్చిన దాంతో తృప్తిపడాలి. అంతేకానీ ఇంకా ఇవ్వు ఇంకా ఇవ్వు అని కొసరటం పద్ధతి కాదు.

మూలం/సేకరణ: 
eenadu.net

కళ్లు మూయవచ్చుగానీ...

బలవంతంగా ఎవరిచేత ఏ పనీ చేయించలేము అని చెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ఎవరైనా కలలు కనాలంటే వారి మానసిక స్థితి ఆ కలలకు సంబంధించినదిగా ఉండాలి.

మూలం/సేకరణ: 
eenadu.net

మొండికి సిగ్గులేదు మొరటుకు ఎగ్గు లేదు

మానవ మనస్తత్వాల విశ్లేషణ చేసే జాతీయాలలో ఇది కూడా ఒకటి. ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు ఆలోచించుకోకుండా మొండిగా కొందరు వ్యవహరిస్తుంటారు. ఈ వ్యవహారం సిగ్గులేనితనంగా కూడా ఉంటుంది. అలాగే మొరటుగా మరికొందరు ప్రవర్తిస్తుంటారు. ఇలాంటివారు ఎగ్గును లెక్కచేయరు.

మూలం/సేకరణ: 
eenadu.net

తెలుగు యునికోడ్ ఖతులు (ఫాంట్స్)

ఇప్పుడు తెలుగులో కొత్త యునికోడ్ ఖతులు(fonts) అందుబాటులో ఉన్నాయి .. ఇవి ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రబుత్వం అందుబాటులో ఉంచింది.. ఈ ఖతులను మీ కంప్యూటర్ లో నిక్షిప్తం చేసుకొని వాడుకోవచ్చు.. వివరాలకు ఈ క్రింది లంకెను చూడండి

http://teluguvijayam.org/fonts.html

 

తరతరాల తెలుగుదనం... కోల్పోతున్నాం మనం

మేల్కోవాల్సిన తరుణం

    కోతికొమ్మచ్చులు, గోటింబిళ్లలు, గోదారీతలు, ఇసుకగుళ్లు, పాకంజీళ్లు, పప్పుబెల్లాలు, తొక్కుడుబిళ్లలు, వామనగుంటలు, వల్లంకి పిట్టలు, పట్టుపరికిణీలు, వెండిపట్టీలు, వైకుంఠపాళీలు, రుక్మిణీ కల్యాణాలు... ఏమయ్యాయి ఇవన్నీ? ఇవి అంతరించడం అంటే తెలుగుదనం అంతరించడం కాదూ?

Teluguమనిషి పుట్టుకకు ముందే మాతృభాషతో బంధం మొదలవుతుంది. అమ్మ మాట్లాడుతున్న చిన్న చిన్న మాటలను కడుపులోని బిడ్డ గ్రహించి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని, అలా అమ్మభాషను తన భాషగా సొంతం చేసుకునేందుకు ఆయత్తమవుతుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఎంతమందిలో ఉన్నా అమ్మ గొంతును పసివాడు గుర్తించడం, స్పందించడంలోని రహస్యం అదేనని తేల్చారు. అలా అమ్మనుంచి నేర్చిన భాష కనుక అది మనకు అమ్మభాష అవుతోంది. అమ్మభాషతో మనిషి బంధం ఉమ్మనీటిలో ఉన్ననాటిది! పద్దెనిమిది కోట్ల జనాభా కలిగిన ఆంధ్ర జాతికి అమ్మభాష తెలుగు. ఇంతమందికి ఇంటి నుడిగా స్థిరపడిన భాషలు ప్రపంచంలోనే బాగా అరుదు. అంతటి ఘనత వహించిన తెలుగు భాష 2030 నాటికి అంతరించిపోయే ప్రమాదంలో పడినట్లు ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది.

మహానటి సావిత్రి

savithriసావిత్రిని, ఆమె పోషించిన పాత్రలను మరిచిపోవడం ఆయా సినిమాలను చూసిన ప్రేక్షకుల తరంకాదు. జగతి మరువలేని నటిసావిత్రి. అమె నటనాకౌశలం ఒక అపూర్వ గ్రంథాలయం. ఎన్ని తరాలు మారినా ఆమె జీవించిన చిత్ర రాజాలు ఆంధ్రుల మదిలో ఎన్నటికీ నిలిచే ఉంటాయి. ఆమెని తెలుగు చిత్ర రంగంలో తిరుగులేని నటీమణిగా నిలబెట్టాయి. పాత్రలో ఆమె ఒదిగిపోయినట్లు మరెవ్వరూ ఒదిగిపోలేరు. అందుకే నటీ శిరోమణి అయింది.

ఘంటసాల

Ghantasalaఘంటసాల వెంకటేశ్వరరావు గారు (1922, డిసెంబర్ 4 - 1974) ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. ఈయన అర్ధ శతాబ్దముపాటు తెలుగు సినిమా పాటలకు గాత్రదానము చేశాడు. ఘంటసాల తెలుగు సినిమా తొలితరము నేపధ్యగాయకులలో ప్రముఖుడు.  ఘంటసాల ఒక తెలుగు సినీ నేపధ్యగాయకుడిగా మాత్రమే మనందరికీ తెలుసు. అయితే, ఆయన గాన గాంధర్వం ఒక్క తెలుగు భాషకే పరిమితం కాలేదు.

నేడు గురజాడ అప్పారావు గారి వర్దంతి

ఈ రోజు గురజాడ అప్పారావు గారు మరణించిన రోజు (నవంబర్ ౩౦)

గురజాడ అప్పారావు

డా.భోగరాజు పట్టాభి సీతారామయ్య

భోగరాజు పట్టాభి సీతారామయ్యభోగరాజు పట్టాభి సీతారామయ్య  స్వాతంత్ర్య సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు.  డాక్టర్‌గా తెలుగు భాషాభిమానిగా, ఖద్దరు దారిగా, స్వాతంత్య్ర సమరశీలిగా, మహాత్మాగాంధీకి ఆప్తునిగా, రాజకీయ చతురునిగా, నిరంతర ప్రజా సేవకునిగా, ముక్కుసూటి మనిషిగా మన్ననలందుకొన్నారు సీతారామయ్య. సామాన్య ప్రజలకు బ్యాంకులు అందుబాటులో లేని రోజుల్లో, అప్పులకోసం అన్నదాతలు ఎదురు తెన్నులు చూస్తున్న రోజుల్లో వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ఆంధ్రా బ్యాంక్‌ను స్థాపించారాయన.

1906లో మచిలీపట్నంలో వైద్యవృత్తిని చేపట్టారు. గాంధీజీ పిలుపు మేరకు 1916 లో ఆ వృత్తిని వదిలిపెట్టి స్వాతంత్య్రోద్య మంలో పాల్గొన్నారు. అంతే కాకుండా భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించే వరకు ఎటువంటి వృత్తిని చేపట్టకూడదనే ధ్యేయంతో ముందుకు నడిచారు.  1948లో జైపూర్‌ కాంగ్రెస్‌ సమావేశం నాటికి కాంగ్రెస్‌ అధ్యక్షుని స్థాయి కి ఎదిగారు. 1952-57 మధ్యకాలంలో మధ్యప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా వ్యవరించారు. నేడు దేశంలో ప్రముఖ బ్యాంకుగా చలామణి అవుతున్న ఆంధ్రాబ్యాంక్‌ను 1923లో స్థాపిం చాడు. అంతేకాకుండా ఈయన స్థాపించిన ఆంధ్ర ఇన్సూరెన్స్‌ కంపెని (1925), హిందు స్తాన్‌ ఐడియల్‌ ఇన్సూరెన్స్‌ కంపెని (1935) లు తరువాతి కాలంలో ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో విలీనమయ్యాయి. రాష్ట్రం బయట పనిచేసిననూ తెలుగు భాషపై మమకారం కోల్పోలేదు. తను స్థాపించిన ఆర్థిక సంస్థలలో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలని సూచించాడు. తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎన్నో చిరస్మరణీయ సేవలను అందించారు.

నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైన ఆయనకు రాష్ట్ర మంత్రి వర్గంలో అవకాశం తలుపుతట్టినా, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతి పదవి గుమ్మం వరకు వచ్చినా సున్నితంగా తిరస్కరించి ప్రజాసేవలో, రాజకీయాల్లో మునిగిపోయిన మహనీయుడు డాక్టర్‌ పట్టాభి సీతారామయ్య.

బాలల దినోత్సవ శుభాకాంక్షలు

childrenచాచా నెహ్రూ పుట్టిన రోజైన నవంబర్ 14ను మనదేశంలో  "బాలల దినోత్సవం"గా జరుపుకుంటున్నాము. చాచా నెహ్రూ మనదేశానికి తొలి ప్రధానమంత్రి. స్వాతంత్ర్యం కోసం తెల్లవారితో పోరాటం చేసేటప్పుడు మహాత్మాగాంధీకి ఈయన ప్రథమ శిష్యుడిగా ఉండేవారు. స్వాతంత్యం సంపాదించిన తరువాత మన దేశానికి మొట్ట మొదటి ప్రధానమంత్రిగా ఈయన పనిజేశారు.

దీపావళి శుభాకాంక్షలు

తెలుగువారందరికీ దీపావళి శుభాకాంక్షలు

diwali

నరక చతుర్థ్ద్దశి శుభాకాంక్షలు

ఆశ్వీయుజ మాసంలో బహుళపక్ష చతుర్దశి ‘నరక చతుర్దశి’. దీపావళి ముందు రోజు నరక చతుర్థ్ద్దశి . శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామా సమేతుడై నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన రోజు కనుక దీనికి ‘నరక చతుర్థ్ద్దశి’ అనే పేరు ఏర్పడింది. దీనికి సంస్కృతంలో ‘కాళ చతుర్దశి’ అంటే అంధకార చతుర్థ్ద్దశి అని పేరు. నరక చతుర్దశికి ‘ప్రేతచతుర్దశి’ అని కూడా పేరుంది. అభ్యంగ స్నానంవల్లా..యమ తర్పణం ఆచరించడంవల్ల మరణానంతరం నరకలోక బాధలు వుండవని కథనం.
narakasura vadanam
ఆశ్వయుజ బహుళ చతుర్దశిని ‘నరక చతుర్దశి’ అంటరు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై లోక కంటకుడైన నరకాసురుని సంహరించాడు.  సర్వలోకాలకు, దేవతలకు ఆనందాన్ని కలిగించిన ఆ రోజును జనమంతా ‘నరక చతుర్దశి’గా జరుపుకోసాగారు.

ఆంద్రప్రదేశ్ అవతరణ దినోత్సవం

AndraPradeshనవంబర్ 1 వ తేదీ అంటే ఇవాళ ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినం. 1953 వ సంవత్సరం ఇదే రోజు పదకొండు తెలుగు మాట్లాడే జిల్లాలు కలిసి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాయి. అంతకు ముందు ఇవి మద్రాస్ రాష్ట్రంలో ఉండేవి. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పనిచేసారు. అనంతరం 1956 నవంబర్ ఇదే రోజున నిజాం పాలనలో ఉన్న తెలంగాణా ప్రాంతాన్ని ఆంద్ర ప్రదేశ్ లో విలీనం చేసారు.
 

రావు బహదూర్ "కందుకూరి వీరేశలింగం పంతులు" గారు

కందుకూరి వీరేశలింగం పంతులు (1848 -1919)- తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త, మన తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి . సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు,తెలుగు సాహితీ వ్యాసంగంలోనూ నిరుపమానమైన కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. యుగకర్త గా,హేతువాదిగా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది.ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి.

కందుకూరి వీరేశలింగం పంతులు

విశిష్టత

ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి. ఆయనకున్న ఇతర విశిష్టతలు:

  • మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి
  • మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించాడు
  • తెలుగులో మొదటి స్వీయ చరిత్ర ఆయనదే
  • తెలుగులో తొలి నవల రాసింది ఆయనే
  • తెలుగులో తొలి ప్రహసనం రాసింది కందుకూరి
  • తెలుగుకవుల జీవిత చరిత్ర రాసిన మొదటి వ్యక్తి
  • విజ్ఞాన శాస్త్ర గ్రంథాలను తెలుగులోకి అనువదించిన తొలి తెలుగు రచయిత

ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం స్థాపించాడు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగంతోనే మొదలయింది. సమాజ సేవ కొరకు హితకారిణి అనే ధర్మ సంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికి ఇచ్చేసాడు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా ఐదేళ్ళు పని చేసాడు.

తాను నమ్మిన సత్యాన్ని, సిద్దాంతాన్ని తు.చ. తప్పక్కుండా పాటించిన వ్యక్తి ఆయన. యుగకర్త గా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది.

దసరా శుభాకాంక్షలు

తెలుగువారందరికీ దసరా శుభాకాంక్షలు

దుర్గాదేవిబతుకమ్మ

విజయదశమి (దసరా)

విజయదశమిదసరా ఒక ముఖ్యమైన హిందువుల పండుగ. ఆశ్వయుజ(అశ్వనీ నక్షత్రం పౌర్ణమి రోజున వస్తే అది ఆశ్వీయుజ మాసమౌతుంది.) శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు. ఈ నవరాత్రుల లో దుర్గమ్మ ని తొమ్మిది విధాలుగా అంటే బాలాత్రిపుర సుందరి, మహాలక్ష్మి, గాయత్రి, అన్నపూర్ణ, సరస్వతి, శ్రీలతా త్రిపురసుందరి, దుర్గ, మహిషాసురమర్థిని, రాజరాజేశ్వరిగా భావించి విభిన్నమైన అలంకారాలతో అర్చిస్తారు. పదవ రోజు విజయదశమి కలసి దసరా అంటారు. దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణా లో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. 

దేవీ నవరాత్రులు

దేవీ నవరాత్రుల ప్రాశస్త్యం ఏమిటి ? అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలలో ఎందుకు కొలుస్తారు. నవరాత్రుల వెనుక అసలు చరిత్ర ఏంటి ?

దేవీ నవరాత్రులుప్రతీ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీ నవరాత్రులు లేదా శరన్నవరాత్రులని అంటారు.  శరన్నవరాత్రులు అని ఎందుకన్నారంటే ఆశ్వీయుజ మాసం నుండి వర్ష ఋతువు వెళ్ళి, శరత్ ఋతువు ప్రారంభం అవుతుంది.  ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి. అందుకే ఈ అశ్వయుజ శుద్ధ పాడ్యమినుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా, శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాల దరిజేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుక  ఉన్న చరిత్ర. మార్కండేయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో బ్రహ్మ ఇలా వివరించాడట.

ప్రధమంశైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి
తృతీయం చంద్రఘంటేతి, కూష్మాంతేతి చతుర్ధామ్‌||
పంచమం స్కంధమాతేతి షష్ఠమం కాత్యాయనీ తిచ
సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం
నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||

ఏనుగు లక్ష్మణ కవి

ఏనుగు లక్ష్మన కవి గారు క్రీ.శ.18 వ శతాబ్దికి (1797)చెందిన వారు.

భాగ్యనగరం

భాగ్యనగరంఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగరం హైదరాబాద్‌. దీనిని భాగ్యనగరం అని కూడా పిలుస్తారు. క్రీస్తుశకం 1591లో మహ్మద్‌కులీకుతుబ్‌ షా దీనిని నిర్మించాడు. కుతుబ్‌ షాహీ వంశంలో ఆయన అయిదో రాజు. ఈ నగరానికి 400ఏళ్ల చరిత్ర ఉంది. నగర చరిత్రకు చార్మినార్‌, గొల్కొండ కట్టడాలు మకుటాయమానం. ప్రత్యేక రాజ్యంగా అనేక ఏళ్లు వర్థిల్లిన హైదరాబాద్‌ ఎట్టకేలకు 1948 సైనిక చర్య తర్వాత భారత్‌లో అంతర్భాగమైంది.

సాహిత్య విమర్శకుడుగా గురజాడ

Gurajada apparao‘కన్యాశుల్కం’ నాటకం ఇవాల్టికీ గురజాడ కళా సృష్టికి దర్పణంగా నిలుస్తోంది. ‘ముత్యాల సరాలు’ ఛందస్సులో ఆయన తెచ్చిన గొప్ప మార్పుకి ప్రతీకగా నిలుస్తోంది. ‘తెలుగు కవిత్వంలో నేను కొత్త, ఎక్స్పెరిమెంట్‌ ఆరంభించాను. నా ముత్యాల సరాల రీతిని మీరు గమనించినట్లయితే మీకే ఈ విషయం ధృవపడుతుంది... నా మొదటి గేయంలో సాధ్యమైనన్ని వాడుక మాటలను, గ్రాంధిక వ్యాకరణ సూత్రాలకు, లేదా ప్రాచీన కవుల పద్ధతులకు ఒదగని శబ్దాలను ప్రయోగించాను’ అని ఆయన ఒక లేఖలో రాశారు.

భిన్నపార్శ్వాల గురుజాడ

నేడు గురజాడ అప్పారావు గారి 150వ జయంతి

  జాతీయతాస్ఫూర్తి భారత దేశమంతటా వెల్లివిరుస్తున్న రోజుల్లో కలం పట్టిన యోధుడు గురజాడ. పాశ్చాత్య నాగరికత వ్యామోహంలో పడి భారత యువత కొట్టుమిట్టాడుతున్న సమయంలో వారికి భారతీయ సంస్కృతి, చరిత్ర, సాహిత్య వైభవాలను గుర్తుచేయడంతోపాటు పాశ్చాత్య లోకానికి భారతీయ ఔన్నత్యాన్ని తెలియజేయాల్సిన చారిత్రక అవసరాన్ని గుర్తించిన దీర్ఘదర్శి- గురజాడ.

వినాయక చవితి శుబాకాంక్షలు

వినాయకుడుతెలుగు వారందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు

అందరూ పర్యావరణానికి అనుకూలమైన మట్టి వినాయకుడినే పూజించమని మనవి

బండెనుక బండి కట్టి... పదహారు బండ్లు కట్టి

బండెనుక బండి కట్టి
పదహారు బండ్లు కట్టి
ఏ బండ్లె వస్తవ్ కొడుకో
నైజాము సర్కరోడా
నాజీల మించినవ్ రో
నైజాము సర్కరోడా

 

పోలీసు మిలిట్రి రెండు
బలవంతులనుకోని
నువ్వు పల్లెలు దోస్తివి కొడుకో
మా పల్లెలు దోస్తివి కొడుకో
నైజాము సర్కరోడా

 

తెలంగాణ విమోచనానికి 64 ఏళ్లు

భూమి కోసం... విముక్తి కోసం తెలంగాణా ప్రజలు సాగించిన పోరాటానికి ఫలితం దక్కిన రోజు. భూస్వాముల అరాచకత్వం... నిజాం నిరంకుశ పాలనను నిరసిస్తూ తెలంగాణా జనం ఏకమై కదం తొక్కారు. నాలుగున్నర వేల మంది ప్రాణాలు కోల్పోయినా మడమ తిప్పకుండా తెగువ చూపారు. రజాకారుల దుశ్చర్యలకు ఎదురొడ్డి సాగించిన ఆనాటి సాయుధ పోరాటానికి నిజాం నవాబు తలవంచక తప్పలేదు.
 

రావి నారాయణరెడ్డి

రావి నారాయణరెడ్డిరావి నారాయణరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాటంలో ముఖ్యుడు. 1908 జూన్ 4న జన్మించాడు. ఆంధ్ర మహాసభకు ఆధ్యక్షుడుగా పని చేశారు. తెలంగాణ విమోచన తరువాత ఆయన సిపిఐలో చాలాకాలం పని చేశారు. రావి నారాయణరెడ్డి విశాలాంధ్ర కోసం ఎంతో శ్రమించారు. నిజాం ప్రభుత్వం మీద ఆయన చేసిన సాయుధ పోరాటం చిరస్మరణీయం.

దామోదరం సంజీవయ్య

Damodaram Sanjivayyaదామోదరం సంజీవయ్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి మరియు తొలి దళిత ముఖ్యమంత్రి. సంయుక్త మద్రాసు రాష్ట్రములో, ఆంధ్ర రాష్ట్రములో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మరియు కేంద్ర ప్రభుత్వములో అనేక మార్లు మంత్రి పదవిని నిర్వహించాడు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు అవడము కూడా ఈయన ప్రత్యేకతల్లో ఒకటి. ఈయన కాంగ్రేసు పార్టీ తొలి దళిత అధ్యక్షుడు కూడా.

నేడు "కవి సామ్రాట్ " శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి జన్మదినం.

విశ్వనాథ సత్యనారాయణవిశ్వనాథ సత్యనారాయణ (1895-1976) "కవి సామ్రాట్" బిరుదాంకితుడు. తెలుగు సాహిత్యంలో తొలిజ్ఞానపీఠ అవార్డు గ్రహీత. 20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు.

కొండా వెంకటప్పయ్య

కొండా వెంకటప్పయ్యకొండా వెంకటప్పయ్య ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. ఆయన గాంధీజీ ఉపసేనానుల తొలి జట్టుకు చెందినవాడు.

శ్రీ పనప్పాకం ఆనందాచార్యులు

పనప్పాకం ఆనందాచార్యులుతొలితరం జాతీయ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఒకరు పనప్పాకం ఆనందాచార్యులు. అఖిల భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షులు. బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ సభకు హాజరైన 72 మంది ప్రతినిధుల్లో ఆనందాచార్యులు ఒకరు.  

పనప్పాకం ఆనందాచార్యులు, చిత్తూరు జిల్లాకు చెందిన కడమంచి గ్రామంలో 1843 సంవత్సరంలో జన్మించారు. వీరి తండ్రి శ్రీనివాసాచార్యులు. వీరు చిత్తూరు జిల్లా కోర్టులో ఉద్యోగం చేశారు. తండ్రి మరణానంతరం ఆతని మిత్రుడైన సి. వి. రంగనాథ శాస్త్రులు సహాయంలో 1863లో మెట్రిక్యులేషన్, తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో 1865లో ఎఫ్.ఎ పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు. తర్వాత పచ్చియప్పా పాఠశాలలో ఉపాధ్యాయునిగా 1969 వరకు పనిచేశారు. ప్రైవేటుగా చదివి 1869లో బి.ఎల్ పరీక్షలో ఉత్తీర్ణులై మద్రాసు హైకోర్టు న్యాయవాదులలో అగ్రగణ్యులైన కావలి వెంకటపతిరావు వద్ద అప్రెంటిస్ గా పనిచేశారు. 1870లో వకీలుగా అనుమతిని పొంది హైకోర్టు న్యాయవాదులలో అగ్రగణ్యులయ్యారు. మద్రాసులో న్యాయవాదుల కోసం ఒక అసోసియేషన్ స్థాపన చేయడంతో పాటు , న్యాయ విచారణ పద్దతులు, న్యాయవాదుల స్థితిగతుల మెరుగుదల కోసం  చక్కని గ్రంధాలు శ్రీ అనంతాచార్యులు రచించారు. వీరు 1889లో మమద్రాస్ అడ్వకేట్స్ అసోసియేషన్ స్థాపించారు.
 

శ్యామశాస్త్రి

శ్యామశాస్త్రిశ్యామశాస్త్రి, కర్నాటక సంగీతంలో ప్రముఖ వాగ్గేయకార త్రయంలో త్యాగరాజు , ముత్తుస్వామి దీక్షితుల సరసన నిలిచే తెలుగు పెద్దలలో శ్యామశాస్త్రి ప్రముఖులు. శ్యామశాస్త్రి వయస్సులో వారిద్దరికన్నా పెద్దవాడు. శ్యామశాస్త్రి తండ్రి విశ్వనాథ శాస్త్రి. ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని గిద్దలూరుకు సమీపంలోగల కంభం ప్రాంతీయులు. అయితే, 17వ శతాబ్దంలో తమిళనాడుకు వలస వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. శ్యామశాస్త్రి అసలు పేరు వేంకట సుబ్రహ్మణ్యము. అయితే, చిన్నతనంలో ముద్దుపేరుగా శ్యామకృష్ణ గా పిలుస్తూ, ఆ పేరే చివరకు వ్యవహరికంలో సార్ధకమైందని ఆయన శిష్యులు పేర్కొంటారు.

 తండ్రి విశ్వనాధ శాస్త్రి సంస్కృత, తెలుగు భాషలలొ పండితుడు కావడంతో- శ్యామశాస్త్రి చిన్నతనంలో తండ్రి దగ్గరే సంస్కృతాంధ్రభాషలు అభ్యసించాడు. సంగీతంలో తన మేనమామ దగ్గర స్వరపరిచయం కల్గినా, ఆ పిదప తంజావూరులో ‘సంగీత స్వామి’ అనబడే ప్రముఖ తెలుగు సంగీత విద్వాంసుని దగ్గర, తంజావూరులోని రాజాస్థానంలో సంగీత విద్వాంసుడైన శ్రీ పచ్చిమిరియము ఆది అప్పయ్య సహకారంతో సంగీత శాస్త్రాలలో మర్మములు ఎన్నో అధ్యయనం చేశాడు.

శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు

అన్నమాచార్యశ్రీ తాళ్ళపాక అన్నమాచార్య, కడప జిల్లాలోని  తాళ్ల్లఫాక గ్రామంలో మే 9, 1408 లో జన్మించాడు. పుట్టినప్పటినుండి, "తిరుమలప్పప్రసాదం" అని చెప్పందే ఉగ్గుకూడా త్రాగేవాడు కాదని ప్రతీతి. జోలపాటలలో వెంకటేశ్వరస్వామిపై పాడుతుంతేనే నిదురించెవాడట. చిన్ననాటినుండి ఆడిన మాటలెల్ల అమృత కావ్యంగా , పాడినపాటలెల్ల పరమగానాం "అన్నమయ్య కవితలు అల్లేవాడు.

శతక సాహిత్యం

శతకము అనగా వంద పద్యాలతో రచించే ఒక సాహితీ ప్రక్రియ. శతక సాహితీ ప్రక్రియలో ఒకటే మకుటము గల పద్యాలు కనీసం వంద వ్రాస్తారు. భర్తృహరి వ్రాసిన సుభాషిత త్రిశతి సంస్కృతములో ప్రసిద్ధి చెందినది.

నా కవితావాణీ – ౩

నా కనులతో నీవు లేని కలను కనని నేను
నీవు లేని కలను కలనే భావించని నాకు
ఇక నీ చూపే ఒక కలను చేసి వెళితే
నీ రూపాన్ని మరవకుండా ఉండటానికి
నేను ఇక శాశ్వత నిద్ర లోనే ఉంటాను నా చిరకాల స్వప్నమా!!!!!

నా కవితావాణీ – ౨

నీవు లేక చీకటి అయినది నా జీవితం కానీ
నీ రాక తో వెలుగు నింపు తావని ఎదురు చూస్తున్న నాకు
ఇక ఆ చేకటి నే చెలిమిని చేసి
నన్ను ఆ నిశీధి లోనే ఉంచి నాకు ఉషోదయం లేకుండా చేయకే సఖి !!!!!!!

నా కవితావాణీ – ౧

చిరుగాలి చిన్నదైన పొందే అనుభూతి గొప్పది
అలాగే నువ్వు చూసే చిరు చూపైన నేను పొందే అనుభూతి అనిర్వచనీయమయినది
నిన్ను చూస్తూ ఉన్న ప్రతి క్షణం నీ ప్రతిబింబాన్ని నా కళ్ళలో దాచుకుంటాను
కానీ నువ్వు కనుమరుగయ్యాక ఆ ప్రతిబింబం నీరుగా మారి నా చెక్కిలి ని తాకుతానంటుంది
అలా చేస్తే ఎక్కడ నీ రూపాన్ని నా కనులు మరుస్తాయోనని
వాటిని అక్కడే దాచి ఉంచి ఆ బాధను అనుభవిస్తున్నాను చెలి ………

ఉపాధ్యాయ దినోత్సవం .. నేడు డా. సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి

సర్వేపల్లి రాదాకృష్ణమన దేశ తొలి ఉపాధ్యక్షుడు, రెండవ అధ్యక్షుడు అయిన సర్వేపల్లి రాధాకృష్ణ సెప్టెంబర్‌ 5న జన్మించారు. ఆయన జన్మించిన రోజును దేశవాసులు ‘టీచర్స్‌ డే’గా జరుపుకుంటున్నారు. 1962 నుంచి 1967 వరకు దేశ అధ్యక్షుడిగా పనిచేశారు రాధాకృష్ణ. ఆ సమయంలో కొందరు విద్యార్థులు, స్నేహితులు రాధాకృష్ణన్‌ను కలిసి ఆయన జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటామని పేర్కొన్నారు.

చింతామణి నాటకం

చింతామణి నాటకం, తెలుగు నాట ప్రసిద్ధి చెందిన నాటకం. 20వ దశాబ్దంలోని మూడవ దశకంలోని సామాజిక సమస్యల ఆధారంగా అప్పటి కవి కాళ్లకూరి నారాయణరావు రచించిన చింతామణి నాటకం ఊరూరా నేటికీ ప్రదర్శితమవుతూనే ఉంది.

ఇందులో ప్రధాన పాత్రలు చింతామణి, బిల్వమంగళుడు, సుబ్బిశెట్టి, భవానీ శంకరం, శ్రీహరి.

తెలుగు సూర్యుడు సి.పి.బ్రౌన్

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్1825 ప్రాంతాల్లో దాదాపు అంధకారం కప్పివేయబడివున్న తెలుగుకు వెలుగులు నింపి, నేటి వైభవానికి కారణబూతమైనవాడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే ప్రచురించాడు. బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ప్రముఖ బ్రిటిషు అధికారులలో బ్రౌన్ ఒకడు.

‘ఆడసింహం’ దుర్గాబాయి దేశ్‌ముఖ్

ఉప్పు సత్యాగ్రహంలో ఆమె పోలీసుల లాటిచార్జి లో తీవ్రంగా గాయపడ్డారు, రక్తం కారుతున్నా ఉప్పు జారవిడవలేదు. అందుకే అప్పటి బ్రిటీష్ అధికారులు ఆమెను ఆడసింహం గా అభివర్ణించారు.

దుర్గాబాయి దేశ్‌ముఖ్ (జూలై 15, 1909 – మే 9, 1981) పేరు పొందిన తెలుగు స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త మరియు రచయిత్రి. చెన్నై, హైదరాబాదులలో ఉన్న ఆంధ్ర మహిళా సభలను ఈవిడే స్థాపించారు.

అన్నగారు, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ “ఎన్.టి.ఆర్”

ఎన్‌ టి‌ ఆర్మదరాసులో ఆయన వుండగా తిరుపతి వెళ్ళిన తెలుగు యాత్రీకులు ఒక మొక్కుబడిగా మదరాసు వెళ్ళి ఉదయమే ఆయనను దర్శించుకుని వచ్చేవారు.

తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు నందమూరి తారక రామారావు. తెలుగుజాతికీ, తెలుగుభాషకూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. హైదరాబాదు లోని హుస్సేన్‌సాగర్ కట్టపై ( ట్యాంకుబండ్) సుప్రసిద్ధులైన తెలుగువారి విగ్రహాలు నెలకొల్పాడు.

“నక్సలైట్లు కూడా దేశభక్తులే బ్రదర్” అంటూ నినదించి, సైనిక దుస్తులు వేసుకుని, తెలుగువారి కీర్తి ప్రతిష్ఠలు ఢిల్లీవరకూ తీసుకెళ్ళాలని ఎన్నికల ప్రచారంలోకి దిగిన ఎన్.టి.రామారావు రాజకీయ చరిత్ర సృష్టించారు.
 

“షహెన్షా” సి.కె.నాయుడు

సి కె నాయుడుబౌలర్ గా తన ఫస్ట్ క్లాసు కెరీర్ ని మొదలు పెట్టి, బారీ సిక్సర్లతో, సి.కె.నాయుడు అంటే సిక్సర్ల నాయుడు అనిపించుకున్న స్పోర్ట్స్ హీరో ఆయన.

ఏ దేశమేగినా ఎందు కాలెడినా

ఈ జాతీయగీతాన్ని రాయప్రోలు సుబ్బా రావు గారు రచించారు. రాయప్రోలు సుబ్బారావు రాసిన గీతాలలో అందరినోళ్లలోనూ బాగా నానిన “జన్మభూమి” గీతంలో తెలుగుదనం, జాతీయాభిమానం, గత వైభవ సంకీర్తనం, ప్రబోధం లాంటివి తొణికిసలాడుతుంటాయి. ఇప్పటికీ ఈ గీతం ఉత్తమ దేశభక్తి ప్రబోధంగా నిలిచిందనడంలో అతిశయోక్తి లేదు…

రాయప్రోలు గొప్ప జాతీయవాది. తెలుగు జాతి అభిమాని. ఆయన దేశభక్తి గేయాలు ఎంతో ఉత్తేజకరంగా ఉంటాయి.

తమ్ముడా!

రాయప్రోలు సుబ్బారావు గారి కలం నుండి జాలువారిన దేశభక్తి గీతం,

శ్రీలు పొంగిన జీవగడ్డయు,
పాలు పారిన భాగ్యసీమయి,
వ్రాలినది ఈ భరతఖండము
భక్తి పాడర తమ్ముడా!

వేద శాఖలు పెరిగె నిచ్చట,
ఆదికావ్యం బందెనిచ్చట,
బాదరాయణ పరమ ఋషులకు
పాదు సుమ్మిది చెల్లెలా!

విపినబంధుర వృక్ఖవాటికన
వుపనిషన్మధు నొలికెనిచ్చట
విపులతత్వము విస్తరించిన
విమలతలమిదె తమ్ముడా!

ఛాందస భావాలకు బావాలకు తొలి అడ్డుకట్ట “వేమన”

వేమన“విశ్వదాభిరామ వినురవేమ” అనే మాట వినని తెలుగు వాడు ఉండడు. వానకు తడవనివారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి.  పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజల్ని మెప్పించిన కవి, వేమన .

గురజాడ అప్పారావు గారి రచన ‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’

బాల్యవివాహపు ఉక్కుకోరల్లో చిక్కుకొని బలైపోయిన ఒక అమాయక బాలిక దీనగాథ, పాషాణ కఠిన కర్కశ హృదయన్నైనా కరగించి పారేస్తుంది. ఇందులోని ఛందస్సు కూడ క్రొత్తదే. ఈ గేయనాటిక ఒక చక్కని నృత్య గేయనాటికగా ఆంధ్రదేశంలో ఎంతో పేరు గడించింది. గురజాడ సృష్టించిన “పుత్తడి బొమ్మ పూర్ణమ్మ” అనే గేయ నాటకం ఇప్పటికీ తెలుగు వారి కంట తడి పెట్టిస్తూనే ఉంది.

        మేలిమి బంగరు మెలతల్లారా !
        కలువల కన్నుల కన్నెల్లారా !
        తల్లులగన్నా పిల్లల్లారా !

                    విన్నారమ్మా యీ కథను ?

గురజాడ అప్పారావు గారి రచన “దేశమును ప్రేమించుమన్నా”

గురజాడ అప్పారావు గారు 1910 సంవత్సరంలో రచించిన ఈ గేయం ప్రజల్లో దేశ భక్తిని ప్రబోధించి, దేశాభివృధ్ధికై ప్రజలను ఎంతగానో ఉత్తేజపరిచింది.

దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్‌
గట్టి మేల్‌ తలపెట్టవోయ్‌

పాడి పంటలు పొంగిపొరలే
దారిలో నువు పాటు పడవోయ్‌
తిండి కలిగితే కండ కలదోయ్‌
కండ కలవాడేను మనిషోయ్‌

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన: “జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి!”

తెలుగు భావ కవితా రంగంలో కృష్ణశాస్త్రి ఒక ప్రముఖ అధ్యాయం. దేశాన్ని మాతగా కీర్తిస్తూ, లయాన్వితింగా సాగిపోయే ఈ గేయం అప్పుడూ ఇప్పుడూ ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగిస్తోంది
ప్రకృతి ప్రేమలోనూ, దేశప్రేమలోనూ ఆయన భావుకత్వం ఎంత స్వేచ్ఛగా, హృదయంగమంగా పరవళ్లు తొక్కేదో చూడాలంటే ఆయన రాసిన దేశభక్తి గీతం తప్పక వినాలి

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి!
జయ జయ జయ శతసహస్ర నరనారీ హృదయనేత్రి  //జయ జయ//

శ్రీశ్రీ కలం నుండి జాలువారిన గొప్ప దేశభక్తి గీతం “పాడవోయి భారతీయుడా”

స్వాతంత్ర్యం సంపాదించుకున్న మనం దాని విలువను గుర్తించగలిగామా! ఆ వీరుల త్యాగఫలాన్ని కున్న విలువ ఏమిటి? ఒకరినొకరం గౌరవించుకోలేని దుస్థితిలో ఉన్నాం. విపరీతమైన ఈర్ష్యా, ద్వేషాలు పెరిగిపోయినాయి. శ్రీ శ్రీ వ్రాసిన ఈ పాడవోయి భారతీయుడా–ప్రభోధగీతం మనం తప్పని సరిగా వినాలి

మొదటి ఆధునిక తెలుగు కావ్యం: “ముసలమ్మ మరణం”

డా.కట్టమంచి రామలింగారెడ్డి రచించిన “ముసలమ్మ మరణం”. తెలుగు సాహిత్యంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించిన కావ్యం. ఇది “ముసలమ్మ” అనబడే ఒక గ్రామవనిత యొక్క త్యాగమయ, దయనీయ గాథ.కథకు మూలం చార్లెస్ పి. బ్రౌన్ రచించిన The History of Anantapuram (అనంతపుర చరితం). 1899లో ఆంధ్ర భాషాభిరంజిని వారి పోటీలో బహుమతి గెల్చుకొంది. 1900లో అచ్చయ్యింది.

107 గద్య పద్యాలున్న చంపూ కావ్యం ‘ముసలమ్మ మరణం’ కథ. 17వ పద్యంతో కథ మొదలవుతుంది. 104వ పద్యానికి కథ ముగిసిపోతుంది.

తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

ఈ పాటను డా. సి. నారాయణ రెడ్డి గారు “తల్లా! పెళ్లామా!” చిత్రం కోసం వ్రాసారు.

తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ నాది … రాయలసీమ నాది … సర్కారు నాది … నెల్లూరు నాది ..
అన్నీ కలిసిన తెలుగునాడు … మనదే … మనదే … మనదేరా..
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

జాషువా

గుఱ్ఱం జాషువాఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుఱ్ఱం జాషువా. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించి, ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు.అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు.

ఈనాడు సంఘసంస్కర్తలకు జాషువా ఆదర్శ పురుషుడు. తెలుగు ప్రజల కవి. భాషా చంధస్సులో భావ కవి. వడగాల్పు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వం అని ఆయన చెప్పారు. నిత్య జీవితంలో కాని సాహితీ జీవితంలో గాని ఎన్ని కష్టాలు ఎదురైన ధీరత్వంలో నిబ్బరంగా ఎదుర్కోవడం ఆయన విజయ సంకేతం.

దాశరథి కృష్ణమాచార్యులు

దాశరథి కృష్ణమాచార్యతెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’గా మలిచి నిజాం పాలన మీదికి  ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు, “దాశరధి”గా ప్రసిద్ధుడు.  పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికీ ప్రేరణనందిస్తున్న కవి దాశరథి. నిజాం ప్రభువుకి వ్యతిరేకంగా గొంతెత్తి…

ఓ నిజాము పిశాచమా కానరాడు
నిన్నుబోలినరాజు మాకెన్నడేని
తీగెలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రత్నాలవీణ అని ఎలుగెత్తి సభలలో వినిపించాడు.

వ్యాసరచన పోటీలో గెలుపొందిన విజేతల వివరములు

తెలుగుబాష యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఒక వ్యాసము వ్రాసి పంపమని చేసిన మా విజ్ఞప్తికి స్పందించి, రాష్ట్ర వ్యాప్తంగా 70 పాఠశాలల నుండి 475 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు.

పాఠశాల యాజమాన్యానికి మా కృతజ్ఞతలు

గోడకేసిన సున్నం

మనం ఏదో ఆశించి వెచ్చించేవాటిలో కొన్నిసార్లు ఆ వెచ్చించిన ధనం ఇక ఏపరిస్థితులలోనూ వెనక్కిరాదనుకున్నప్పుడు ఉపయోగంచే జాతీయమిది. తిరిగిరాని పెట్టుబడిని గోడకు వేసినసున్నం అంటుంటారు. శుభ కార్యాల్లాంటి సందర్భాలలో ఇళ్ళ గోడలకు వెల్లవేస్తుంటారు.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

గొర్రెలకు తోడేలు కాపరి అన్నట్టు

సంరక్షణ బాధ్యతలను అమాయకంగా నమ్మి మోసగాళ్లు, శత్రువులకు అప్పగించిన సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. గొర్రె తోడేలుకు ఆహారం. అలాంటిది ఆ తోడేలును గొర్రెలకు కాపలాగా ఉంచితే ఏం జరుగుతుందో ఎవరైనా వూహించవచ్చు, ఈ వూహ ఆధారంగానే ఈ జాతీయం ఆవిర్భవించింది.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

గంధద్రవ్యాలు మోసినా గాడిద గాడిదేనన్నట్టు

కొంతమంది ఎన్ని మంచి మాటలు చెప్పినా మరెంతమంది సత్పురుషులు వారి చుట్టూనే ఉన్నా వారి మనస్సు మాత్రం మారదు. దుర్మార్గం వైపే వారి అడుగులు పడుతూ ఉంటాయి. అలాంటి వారిని గురించి తెలియచెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.

రాగంలేని భోగం, త్యాగం లేని మనస్సు

జీవిత సత్యాన్ని తెలియచెప్పే జాతీయం ఇది. ఎంతగా భోగాలను అనుభవిస్తున్నా అలా అనుభవించింటేప్పుడు బంధుమిత్రుల అనురాగం ఉంటేనే ఆ భోగానుభవంలో ఆనందం ఉంటుంది. కానప్పుడు ఎన్ని భోగాలున్నా, ఎదురుగా ఇంకేమున్నా ఆనందమే ఉండదు.

అబ్బడి నెత్తి దిబ్బడు కొడితే..

అబ్బడి నెత్తి దిబ్బడు కొడితే దిబ్బడి నెత్తి సుబ్బడు కొట్టాడన్నది జాతీయం. తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అనే దానికి సమానార్థకమిది.

ఎంత కరవొచ్చినా పులి గడ్డి మేయదన్నట్టు

పులి క్రూరజంతువే అయినా రాజసం, నీతినిజాయతీల లాంటివాటికి ప్రతీకగా చెప్పుకోవటం అలవాటుగా వస్తోంది. ఆయన పులి లాంటివాడు అనంటే క్రూరస్వభావం కన్నా గాంభీర్యం ఎక్కువగా ఉన్నవాడు అనే అర్థమే స్ఫురిస్తుంది.

కోడిగుడ్డును కొట్టేందుకు గుండ్రాయి కావాలా అన్నట్టు

అల్పులను శిక్షించేందుకు అధికమైన బలం అక్కరలేదని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. వాటం చూసి గట్టిగా వేలితో కొట్టినా కోడిగుడ్డు పగులుతుంది. అలాంటి దానికి గుండ్రాయి అనవసరం.

ఏనుగునెక్కి కుక్క అరుపులకు దడిచినట్టు

ఏనుగును ఉత్తమ జంతువుగా, కుక్కను నీచ జంతువుగా చెబుతారు. అలాగే ఏనుగునెక్కటం అంటే కీర్తిని పొందటంతో సమానంగా కూడా చెబుతారు. ఏనుగు వీధిలో వెళుతుంటే కుక్కలు మొరుగుతాయి అని ఓ సామెత ఉంది. అంటే ఉత్తములు ఏదైనా పని చేస్తున్నప్పుడు నీచులు వంకలు పెడుతుంటారన్నది దీని అర్థం.

ఎంత పండినా కూటిలోకే...

ఎంత పండినా కూటిలోకే, ఎంత ఉండినా కాటిలోకే అన్నట్టు అన్నది జాతీయం. కొన్ని జీవన సత్యాలు ఇలా జాతీయాలుగా అవతరించాయి. వైరాగ్య సంబంధమైన భావనలను ప్రకటించేటప్పుడు ఇలాంటి జాతీయాలను వాడుతుంటారు. పంట ఎంత గొప్పగా పండినా, ఎంత ఎక్కువగా పండినా దాన్ని అలా కలకాలం నిల్వ ఉంచరు.

పిండీ, బెల్లమూ ఇచ్చి పిన్నమ్మా నీ ప్రసాదం అన్నట్టు

సొమ్మంతా ఒకరి చేతికిచ్చి కొద్దిపాటి ఖర్చులకు కూడా వారిని అడగాల్సిన దుస్థితిలో ఉంటుంటారు కొందరు. ఇది తెలివితక్కువ వ్యవహారం. సొమ్మంతా ఇతరులకు ఇచ్చి కావలసినది యాచించటమంటే బుద్ధిలేనితనంకిందే లెక్క.

పూరిగుడిసెకు పందిరి మంచమా అన్నట్టు

స్థాయిని మరచి వ్యవహరించటం, ఆర్థిక స్థోమతకు మించి ఆలోచించటం అనే అర్థాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పెద్దపెద్ద భవనాలు, భవంతులలో ప్రత్యేకంగా గదులుండటం, వాటిలో అందంగా పందిరి మంచాలుండటం బాగా ఉంటుంది.

అగ్గిపక్కన వెన్న.. ఆడవారి కోపం ఒకటేనన్నట్టు

మానవ స్వభావాల విశ్లేషణను కూడా మన జాతీయాలు తమలో పొందుపరచుకొని ముందు తరాలకు అందిస్తుంటాయనటానికి ఈ జాతీయం ఒక ఉదాహరణ. సృష్టిలో సున్నితమైన మనస్తత్వంగల స్త్రీ మానవీయతను ప్రకటిస్తుంది. పురుషుడికి కోపం వస్తే ప్రతీకారం తీర్చుకొనేదాకా వూరుకోడు. కానీ స్త్రీ అలాకాదు.

ఏకుతో తాకితే మేకుతో మొట్టినట్టు

చాలా అల్పమైన అపకారానికి భయంకరమైన శిక్షను విధించటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఏకుతో ఎదుటి వ్యక్తిని తాకటమంటే ఎదుటి వ్యక్తికి శారీరకంగా ఏమాత్రం బాధను కలిగించే విషయం కాదు. కానీ చాలా అల్పమైన ఆ పనికి మేకుతో మొట్టాడట ఎదుటి వ్యక్తి.

కోకలు వెయ్యి ఉన్నా కట్టుకొనేది ఒకటే

కొంతమంది తామెంతో భాగ్యవంతులమని విర్రవీగుతుంటారు. అలాంటివారి గర్వాన్ని నిరసిస్తూ చెప్పే జాతీయం ఇది. జాతీయాలు వాస్తవ పరిస్థితులను ఉదాహరణలుగా చూపి సంఘటనలను సందర్భాలను సమీక్షిస్తూ విమర్శిస్తుంటాయనటానికి ఇదొక ఉదాహరణ. పెట్టెనిండా కోకలున్నాయని ఒకామె తెగ గర్వపడసాగిందట.

ఇంటివాణ్ణి లేపి దొంగ చేతికి కట్టె ఇచ్చినట్టు

నమ్మించి మోసం చేయటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఓ వ్యక్తి రాత్రి వేళ ఎదురింటిలోకి దొంగ వెళ్ళడం చూశాడట.

కూడు వండటం గంజికోసమన్నట్టు

గంజి తాగటమనేది పేదరికానికి సూచికగా చెబుతారు. కొంతమంది తమకు అన్ని వనరులూ కావలసినంతగా ఉన్నా వాటిని అనుభవించలేక వృథా చేసుకొంటూ లేనివారిలాగానే ఉంటుంటారు. అదెలాగంటే అంతకు ముందుదాకా ఎప్పుడూ గంజి మాత్రమే దొరికేవారికి బియ్యం సరిపోయినంతగా లభించాయట.

అల్లుడికి బెట్టు ఇల్లాలికి గుట్టు

మన సంస్కృతీ సంప్రదాయాలలోని కొన్ని కొన్ని అంశాలను జాతీయాలు ప్రతిబింబిస్తుంటాయి. అటువంటి వాటిలో ఇదొక జాతీయం. అల్లుడు బెట్టుగా వ్యవహరిస్తుండాలని, ఇల్లాలు ఇంటిలో ఉన్న లొసుగులు బయటపడకుండా గుట్టుగా వ్యవహరిస్తుండాలని తెలియ చెబుతున్నట్లుంటుంది ఈ జాతీయం.

కోడికి గజ్జెలు కడితే...

కోడికి గజ్జెలు కడితే కుప్ప కుళ్లగించదా అన్నది జాతీయం. కసువు కుప్పలను కుళ్లగించి పొట్టపోసుకోవటం కోడి జీవలక్షణం. ఒకాయన ఓ కోడిని ఎంతో ముద్దుగా పెంచుకుంటున్నాడట. అలా తన పెంపుడుకోడి కసువు కుప్పలను కుళ్లగించటం ఆయనకు బాగాలేదనిపించింది.

అండ ఉంటే కొండనైనా బద్దలు కొట్టవచ్చు

మనిషి సంఘజీవి. తోటిమనిషి సహాయ సహకారాలు అతడికి ఎప్పుడూ అవసరమవుతాయి. ఒంటరిగా కన్నా మరొకరి తోడుతో తన పనులను చక్కపెట్టగలడు. ఈ భావన ఆధారంగా ఈ జాతీయం అవతరించింది. అండ అంటే ఆదుకొనేవారని అర్ధముంది.

ఎలుగు సలుగెరిగిన పని

బాగా నైపుణ్యం ఉన్న పనివాళ్లు చేసే పని అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఇది వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వారి మధ్య ఎక్కువగా కనిపిస్తుంటుంది.పొలం దున్నటానికి నాగలిని ఉపయోగిస్తుంటారు. ఆ నాగలికి దుంపను అమర్చటంలోనే అసలైన పనితనమంతా ఇమిడిఉంది.

ఈ జొన్న కూటికా ఈ స్తోత్ర పాఠమన్నట్టు

కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కని సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. జొన్న అన్నం కన్నా వరి అన్నం గొప్ప అని భావించే రోజుల్లో ఇది ఆవిర్భవించింది. ఒక వ్యక్తి ఒక సంపన్నుడి దగ్గరకు వెళ్లి స్తోత్రం చేశాడట (పొగిడాడట).

నీరులేని పైరు నూనె లేని జట్టు

కొన్ని జాతీయాలు ఆరోగ్య సూత్రాలను నేర్పేవిగా కూడా ఉంటాయి. అలాంటి వాటిలో ఇదొకటి. పైరు చక్కగా ఏపుగా పెరిగి పంట పండాలంటే నీరు బాగా ఉండాలి. అలాగే మనిషికి అలంకారంగా ఉండే నెత్తిమీది జుట్టు ఆరోగ్యంగా అందంగా ఉండాలంటే దానికి నూనె రాస్తుండాలి.

ఆ ఇంటికి తలుపు లేదు

ఆ ఇంటికి తలుపు లేదు ఈ ఇంటికి గడియ లేదు అన్నట్టు అన్నది జాతీయం. అంటే ఒకదానికంటే మరొకటి మరీ నాసి రకమైనది అనే అర్థంలో ఈ జాతీయం వాడుతుంటారు. సాధారణంగా ఇంటికి తలుపు రక్షణ కల్పిస్తుంది. అలాంటిది ఓ ఇంటికి ఉన్న తలుపులకు గడియలేదట.

కాలరాయటం

అణిచివేయటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. కాలితో తన్నటం అన్నా, కాలును ఉపయోగించి ఏదైనా వస్తువును దూరంగా విసిరేయటం అన్నా అవమానం, అసహ్యం లాంటి వాటికి ప్రతీకలుగా కనిపిస్తాయి. అంటే తనకు గిట్టని వాటిని అవమానించేందుకు మనిషి కాలును ఉపయోగిస్తుంటాడు.

అప్పు తీసుకుంటే చెప్పు చేతలలో ఉండాలి

పూర్వకాలం నాటి పెద్దలు అనవసరంగా అప్పులు చేయవద్దని పిల్లలను హెచ్చరించే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. అప్పు నిప్పు అని కూడా అంటుంటారు. అప్పుంటే ముప్పు అని చెబుతుంటారు.

మెరుపు దీపమవుతుందా అన్నట్టు

తాత్కాలికమైనవి ఏవీ శాశ్వతమైన ఆనందాన్ని లేదా ప్రయోజనాలను చేకూర్చలేవని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ఆకాశంలో క్షణకాలంపాటు మెరిసే మెరుపులు కాసేపు మంచి కాంతినే ఇస్తాయి. ఇంకా చెప్పాలంటే మామూలు దీపాలకన్నా ఎక్కువ కాంతినే ఇస్తాయి.

వేసిన వత్తికి పోసిన చమురుకు సరిపోయిందన్నట్టు

ఆదాయ వ్యయాలు సరిచూసుకొనే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. అలాగే పడిన శ్రమకు దక్కిన ఫలితానికి సరిపోయిందని చెప్పే సందర్భాలలో కూడా ఈ జాతీయ ప్రయోగం వాడకంలో ఉంది.

గుడిసెకు చాందినీ అన్నట్టు

అసంబద్ధమైన వ్యవహారం, అనవసరమైన అలంకారం అనే అర్థాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. చాందినీలను గొప్పగొప్ప అలంకారాలకు గుర్తుగా చెబుతారు. అలాంటి ఎంతో సుందరమైన చాందినీ చక్కటి భవనం ముందుంటే ఆ భవనపు అందం ఇనుమడిస్తుంది. ఆ చాందినీ వేసినందుకు సార్థకత చేకూరుతుంది.

గురువుకు తిరుమంత్రం చెప్పినట్లు

కొంతమంది అన్ని విషయాలలోనూ తామే గొప్ప అని భావించుకొంటుంటారు. అలాంటివారు తమకంటే గొప్పవారి దగ్గర అల్పమైన తమ గొప్పతనాలను ప్రకటించుకొంటున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంటుంది. మంత్రజపం, సాధన చేయటంలో గురువు ఎప్పుడూ ముందడుగులోనే ఉంటాడు.

తేనె పోసి పెంచినా వేపకు చేదుపోనట్టు

ఎంతగా నీతులు బోధించినా మనసు మారని దుర్మార్గులను గురించి తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. వేపకు చేదు సహజ లక్షణం. నీళ్లకు బదులు తేనె పోసి ఆ చెట్టును పెంచినా చేదు పోయే అవకాశం లేదు.

అన్నవస్త్రాలకు పోతే ఉన్న వస్త్రం వూడిపోయినట్టు

మేలు జరుగుతుందని ఆశపడినప్పుడు అనుకున్న మేలు జరగకపోగా మరికొంత కీడు వచ్చిపడ్డ సందర్భాలలో ఈ జాతీయప్రయోగం కనిపిస్తుంది. ఓ వ్యక్తి దరిద్రంతో బాధపడుతూ తనకు కావలసిన అన్నం, వస్త్రాలు ఎవరో దానం చేస్తానంటే వెళ్ళాడట.

ధనమొస్తే దాచుకోవాలి.. రోగం వస్తే చెప్పుకోవాలి

సమాజంలో మనిషి ఎప్పుడు ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని తెలియచెప్పేందుకు ఈ జాతీయం ఉపకరిస్తుంది. ధనం ఉంది కదాని ముందూ వెనుకా చూసుకోకుండా ఖర్చుపెట్టకూడదు... దాచుకోవాలి. అలాగే రోగం వస్తే వైద్యుడికి చూపించుకోకుండా చెప్పకుండా ఉండకూడదు.

ఆరు రాజ్యాలు జయించవచ్చును కానీ...

ఆరు రాజ్యాలు జయించవచ్చును కానీ అల్లుణ్ణి జయించలేమన్నది జాతీయం. వివాహ వ్యవస్థలో బాగా బెట్టుచేస్తూ గర్వాహంకారాలను ప్రదర్శిస్తూ ఉండే అల్లుళ్లతో విసిగి వేసారిన వారు మాట్లాడుకునే సందర్భాలలో ఈ జాతీయం వినిపిస్తుంది.

కసవులో పనసకాయ తరగినట్టు

చెడు పనులకు, దుర్మార్గాలకు అవకాశం ఇవ్వటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పనసకాయ తరిగేటప్పుడు దానికుండే సహజమైన జిగటవల్ల చుట్టూ ఉన్నవి అతుక్కోవటానికి అవకాశం ఉంది. తినటానికి ఉపయోగించే ఆ పనస కాయను పరిశుభ్రమైన ప్రదేశంలో తరగటం మేలు.

వూగే పంటి కింద రాయి పడ్డట్టు

అసలే కష్టాలలో ఉన్నప్పుడు దానికి తోడు మరిన్ని కష్టాలు వచ్చిపడి భరించలేని స్థితి ఎదురైన సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. వూగుతూ ఉన్న పన్ను బాధను కలిగిస్తూ ఉంటుంది.

అతిచేస్తే మతి చెడుతుందన్నట్టు

ఏ పనైనా ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. హద్దులను పాటించాలి. అలా కాకపోతే అన్నీ అనర్థాలేనని హెచ్చరించే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది. సంస్కృతంలో కూడా అతి సర్వత్రా వర్జయేత్‌ అనే సూక్తి ఉంది.

సంగీతానికి గాడిద, హాస్యానికి కోతి అన్నట్టు

సరసాలు ఆడేటప్పుడు, చమత్కారాలు మాట్లాడేటప్పుడు, వరసైన వారిని గురించి హాస్యంగా మాట్లాడేటప్పుడు ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. వినటానికి ఇంపుగాలేని గొంతును గాడిద గొంతుతో పోల్చిచెప్పటం, అంధవిహీనతను కోతిరూపంతో పోల్చిచెప్పటం ఓ అలవాటుగా వస్తోంది.

ఉన్నమ్మ గాదె తీసేసరికి లేనమ్మ ప్రాణం పోయిందనట్టు

కొంతమంది దాతలు ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వకుండా అర్థులను తమ చుట్టూ విపరీతంగా తిప్పుకొంటుంటారు. అలా తిరగలేక కొంతమంది విసిగి వేసారిన సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. పూర్వం వడ్లను గాదెల్లో భద్రపరిచేవారు.

వెతకబోయిన తీర్థం ఎదురైనట్టు

'వెతకబోయిన తీగ కాలికే తగిలినట్టు' అనేది దీనికి సమానార్థకమైన సామెత. పరిస్థితులు సంపూర్ణంగా అనుకూలించడం, కాలం కలసిరావడం అనేలాంటి అర్థాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

ఆపద మొక్కులు, సంపద మరపులు అన్నట్టు

మనుషుల మనస్తత్వాలను, ప్రవర్తనల తీరును విశ్లేషిస్తుంటాయి జాతీయాలు. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. ఆపదలొచ్చినప్పుడు ఆదుకోమని వేడుకొంటుంటారు చాలా మంది. దయతలచి ఎవరైనా ఆదుకుంటే ఆ కష్టాల నుంచి బయటపడి ఆనందాన్ని అనుభవిస్తూ మేలు చేసిన వారిని మరచిపోయేవారు చాలామంది ఉంటారు.

గొర్రెలకు తోడేలు కాపరి అన్నట్టు

సంరక్షణ బాధ్యతలను అమాయకంగా నమ్మి మోసగాళ్లు, శత్రువులకు అప్పగించిన సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. గొర్రె తోడేలుకు ఆహారం. అలాంటిది ఆ తోడేలును గొర్రెలకు కాపలాగా ఉంచితే ఏం జరుగుతుందో ఎవరైనా వూహించవచ్చు, ఈ వూహ ఆధారంగానే ఈ జాతీయం ఆవిర్భవించింది.

కదిపితే కందిరీగల తుట్టె

ఒక కందిరీగ శబ్దం చేస్తూ చుట్టూ తిరిగినా, లేదూ కుట్టినా భరించటం కష్టం. అలాంటిది కందిరీగల తుట్టెను కదిపితే అన్ని కందిరీగలు మీదపడి కుడితే ఎలా ఉంటుందో వూహించవచ్చు. కందిరీగల తుట్టెను కదపనంతవరకూ ఎలాగో ఒకలాగా ఆ ప్రదేశం నుంచి తప్పించుకుపోవచ్చు. కదిపామంటే పెనుప్రమాదమే.

అందని పూలు దేవుడికి అర్పణం అన్నట్టు

కొంతమంది స్వార్థపరులు, అవకాశవాదుల మనస్తత్వాన్ని వివరించే జాతీయం ఇది. అందని ద్రాక్షపండ్లు పుల్లన అనే లాంటిదే ఇది. తనకు దక్కనిది మంచిది కాదన్నది అందని ద్రాక్షపండ్లు పుల్లన అనే జాతీయంలో కనిపించే భావం.

అన్నం అడిగిన వాడికి సున్నం పెట్టినట్లు

సమాజంలో నిరంతరం ద్రోహచింతనతో ఉండేవారిని గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ఉపకారం చేయమని అడగటానికి వెళ్ళిన వ్యక్తికి ఉపకారం చేయకపోగా చేస్తున్నట్లు నటించి అపకారం చేసి అవమానిస్తుంటారు కొందరు.

ఆదివారం అందలం ఎక్కనూ లేదు...

'ఆదివారం అందలం ఎక్కనూ లేదు, సోమవారం జోలె కట్టనూ లేదు' అన్నది జాతీయం. సంపదలున్నప్పుడు ముందూ వెనుకా చూడకుండా భోగాలను అనుభవిస్తుంటారు కొంతమంది. ఆ సంపదలు కరిగిపోయాక దుర్భరంగా అప్పుచేస్తూనో, యాచిస్తూనో తిరుగుతుంటారు. ముందుచూపులేనితనానికి ఈ ప్రవర్తన ఓ ఉదాహరణ.

నరం లేని నాలుక...

నరం లేని నాలుక ఎటైనా తిరుగుతుందన్నది జాతీయం. అంటే మాట నిలుపుకోలేకపోవటం, ఇప్పుడు చెప్పింది మరికాసేపటికి కాదనటం అనేలాంటి అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. నాలుక అనేది మాటకు ప్రతీకగా, నరం అనే దాన్ని పటుత్వానికి గుర్తుగానూ చెబుతారు.

జిల్లేళ్లకు మల్లెలు పూస్తాయా అన్నట్టు

కోపంతో, కసితో దుర్మార్గులు అనుకొన్నవారిని, వారి సంతానాన్ని దూషించే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. జిల్లేడు చెట్టుకు జిల్లేడు పూలే పూయటం ప్రకృతిసిద్ధంగా సహజంగా జరిగే పని. జిల్లేడు పూలను మల్లెపువ్వుల్లాగా ఎవరూ అంతగా ప్రేమించరు.

వూళ్లో ఇల్లూ లేదు, వూరిబయట చేనూ లేదూ

ఏమంతగా ధనవంతుడైనవాడు కాడు, సాధారణమైన సంపాదన మాత్రమే ఉందని చెప్పాల్సినచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. సొంత ఇల్లూ, పొలమూ ఉండటం ఆస్తి ఉందని చెప్పటానికి, ధనవంతుడేనని నిర్ధరించటానికి కొంత ఆధారంగా ఉంటాయి.

చెప్పి చెప్పి...

'చెప్పి చెప్పి చెప్పుతో తన్నించుకో, మళ్లీ వచ్చి మాతో తన్నించుకో' అన్నది జాతీయం. ఓ మంచి విషయాన్ని ఎంత చెప్పినా ఎవరూ వినిపించుకోని సందర్భంలో విసిగివేసారిన వారు ఉపయోగించే జాతీయమిది. ఇరుపక్షాల నడుమ రాజీ కుదర్చాలని ఓ వ్యక్తి తెగ ప్రయత్నం చేశాడట.

చీమలు పాకితే రాళ్లరుగుతాయా అన్నట్టు

అల్పులకు సహాయం చేసినందువల్ల సంపన్నులకు ఎలాంటి నష్టమూ ఉండబోదని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. చీమలు తమకు కావల్సిన ఆహారాన్ని పొందటానికి బండల మీద అటూఇటూ పాకుతూ ఉంటాయి. అంతమాత్రంతో ఆ బండ అరగటం కానీ ఇతరత్రా మరెలాంటి నష్టాన్ని పొందదు.

ఏనుగుల పోట్లాటకు ఎర్ర చీమ రాయబారమన్నట్టు

సమఉజ్జీగా లేని వ్యవహారం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. స్థాయిని మించి చేసే వ్యర్థ ప్రయత్నాలను విమర్శించే విషయంలో దీన్ని వాడుతుంటారు. ఏనుగుతో పోలిస్తే ఎర్రచీమ చాలా చిన్నదే. విడిగా అయితే ఆ ఎర్రచీమ ఎవరినైనా కుడితే కాస్తంత నొప్పి ఉంటే ఉండవచ్చేమో.

గడ్డేసిన తావునే గొడ్డును కట్టెయ్యాలన్నట్టు

వనరులు ఉన్నచోటే నివాసం ఉండటం మేలన్న విషయాన్ని తెలియచెప్పే జాతీయమిది. గడ్డి ఒకచోట వేసి గొడ్డును ఇంకొక చోట కట్టేస్తే మేత తినక గొడ్డు ఆకలితో మాడుతుంది. గడ్డి గొడ్డుకు ఆహారపు వనరు.

పొద్దెప్పుడు కుంకుతుందా ముద్ద ఎప్పుడు మింగుతానా అన్నట్టు

పనిదొంగలు, తిండిపోతుల వ్యవహార శైలిని విమర్శిస్తూ పెద్దలు మాట్లాడే మాటల్లో ఈ జాతీయం వినిపిస్తుంటుంది. కొంతమందికి ఎప్పుడూ తిండి మీదే ధ్యాస ఉంటుంది. ఇది పూర్వకాలంనాడు ఆవిర్భవించిన జాతీయం. పూర్వం పొద్దుకుంకగానే అన్నం తినేసేవారు.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

ఇంటివారు గొడ్డు గేదంటే పొరుగువారు పాడి గేదె అన్నట్టు

ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. కానీ చాలామంది ఇంట్లో అవమానం పొందుతూ బయటవారి దగ్గర ప్రశంసలందుకుంటుంటారు. అలాంటి వారిని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

అన్నీ తెలిసినమ్మ అమావాస్యనాడు...

అన్నీ తెలిసినమ్మ అమావాస్యనాడు చస్తే ఏమీ తెలియనమ్మ ఏకాదశినాడు చచ్చిందన్నట్టు అన్నది జాతీయం. ఈ జాతీయం తెలుగువారి ఆచార వ్యవహారాలు, నమ్మకాల ఆధారంగా అవతరించింది. చాంద్రమానాన్ని పాటించే తెలుగువారు అమావాస్య మంచిదికాదని భావిస్తారు. అది వారి నమ్మకం.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

గాలిలో మాట రాసినట్టు నీరు మూటకట్టినట్టు

వృథా కార్యాలు, వ్యర్థ ప్రయత్నాలు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. గాలిలో ఎంతసేపు రాసినా, ఏం రాసినా కనిపించదు. నీరు వస్త్రంతో మూటకట్టాలని ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం ఫలించదు.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

ఆత్మ సంతోషానికి రోకటిబండ తంబురా అన్నట్టు

ఎవరి పిచ్చి వారికానందం అనేలాంటిది ఇది. రోకటిబండతో రోట్లో పచ్చడి నూరుకోవచ్చేమో కానీ తంబురా లాగా దాన్ని ఉపయోగించటం సాధ్యం కాదు. కానీ అలా చేస్తున్నాడంటే పిచ్చికింద లెక్కే. ఆ పిచ్చి అతడి ఆత్మానందానికి సంబంధించింది. దీని ఆధారంగానే ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

ఆ మొద్దులోదే ఈ పేడు కూడా

ఒకేలాంటి లక్షణాలు కలిగి ఉన్నవారు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. ఒకే తానులో ముక్కలు అనేలాంటిదే ఇది. అయినా దీని ప్రయోగం మాత్రం విమర్శనాత్మక పరిస్థితుల్లో ఎక్కువగా ఉంటుంది.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

ఏమీలేని వారికి ఎచ్చులు లావు

ఏమీలేని వానికి ఎచ్చులు లావు.. స్వాములవారికి జడలు లావు అన్నట్లు అన్నది జాతీయం. ఏ విషయమూ లేని వ్యక్తి తన లోపాన్ని కప్పిపుచ్చుకొనేందుకు ఎచ్చులు చెబుతుంటాడన్నది సత్యం. అది ఎంతటి సత్యమంటే కొంతమంది స్వాములకు జుట్టు జడలు కట్టి ఉంటుంది.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

అప్పు లేకపోతే ఉప్పుగంజైనా మేలు

అప్పు తీసుకోవడం దాన్ని తీర్చలేక కష్టాలపాలు కావటం మంచిది కాదని హెచ్చరించే సందర్భాలలో పెద్దలు ఉదహరించే జాతీయమిది. అప్పు చేసి పప్పుకూడు తిని ఆ తర్వాత అందరితోనూ అవమానాలు పొందేకన్నా తాను సొంతంగా సంపాదించుకున్న ఉప్పు వేసిన గంజైనా ఎంతో గొప్పదంటారు.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

రాజు పగ, తాచు పగ ఒకటేనన్నట్లు

రాజు అంటే ప్రజల మీద సర్వాధికారాలు ఉన్నవాడు. అలాంటి అధికార సంపన్నుడు ఎవరి మీదైనా కోపం తెచ్చుకొని పగబడితే అది తాచుపాము పగలాంటిదేనని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. తాచుపాము పగపడితే చాలా ప్రమాదమని జన బాహుళ్యంలో ఉన్న నమ్మకం.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

శ్రుతిలేని పాట సమ్మతిలేని మాట అన్నట్టు

ఇంపుగాలేని వ్యవహారం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. కొన్నికొన్ని పనులు ఇష్టం లేకపోయినా చేయాల్సిన పరిస్థితులొస్తాయి. అలాంటప్పుడు ఆ పరిస్థితులను ఈ జాతీయంతో పోల్చి చెప్పటం కనిపిస్తుంది.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

ఉప్పు తిన్న ప్రాణం వూరుకోదన్నట్టు

కొంతమంది ఎదుటివారి దగ్గర మేలు పొందినప్పుడు తిరిగి ఏదో ఒక మేలు చేసి తమ కృతజ్ఞతను తెలుపుకోవాలని అనుకుంటారు. అలాంటివారి తత్వాన్ని గురించి వివరించే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ఉప్పు ఆహార పదార్థాలలో రుచి కోసం వేస్తుంటారు.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

కొడుకును కంటాను అత్తమ్మా అంటే..

కొడుకును కంటాను అత్తమా అంటే వద్దంటానా కోడలమ్మా అన్నట్టు అన్నది జాతీయం. ఇష్టమైన వస్తువులను లేదా పదార్థాలను ఒకరి దగ్గర నుంచి తీసుకొనేటప్పుడు వాడుకలో ఉన్న జాతీయం ఇది. ఇష్టమైన వస్తువులను ఇస్తామంటే కాదనేవారు ఎవరు? అనే భావంలో ఇది వాడుకలో కనిపిస్తుంది.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

చెట్టులేని చేను, చుట్టం లేని వూరన్నట్టు

నిరుపయోగమైన వాటి గురించి పోల్చాల్సిన సందర్భాల్లో ఉపయోగించే జాతీయమిది. పంటపండే చేను అయితేనే దానివల్ల ఎవరికైనా ఉపయోగం. ఆ చేలో ఉన్న చెట్టు చేమ వల్ల ఏదో ఒక ప్రయోజనం నెరవేరుతుంటుంది. అలా లేనప్పుడు ఆ చేను బీడు భూమి అయినప్పుడు ఏ ఉపయోగమూ ఉండదు.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

చేపల చెరువుకు కొంగను కాపలా ఉంచినట్టు

అసంబద్ధమైన నిర్ణయం తీసుకోవటం, రక్షణ కావలసినచోట శత్రువుకు అవకాశం కల్పించటం అనే లాంటి అర్థాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది. చేపలు కొంగకు ఆహారం. చేపల చెరువు దగ్గరకు కొంగలు రాకుండా రైతులు జాగ్రత్తపడుతుంటారు.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

పడిశం పది రోగాల పెట్టు

దేహ సంబంధమైన రోగాల గురించి కూడా మన జాతీయాలు విశ్లేషిస్తుంటాయి. వైద్యశాస్త్రపరంగా పలు జాతీయాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అలాంటి వాటిలో ఇదొకటి. రోగ సంబంధమైన విషయాలను అనుభవపూర్వకంగా తర్వాత తరాల వారికి తెలియజేసే వాటిలోనిది ఇది.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

అడ్డు గోడ

ఆటంకంగా నిలవటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఒక వ్యక్తి మరో వ్యక్తి అభివృద్ధికి కానీ, అభీష్టానికి కానీ ఆటంకం కలిగిస్తూ ఇబ్బంది పెడుతుండే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం జరుగుతుంటుంది.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

చేతిలో పని ఉన్నా నోట్లో నాలుక ఉండాలన్నట్టు

భావవ్యక్తీకరణ నైపుణ్యాల అవసరాన్ని గురించి తెలియచెబుతుంది ఈ జాతీయం. ఇటీవలి కాలంలో గొప్పగొప్ప ఉన్నత విద్యలు ఎన్ని చదివినా భావవ్యక్తీకరణ నైపుణ్యం లేనందువల్ల ఉద్యోగాలలో యువత నిలబడలేకపోతున్నారన్న సత్యం తెలియవస్తోంది.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

ఇంట్లోవాడే పెట్టెరా కంట్లోపుల్ల అన్నట్లు

సొంతమనుషులు అని అనుకొన్నవారు మోసం చేసినప్పుడు, నమ్మక్రదోహం జరిగిన సందర్భాలలోనూ ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. ఇంట్లో వారు అనంటే సొంతవారు, నా అని అనుకొన్నవారు అని అర్థం. కంట్లో పుల్లపెట్టడమంటే భయంకరమైన ద్రోహం చేయటమని అర్థం. ఇలా ఈ అర్థాలసారంగా ఈ జాతీయం అవతరించింది.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

నోట్లో చక్కెర, కడుపులో కత్తెర అన్నట్లు

పైపై మాటలు ప్రేమపూర్వకంగా ఉంటూ అంతరంగంలో శత్రుత్వాన్ని, పగను కలిగి ఉన్నవారిని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. మాటకు ప్రతీక నోరు. చేతలకు, రక్షణలాంటి కార్యాలకు ప్రతీక కడుపు. కడుపులో దాచుకోవటం అంటే జాగ్రత్తగా రక్షించటం అనే అర్థం ఉంది.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

మొక్కబోయిన దేవుడు ఎదురైనట్టు

తలచిన పనులు వెనువెంటనే జరిగిన సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. ఎంతో దూరాన ఉన్న ఒక దేవాలయంలోని దేవుడికి మొక్కుకుంటే అంతా మంచి జరుగుతుందని ఓ వ్యక్తి ఆ దేవుడికి మొక్కుకోవాలని సంకల్పించాడట.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

ముమ్మూట అరవై రోగాలకు...

ముమ్మూట అరవై రోగాలకు మూడు గుప్పెళ్ల కరక్కాయ పొడి అన్నట్టు అన్నది జాతీయం. జాతీయాలు జీవితానుభవసారాన్ని నింపుకొని తరతరాలకు చైతన్యదీపికలుగా అందుతూ ఉంటాయి. ఇలాంటి వాటిలో ఔషధ విలువలను, ఆరోగ్యపరిరక్షణ అంశాలును గురించి తెలియచెప్పేవి కూడా కొన్ని ఉన్నాయి.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యి..

సమయానికి అన్నీ సమకూరినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎంతో కష్టపడితేకానీ లభించనివి సర్వం సిద్ధం అంటూ ముందుకొచ్చిన సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ఇల్లు కట్టడమంటే సామాన్యమైన విషయంకాదు. ఎంతో శ్రమ పడాలి.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

ఆ గొడ్డు మంచిదైతే ఆ వూళ్లోనే అమ్ముడుపోతుందన్నట్టు

ఒకరి ప్రతిభను గురించి అంచనావేసి చెప్పే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది. కొంతమంది తమకు సరైన అవకాశాలు తామున్నచోట రావటం లేదని, అక్కడున్న వాళ్లంతా అసూయాపరులు, దుర్మార్గులు అని అందుకే వేరొక చోటికి వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నట్టు చెబుతారు.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

కంది చేలో సూదిపోతే....

కందిచేలో సూది పోతే పప్పుచట్టిలో వెతికినట్టు అన్నది జాతీయం. సందర్భ శుద్ధిలేని పని, చెయ్యాల్సిన పనికాక వేరొక పని చేయటం అనేలాంటి అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. కంది చేనులో తిరుగుతున్నప్పుడు ఓ రైతు చేతిలోనుంచి జారి సూది కిందపడి పోయిందట.

వూపిరి ఉంటే ఉప్పమ్ముకొని బతకవచ్చు

ప్రాణం విలువను తెలియచెప్పే జాతీయం ఇది. కొంతమంది క్షణికావేశంలో అనాలోచితంగా ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. అలాంటి వారికి హెచ్చరికగా ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. ఒకసారి ప్రాణం పోతే తిరిగిరాదు. ఆ తర్వాత భూమ్మీద ఏం చేయటానికి అవకాశమే ఉండదు.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

ఎంత తొండమున్నా దోమ ఏనుగు కాదు..

కొన్ని సందర్భాలలో దుర్మార్గులకు, మంచివారికి ఏదో ఒకటి రెండు పోలికలు కనిపిస్తుంటాయి. అంత మాత్రం చేత దుర్మార్గులు ఎప్పుడూ మంచివారితో సమానులు కారు అని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ఏనుగుకు తొండమున్నట్టే దోమకు కూడా చిన్న తొండం లాంటి అవయవం ఉంటుంది.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

ఆలి ఏడ్చిన ఇల్లు, ఎద్దు ఏడ్చిన సేద్యం

భార్యను కష్టపెట్టకూడదని అలా చేస్తే ఆ ఇంట్లో ఏదీ కలిసిరాదనే విషయాన్ని వివరించి చెప్పే జాతీయం ఇది. మన దేశం ప్రధానంగా వ్యవసాయ దేశం. కనుక వ్యవసాయపరమైన ఎద్దు ఏడ్పును ఆలి ఏడుపుతో పోల్చి చెప్పటం జరిగింది.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

గడ్డపార తినేవాడికి...

గడ్డపార తినేవాడికి శొంఠి కషాయం ఏం పన్చేస్తుంది అన్నది జాతీయం. దుర్మార్గాలలోనూ, దురలవాట్లలోనూ మితిమీరిన వారికి కొద్దిపాటి శిక్షవల్ల ఏ ప్రయోజనమూ ఉండదని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

కడవేరు మిగిలినా గరిక చిగుర్చక మానదన్నట్టు

కార్యదక్షుల సంకల్పదీక్షను గురించి తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. గరిక మొక్క అన్ని వేళ్లూ తెగిపోయినా, ఒకేఒక్క వేరున్నా మళ్లీ ఆ ఒక్క వేరుతోనే శక్తి పుంజుకొని చిగురుపెట్టి పెద్దదవుతుంది.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

రాఘవా స్వస్తి, రావణా స్వస్తి అన్నట్లు

లోకమంతా శుభకరంగా ఉండాలని కొంతమంది కోరుకొనే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

కూటికి లేకున్నా కాటుక చుక్క మానన్నట్లు

కాటుక పెట్టుకోవటం అలంకార సూచకం. కూటికి లేకపోవటమంటే పేదరికంలో మగ్గిపోవటమని, ధనహీనస్థితి అని అర్థం. కొంతమంది ఇలాంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నా తిండైనా మానుకుంటారు. కానీ అలంకారాలు చేసుకోవటం మానుకోరు.

గాజుపూసల గనిలో మణి దొరకదన్నట్టు

విలువలు లేనివారు ఎక్కువగా ఉన్నచోట విలువ కలిగినవారు ఉండరు అని నిర్ధరించి చెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. మణిమాణిక్యాల కన్నా గాజుపూసలకు విలువ తక్కువగా ఉంటుంది.

చెరువు ముందు చలివేంద్రం అన్నట్టు

నిరుపయోగమైన పని అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పూర్వం చెరువులు, బావులులాంటివి మంచినీరు తెచ్చుకోవటానికి స్థానాలుగా ఉండేవి. కావలసినవారు కావలసినంత నీరు చెరువులో నుంచి తెచ్చుకుంటుండేవారు. ఓ వ్యక్తి అలాంటి చెరువు ముందు ఒక చలివేంద్రాన్ని పెట్టాడట.

కూర్చొని లేవలేనమ్మ వంగొని శివరాత్రికి వస్తానన్నట్టు

అసమర్థులు చెప్పే ప్రగల్భాలను గురించి వివరించే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

ఆరేసి మూడెత్తుకున్నట్టు

మూడు పువ్వులు, ఆరుకాయలు అనే దానికి వ్యతిరేకార్థం ఇచ్చే జాతీయం ఇది. ఆరు వెయ్యడమంటే ఆరు ఖర్చుపెట్టడం అని అర్థం. ఆరు ఖర్చుపెడితే దక్కింది మూడేనట. అంటే పెట్టుబడిలో సగానికి సగమే దక్కిందన్నమాట. ఇలా నష్టపోయిన సందర్భాలలో ఉపయోగించిన జాతీయం ఇది. వ్యాపారమేమీ బాగోలేదు.

చేతిలో కాసు నోటిలో దోసె అన్నట్టు

డబ్బిచ్చిన తర్వాతే ఏ పనైనా జరిగేది అని, అప్పు ఇవ్వడం లేదని చెప్పే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది. సర్వకాలాలలోనూ జాతీయాలు ఆవిర్భవిస్తూనే ఉంటాయి. ఆనాటి కాలపరిస్థితులు వీటికి వేదికలవుతాయి. అప్పుడు వాడుకలో ఉన్న పదాలతోనే జాతీయాలు రూపొందుతుంటాయి.

తల వంచుకుంటే ఏడు గోడల చాటన్నట్టు

లౌక్యం తెలుసుకొని మసులుకోవాలి అని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది. అనువుగాని చోట అధికులమనరాదు అనే దానికి ఇది సమానార్థకం.

పూసిన పూలన్నీ కాయలవుతాయా

పూసిన పూలన్నీ కాయలవుతాయా అన్నది జాతీయం. ప్రయత్నం విఫలమైన సందర్భంలో విసిగిపోవద్దని, మళ్లీ మళ్లీ ప్రయత్నం చేయమని ధైర్యం చెప్పే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. చెట్టుకు పువ్వులు పూస్తాయి. అయితే పూసిన పూలన్నీ కాయలవ్వవు, పండ్లుగా మారవు.

నేలరాయి నెత్తికెత్తుకున్నట్లు

అనవసరమైన పనిని మీద వేసుకొని కష్టాలను అనుభవించటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఓ వ్యక్తి కాలిబాటన నడుస్తూ ఉంటే పక్కన నేలమీద ఒక బండరాయి కనిపించిందట. అతడు తన దోవన తాను పోక ఆ రాయిని పెకలించి ఎత్తి నెత్తిన పెట్టుకున్నాడట.

శ్రీరాముని దయచేతను

శ్రీరాముని దయచేతను
నారూఢిగ సకలజనులు నౌరాఁయనగా
ధారాళమైన నీతులు
నోరూరఁగఁ జవులుపుట్ట నుడివెద సుమతీ!

అక్కరకు రాని చుట్టము

అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదా
నెక్కినఁ బారని గుర్రము
గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ!

అడిగిన జీతంబియ్యని

అడిగిన జీతంబియ్యని
మిడిమేలపు దొరనుగొల్చి మిడుకుటకంటెన్
వడిగల యెద్దుల గట్టుక
మడి దున్నుకు బ్రతుకవచ్చు మహిలో సుమతీ!

అడియాస కొలువుఁ గొలువకు

అడియాస కొలువుఁ గొలువకు
గుడిమణియము సేయఁబోకు కుజనులతోడన్
విడువక కూరిమి సేయకు
మడవినిఁదో డరయఁకొంటి నరుగకు సుమతీ!

అప్పుగొని సేయు విభవము

అప్పుగొని సేయు విభవము
ముప్పునఁ బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్
దప్పురయని నృపురాజ్యము
దెప్పరమై మీఁదఁ గీడు దెచ్చుర సుమతీ!

అల్లుని మంచితనంబును

అల్లుని మంచితనంబును
గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్
బొల్లున దంచిన బియ్యముఁ
దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ!

ఆఁకొన్న కూడె యమృతము

ఆఁకొన్న కూడె యమృతము
తాఁకొందక నిచ్చువాఁడె దాత ధరిత్రిన్
సోఁకోర్చువాఁడె మనుజుఁడు
తేఁకువగలవాఁడె వంశ తిలకుఁడు సుమతీ!

ఇమ్ముగఁ జదువని నోరును

ఇమ్ముగఁ జదువని నోరును
అమ్మాయని పిలిచి యన్నమడుగని నోరున్
దమ్ములఁ బిలువని నోరును
గుమ్మరిమను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!

ఉడుముండదె నూరేండ్లును

ఉడుముండదె నూరేండ్లును
బడియుండదె పేర్మి బాము పదినూరేండ్లున్
మడుపునఁ గొక్కెర యుండదె
కడు నిల బురుషార్థపరుడు గావలె సుమతీ!

ఉత్తమ గుణములు నీచు

ఉత్తమ గుణములు నీచు
కెత్తెర గునగలుగనేర్చు నెయ్యడలం దా
నెత్తిచ్చి కరగిపోసిన
నిత్తడి బంగారుమగునె ఇలలో సుమతీ!

ఉదకము ద్రావెడు హయమును

ఉదకము ద్రావెడు హయమును
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్
మొదవుకడ నున్న వృషభము
జదువని యా నీచుకడకుఁ జనకుర సుమతీ!

ఉపకారికి నుపకారము

ఉపకారికి నుపకారము
విపరీతముగాదు సేయ వివరింపంగా
నుపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!

ఎప్పుడు దప్పులు వెదకెడు

ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషుని కొల్వ గూడ దదియెట్లన్నన్
సర్పంబు పడగనీడను
గప్పవసించిన విధంబు గదరా సుమతీ!

ఎప్పుడు సంపద కలిగిన

ఎప్పుడు సంపద కలిగిన
అప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్
దెప్పలుగ జెరువునిండిన
గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ!

ఏరకుమీ కసుగాయలు

ఏరకుమీ కసుగాయలు
దోరకుమీ బంధుజనుల దోషముసుమ్మీ
పారకుమీ రణమందున
మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ!

ఒకయూరికి నొక కరణము

ఒకయూరికి నొక కరణము
నొక తీర్పరియైనఁ గాక వొగిఁదరుచైనం
గకవికలు గాక యుండునె
సకలంబును గొట్టువడక సహజము సుమతీ!

ఒల్లనిసతి నొల్లనిపతి

ఒల్లనిసతి నొల్లనిపతి
నొల్లని చెలికాని విడువ నొల్లనివాఁడే
గొల్లండు గాక ధరలో
గొల్లండును గొల్లడౌను గుణమున సుమతీ!

ఓడల బండ్లును వచ్చును

ఓడల బండ్లును వచ్చును
ఓడలు నాబండ్ల మీద నొప్పుగ వచ్చును
ఓడలు బండ్లును వలెనే
వాడంబడు గలిమిలేమి వసుధను సుమతీ!

కడు బలవంతుడైనను

కడు బలవంతుడైనను
బుడమిని బ్రాయంపుటాలి బుట్టినయింటం
దడవుండనిచ్చె నేనియు
బడుపుగ నంగడికి దానె పంపుట సుమతీ!

  •  

కనకపు సింహాసనము

కనకపు సింహాసనము
శునకముఁ గూర్చుండబెట్టి శుభలగ్నమునఁ
దొనరఁగ బట్టముగట్టిన
వెనకటి గుణమేల మాను వినరా సుమతీ!

కప్పకు నొరగాలైనను

కప్పకు నొరగాలైనను
సప్పమునకు రోగమైన సతి తులువైనన్
ముప్పున దరిద్రుడైనను
దప్పదు మరి దుఃఖమగుట తథ్యము సుమతీ!

కమలములు నీడఁ బాసినఁ

కమలములు నీడఁ బాసినఁ
గమలాప్తుని రశ్మి సోకి కమలినభంగిన్
దమ దమ నెలవులు దప్పినఁ
దమ మిత్రులు శతృలౌట తథ్యము సుమతీ!

కరణము గరణము నమ్మిన

కరణము గరణము నమ్మిన
మరణాంతకమౌను గాని మనలేడు సుమీ
కరణము తన సరి కరణము
మరి నమ్మక మర్మమీక మనవలె సుమతీ!

కరణము సాధై యున్నను

కరణము సాధై యున్నను
గరి మద ముడిగినను బాము కరవకయున్నన్
ధరదేలు మీటకున్నను
గర మరుదుగ లెక్క గొనరు గదరా సుమతీ!

కసుగాయఁ గరచి చూచిన

కసుగాయఁ గరచి చూచిన
మసలక తన యోగరుగాక మధురంబగునా?
పసగలుగు యువతులుండఁగఁ
బసిబాలలఁ బొందువాఁడు పశువుర సుమతీ!

కవిగానివాని వ్రాఁతయు

కవిగానివాని వ్రాఁతయు
నవరసభావములు లేని నాతుల వలపుం
దవిలి చను పందినేయని
వివిధాయుధ కౌశలంబు వృథరా సుమతీ!

కాదు సుమీ దుస్సంగతి

కాదు సుమీ దుస్సంగతి
పోదుసుమీ కీర్తికాంత పొందిన పిదపన్
వాదుసుమీ యప్పిచ్చుట
లేదుసుమీ సతులవలపు లేశము సుమతీ!

కాముకుడు దనిసి విడిచిన

కాముకుడు దనిసి విడిచిన
కోమలి బరవిటుడు గవయ గూడుట యెల్లన్
బ్రేమమున జెరకు పిప్పికి
జీమలు వెస మూగినట్లు సిద్ధము సుమతీ!

కారణములేని నగవును

కారణములేని నగవును
బేరణమును లేని లేమ పృథివీస్థలిలో
బూరణము లేని బూరెయు
వీరణములేని పెండ్లి వృధరా సుమతీ!

కొంచెపు నరుసంగతిచే

కొంచెపు నరుసంగతిచే
నంచితముగఁ గీడువచ్చు నదియెట్లన్నన్
గించిత్తు నల్లి కుట్టిన
మంచమునకుఁ జేటువచ్చు మహిలో సుమతీ!

కూరిమిగల దినములలో

కూరిమిగల దినములలో
నేరము లెన్నఁడును గలుఁగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోఁచుచుండు నిక్కము సుమతీ!

కులకాంత తోడ నెప్పుడుఁ

కులకాంత తోడ నెప్పుడుఁ
గలహింపకు వట్టి తప్పు ఘటియింపకుమీ
కలకంఠి కంట కన్నీ
రొలికిన సిరి యింటనుండ నొల్లదు సుమతీ!

చీమలు పెట్టిన పుట్టలు

చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైన యట్లు పామరుఁడు దగన్
హేమంబుఁ గూడఁబెట్టిన
భూమీశులపాఁ జేరు భువిలో సుమతీ!

గడనగల మననిఁజూచిన

గడనగల మననిఁజూచిన
నడుగగడుగున మడుఁగులిడుచు రతివలు తమలో
గడ నుడుగు మగనిఁ జూచిన
నడుపీనుఁగు వచ్చెననుచు నగుదురు సుమతీ!

కోమలి విశ్వాసంబును

కోమలి విశ్వాసంబును
బాములతోఁ జెలిమి యన్యభామల వలపున్
వేముల తియ్యఁదనంబును
భూమీశుల నమ్మికలుసు బొంకుర సుమతీ!

కొరగాని కొడుకు పుట్టినఁ

కొరగాని కొడుకు పుట్టినఁ
కొరగామియె కాదు తండ్రి గుణముల జెరచుం
జెరకు తుద వెన్నుఁపుట్టిన
జెరకునఁ దీపెల్ల జెరచు సిద్ధము సుమతీ!

చుట్టములు గానివారలు

చుట్టములు గానివారలు
చుట్టములము నీకటంచు సొంపుదలర్పన్
నెట్టుకొని యాశ్రయింతురు
గట్టిగఁ ద్రవ్యంబు గలుగఁ గదరా సుమతీ!

చేతులకు దొడవు దానము

చేతులకు దొడవు దానము
భూతలనాధులకుఁ దొడవు బొంకమి ధరలో
నీతియ తొడ వెవ్వారికి
నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ!

తడ వోర్వక యొడలోర్వక

తడ వోర్వక యొడలోర్వక
కడువేగం బడచిపడినఁ గార్యంబగునే
తడవోర్చిన నొడలోర్చినఁ
జెడిపోయిన కార్యమెల్ల జేకురు సుమతీ!

తన కోపమె తన శతృవు

తన కోపమె తన శతృవు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌఁ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తధ్యము సుమతీ!

తనయూరి తపసితనమును

తనయూరి తపసితనమును
దనపుత్త్రుని విద్య పెంపుఁ దన సతి రూపున్
దన పెరటిచెట్టు మందును
మనసున వర్ణింప రెట్టి మనుజులు సుమతీ!

తన కలిమి ఇంద్రభోగము

తన కలిమి ఇంద్రభోగము
తన లేమియె సర్వలోక దారిద్య్రంబున్
తన చావు జతద్ప్రళయము
తను వలచినదియె రంభ తథ్యము సుమతీ!

తనవారు లేనిచోటను

తనవారు లేనిచోటను
జనవించుక లేనిచోట జగడముచోటన్
అనుమానమైన చోటను
మనుజునకును నిలువఁదగదు మహిలో సుమతీ!

తములము వేయని నోరును

తములము వేయని నోరును
విమతులతో జెలిమిసేసి వెతఁబడు తెలివిన్
గమలములు లేని కొలకుఁను
హిమధాముఁడు లేని రాత్రి హీనము సుమతీ!

తలనుండు విషము ఫణికిని

తలనుండు విషము ఫణికిని
వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్
దలతోఁక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!

తలమాసిన నొలుమాసిన

తలమాసిన నొలుమాసిన
వలువలు మాసినను బ్రాన వల్లభునైనం
గులకాంతలైన రోఁతురు
తిలకింపఁగ భూమిలోన దిరముగ సుమతీ!

తాను భుజింపని యర్థము

తాను భుజింపని యర్థము
మానవపతిఁ జేరుఁగొంత మరి భూగతమౌఁ
గానల నీఁగల గూర్చిన
దేనియ యెరుఁజేరునట్లు తిరగమున సుమతీ!

దగ్గర కొండెము సెప్పెడు

దగ్గర కొండెము సెప్పెడు
ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుఁడై మరితా
నెగ్గుఁబ్రజ కాచరించుట
బొగ్గులకై కల్పతరువు బొడచుట సుమతీ!

చేతులకు దొడవు దానము

చేతులకు దొడవు దానము
భూతలనాధులకుఁ దొడవు బొంకమి ధరలో
నీతియ తొడ వెవ్వారికి
నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ!

ధనపతి సఖుఁడై యుండియు

ధనపతి సఖుఁడై యుండియు
నెనయంగా శివుఁడు భిక్షమెత్తగవలసెన్
దనవారి కెంతకల గిన
దనభాగ్యమె తనఁకుగాక తథ్యము సుమతీ!

సారంబగు నారికేళ సలిలము భంగిన్

సారంబగు నారికేళ సలిలము భంగిన్
గారవమును మరిమీదట
భూరిసుఖావహము నగును భువిలో సుమతీ!

నడువకుమీ తెరువొక్కటఁ

నడువకుమీ తెరువొక్కటఁ
గుడువకుమీ శతృనింటఁ గూరిమితోడన్
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యెరులమనసు నొవ్వగ సుమతీ!

మన తెలుగు గురించి మీకు తెలుసా ??

  • 12వ శతాబ్ధిలో పాల్కురికి సోమనాధుడు "నవలక్ష తెలుంగు" - అనగా తొమ్మిది లక్షల గ్రామ విస్తీర్ణము గలిగిన తెలుగు దేశము - అని వర్ణించాడు.
  • అచ్చుతో అంతమయ్యే విషయం వల్ల ఇది సంగీతపరంగా సంగీతకారులకు చాలా ఇష్టమైన భాష.
  • పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2400 సంవత్సరాలనాటిది
  • క్రీ.పూ.700 ప్రాంతంలో వచ్చిన ఐతరేయ బ్రాహ్మణము (ఋగ్వేదములో భాగము)లో మొదటిసారిగా "ఆంధ్ర" అనే పదం జాతి పరంగా వాడబడింది.
  • క్రీ.పూ. 4వ శతాబ్ధిలో మెగస్తనీసు అనే గ్రీకు రాయబారి ఆంధ్రులు గొప్ప సైనికబలం ఉన్నవారని వర్ణించినాడు.
  • బౌద్ధ శాసనాలలోనూ, అశోకుని శాసనాలలోనూ ఆంధ్రుల ప్రస్తావన ఉన్నది.
  • ప్రపంచవ్యాప్తంగా 10కోట్ల మందికి పైగా ఈ భాషను మాట్లాడతారు.
  • కర్ణాటక సంగీతం లోని చాలా కృతులు తెలుగు భాషలోనే ఉన్నవి
  • తెలుగు అజంత భాష. అనగా దాదాపు ప్రతి పదము ఒక అచ్చుతో అంతము అవుతుంది. దీన్ని గమనించే 15వ శతాబ్దములో ఇటాలియన్ యాత్రికుడు నికొలో డా కాంటి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ (ప్రాచ్య ఇటాలియన్) గా అభివర్ణించాడు.

బ్రిటీష్ వారి కాలంలోనే వెలుగొందిన మన తెలుగు వైభవం

అణామన తెలుగు బాష యొక్క ప్రాముఖ్యతను బ్రిటీష్ వారు సైతం గుర్తించారు అనటానికి నిధర్శనం వారు ముద్రించిన కరెన్సీ “అణా

“అణా” అని హింది, బెంగాలీ, ఉర్ధు లతో పాటుగా తెలుగులో ముద్రించారు. మరే ఇతర బాషలను వాడలేదు. వారి కాలంలో దేశంలో తెలుగు మాట్లాడే వారు మూడవ స్థానంలో ఉండటమే దీనికి కారణం.

తెలుగు వారందరికీ

తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు

 

తెలుగ దేలయన్న దేశంబు తెలుగేనుతెలుగుతల్లి
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స

మన తెలుగుకు మళ్లీ వెలుగు

మన తెలుగుకు మళ్లీ వెలుగు

 తల్లిపాల మాధుర్యాన్ని తలపించేదే అమ్మభాష. అలాంటి మన తెలుగు, నేడు ఆంగ్ల ప్రభావంవల్ల చిక్కిశల్యమైపోతోంది. తెలుగు భాషావికాసోద్యమం మళ్ళీ మొదలైతే తప్ప, పరిస్థితి చక్కబడదు. విజయవాడలో నిన్న ప్రారంభమైన ‘ప్రపంచ తెలుగు రచయితల రెండో మహాసభ’లో పాల్గొన్న వక్తల ప్రసంగాల సారాంశమిదే. సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ‘ఈనాడు’ సంపాదకులు రామోజీరావు- భాషోద్ధరణ పాఠశాలనుంచి మొదలుకావాలన్నారు. వాడుకే భాషకు వేడుక అవుతుందని స్పష్టంచేశారు. తెలుగు భాష పునరుజ్జీవానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆ కృషికి ‘తెలుగు రచయితల మహాసభ’ నాంది పలకాలన్నారు. రామోజీరావు ప్రసంగం పూర్తిపాఠమిది…

తెలుగు బాష ప్రాముఖ్యత (ప్రథమ బహుమతి పొందిన వ్యాసం)

తెలుగుభాష యొక్క ప్రాముఖ్యత

ఉపోద్గాతము :  “చక్కని పలుకుబడులకు, నుడికారములకు తెలుగు బాషయే పుట్టినిల్లు ”. చక్కని కవితలల్లిక లో జిగిబిగిని ప్రదర్శించిన నేర్పు ఈ బాషలోనే వీలైనది. అంతేగాక, అనేక బాషలు ఈ బాషలో చోటు చేసుకున్నాయి. ఎప్పుడైనా ఒక బాష  గొప్పతనం అన్ని బాషలూ నేర్చినగానీ తెలియదు. సంస్కృతము, తమిళము, పారసి మున్నగు బాషలు తెలిసిన రాయలు దేశబాషలందు  తెలుగులెస్స అనుట ఆశ్చర్యం గాదు. బ్రౌనుదొర కూడాఈ బాషను గూర్చి వేనోళ్ల పొగుడుట మన తెలుగు వారి, తెలుగు బాష యెక్క గౌరవము.

దేశ బాషలందు తెలుగు లెస్స: మన తెలుగు బాష దేశ బాషలలో గొప్పది. దేశబాషలందు తెలుగులెస్స, అని శ్రీకృష్ణదేవరాయలు తన “ఆముక్తమాల్యద” లో ఆంధ్రమహావిష్ణువు చే చెప్పించాడు. ఈ మాట ప్రతి తెలుగు వారి గుండెలలో నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. రాయల పైమాట తెలుగు వారి యెక్క మాతృబాషాభిమానానికి మేలుకొలుపు పాట అయ్యింది. బహుబాషా కోవిదుడైన రాయలు, ఆ బాష లోతుపాతులనెరిగి, మధించి భువన విజయ వికమాదిత్య న్యాయాధిపతిగా చెప్పిన తీర్పు దేశబాషలందు  తెలుగులెస్స అన్న మాట.

తెలుగు  బాష మాధుర్యం:   తెలుగు బాష మాధుర్యానికి కారణాలను పరిశేలిద్దాం. తెలుగు ద్రావిడ బాషలలో నుండి పుట్టింది. సహజముగా ద్రావిడ లక్షణములను బట్టి సరళము, సుకుమారము అయిన తెలుగువాణి, సంస్కృత బాషా కైకర్యం, గాంభీర్య పటుత్వాలను అలవరుచుకొని, తల్లికి, అక్కా చెల్లెండ్రకూ లేని క్రొత్త అందాలను అలవరుచుకుంది.

తెలుగు బాష ప్రాముఖ్యత (ధ్వితీయ బహుమతి పొందిన వ్యాసం)

మాతృ బాష యొక్క ప్రాముఖ్యత

ఉపోధ్ఘాతం:

మాతృమూర్తిపై, మాతృభూమిపై, మనసున్న ప్రతి మనిషికీ అవ్యాజమైన ప్రేమ, గౌరవం ఉంటుంది. అందుకే, “మాతృదేవోభవ” అని మనకు జన్మనిచ్చిన తల్లిని మొట్టమొదటగా స్మరించుకుంటున్నాం. ‘తల్లి ఒడి మొదటి బడి’ అన్నారు. వ్యక్తి జీవితంలో మొదట నేర్చుకునే బాష మాతృబాష. “జననీ జన్మ భూమిశ్చ, స్వర్గాధపి గరీయసి” అనడంలో మాత, మాతృభూమి, స్వర్గం కంటే మిన్న అని తెలుస్తుంది. మాతృబాష సహజంగా అబ్బుతుంది. అప్రయత్నంగా వచ్చేదే మాతృబాష.

 మాతృబాష:

Mother Tongue అనే ఆంగ్ల పదానికి సమానార్ధకంగా నేడు మాతృబాష అనే పదం వ్యవహారంలో ఉంది. శిశువు మొట్టమొధటిసారిగా తానొక బాషను నేర్చుకుంటున్నాననే జ్ఞానం లేనప్పుడు, తనలో ఉన్న అనుకరణ అనే సహజ ప్రవృత్తితో తన పరిసరాలలోని వారి బాషణాన్ని అనుకరిస్తూ, జీవితంలో  మొట్టమొదటిసారిగా నేర్చుకునే బాషే “మాతృబాష”. శిశువు సౌంధర్య దృష్టిని ఆనందానుభూతిని వ్యక్తం చేయటానికి ఉపయోగపడేది మాతృబాష అని గాంధీజీ భావించారు. “దేశ భాషలందు తెలుగు లెస్స” అని సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీ కృష్ణదేవరాయులు ఆముక్తమాల్యధ లో తన ఇష్ట ధైవమైన శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు తో చెప్పించారు.

తెలుగు బాష ప్రాముఖ్యత (తృతీయ బహుమతి పొందిన వ్యాసం -౨)

తెలుగు బాష ప్రాముఖ్యత 

 “దేశ  భాషలందు తెలుగు లెస్స” అని శ్రీకృష్ణదేవరాయలు వారు అన్న మాటకు అర్థం మన దేశంలో ఎన్నిభాషలున్నా సరే ఏ భాష కూడా తెలుగుతో పోటీ పడలేదు అని. తెలుగు భాషలోని మాధుర్యం అంతా ఇంతా కాదు. ఉగ్గు పాల నుండి ఒక బిడ్డకి తల్లి పాట పాడేందుకు వీలైన భాష.తెలుగు భాషలోని స్పష్టత, నేర్పు, భావం, కూర్పు చాలా అందంగా ఉంటాయి. ఎందరో మహనీయులు, కవులు, కవయిత్రులు మన తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను గురించి చాటిచెప్పారు.

అందులో ప్రప్రధమంగా  నన్నయ, తిక్కన, యెఱ్ఱాప్రగడలు మహాభారతం వంటి గొప్పకావ్యాన్ని సంస్కృతం నుండి తెలుగులోకి, సామాన్య మనవుడికి అర్థమయ్యే విధంగా, చక్కగా అనువదించారు.ఆ కవిత్రయానికి జోహార్లు. వీరేకాక, గురజాడ అప్పారావు, వీరేశలింగం పంతులు, శ్రీశ్రీ, సి.నా.రె మొదలైన కవుల వరకు అందరూ ఎన్నో గొప్ప తెలుగు కావ్యాలు, కథలు రచించారు.

తెలుగు బాష ప్రాముఖ్యత (తృతీయ బహుమతి పొందిన వ్యాసం)

తెలుగు బాష ప్రాముఖ్యత 

 “దేశ  భాషలందు తెలుగు లెస్స” అని శ్రీకృష్ణదేవరాయలు వారు అన్న మాటకు అర్థం మన దేశంలో ఎన్నిభాషలున్నా సరే ఏ భాష కూడా తెలుగుతో పోటీ పడలేదు అని. తెలుగు భాషలోని మాధుర్యం అంతా ఇంతా కాదు. ఉగ్గు పాల నుండి ఒక బిడ్డకి తల్లి పాట పాడేందుకు వీలైన భాష.తెలుగు భాషలోని స్పష్టత, నేర్పు, భావం, కూర్పు చాలా అందంగా ఉంటాయి. ఎందరో మహనీయులు, కవులు, కవయిత్రులు మన తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను గురించి చాటిచెప్పారు.

 

గిడుగు రామమూర్తి పంతులు గారు

గిడుగు రామమూర్తి పంతులు గిడుగు రామమూర్తి పంతులు గారి జన్మదినమైన ఆగస్టు 29 ను  తెలుగు భాషా దినోత్సవము’గా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము పరిగణిస్తున్నది. గిడుగు గారు తెలుగు వ్యావహారిక బాషకు పితామహుడిగా పరిగణించబడతారు. గిడుగు రామమూర్తి గారికి అభినవ వాగమశాసనుడు అని బిరుదు.

గిడుగు వెంకట రామమూర్తి (1863-1940):

తెలుగు ప్రజలు స్మరించదగ్గ ప్రథమ స్మరణీయుడు గిడుగు రామమూర్తి. ఆధునిక విజ్ఞాన వ్యాప్తికి, వచనరచనకు కావ్యభాష పనికిరాదనీ, సామాన్యజనానికి అర్థమయ్యే సమకాలీన “శిష్టవ్యావహారికం”లో ఉండాలనీ ఆనాటి సాంప్రదాయికపండితులతో హోరాహోరీగా యుద్ధంచేసి ఆధునికప్రమాణభాషను ప్రతిష్టించటానికి మార్గదర్శకుడైనవాడు గిడుగు రామమూర్తి.

గిడుగువారి వ్యవహారిక భాషోద్యమం వల్ల ఆధునిక సాహిత్యం కొత్త సొగసులు సంతరించుకుంది. రచనావైవిధ్యం, వైశిష్ట్యంతో పుష్టిచేకూరింది. విశ్వవిద్యాలయాలలో వాడుకభాష రాజ్యమేలుతోంది. పత్రికలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. అక్షరాస్యత పెరిగింది. తెలుగు అధికారభాషగా, పరిపాలనా భాషగా కీర్తికెక్కింది. దీనికంతటికీ గిడుగు పిడుగే మూలకారకుడు.

వ్యావహారిక భాషకు దిక్సూచి

నేడు గిడుగు రామమూర్తి గారి జయంతి ( తెలుగిడుగు రామమూర్తిగు భాషా దినోత్సవం )

ఆంగ్లేయుల పాలన వచ్చేవరకు మనం ప్రజల భాష గురించి ఆలోచించలేదు. ఆలోచించి ఉంటే- మనది బానిసదేశమై ఉండేది కాదు. ఇంగ్లిషువాళ్లు కొత్త బడులు పెట్టారు. కొత్త చదువులు మొదలుపెట్టారు. కొత్త పుస్తకాలు రాయించారు. అన్నిటికీమించి అందరికీ చదువు అనే ఆలోచన పెంచారు. కొత్త విద్యార్థులు ఎందరో బడిబాట పట్టారు. అప్పుడు కొత్తభాష అవసరమైంది. ఈ దశలో పద్యం జోరు తగ్గింది. వచనం హోరు మొదలైంది. శతాబ్దాలుగా పుస్తకాల్లో వాడే కట్టుదిట్టమైన భాషలో రాయాలని కొందరన్నారు. వాళ్లకు చిన్నయసూరి నాయకుడయ్యాడు. చిన్నయసూరి పుట్టి రెండు వందల ఏళ్లయినా, ఇప్పటికీ భాష ఆయన కనుసన్నల్లో మెలగాలని అనుకునేవాళ్లు లేకపోలేదు.

ప్రజల భాషలో రాయడం ప్రపంచం అంతటా ఉన్న పద్ధతి. కాబట్టి మాట్లాడే భాషలోనే రాయాలని కొందరన్నారు. వాళ్లకు గిడుగు రామ్మూర్తి పంతులు నాయకుడయ్యాడు. ఆయన పుట్టడానికి కొన్ని దశాబ్దాల ముందునుంచీ వాడుక భాషలో రాసిన వాళ్లున్నారు. ఏనుగుల వీరస్వామయ్య, సామినీన ముద్దు నరసింహం, గురజాడ అప్పారావు లాంటివారు వాడుక భాష విషయంలో గిడుగు కంటే ముందు అడుగువేసినవారిలో ప్రసిద్ధులు. గిడుగు కారణంగా 1906నుంచి వాడుక భాషలో రాయాలన్నది ఒక పెద్ద ఉద్యమమైంది. 1911లో వాడుక, గ్రాంథిక భాషల మధ్య అధికార ముద్రకోసం ఎడతెగనిపోరు మొదలైంది. అంటే- ఈ సమరానికిది శతజయంతి సంవత్సరమన్నమాట. ఈ పోరులో దొంగదారిలో నెగ్గిన గ్రాంథిక శైలి ఏభై ఏళ్లపాటు (అ)యోగ్యతా పత్రాలనిచ్చే బడుల్లో చలామణి అయింది. అయినా, వాడుక భాష ప్రజల్లో బలంగా నాటుకుంటూ నూరేళ్లలో అత్యున్నతస్థాయికి చేరింది. అధికారం దిగివచ్చి ఆ బావుటా కింద తలవంచి నిలిచింది. ప్రజలు ఎదిగినప్పుడు పాలకులు ఒదగక తప్పదు కదా! గిడుగు లేకపోతే ఈ గెలుపు ఇంత త్వరగా మనకు కైవసమై ఉండేది కాదు.

నమ్మకు సుంకరి జూదరి

నమ్మకు సుంకరి జూదరి
నమ్మకు మగసాలివాని నటు వెలయాలిన్
నమ్మకు మంగలివానిని
నమ్మకుమీ వామహస్తు నవనిని సుమతీ!

నవమున బాలుంద్రావరు

నవమున బాలుంద్రావరు
భయమునను విషమ్మునైన భక్షింతురుగా
నయమెంత దోసకారియె
భయమే చూపంగవలయు బాగుగ సుమతీ!

నరపతుల మేరదప్పిన

నరపతుల మేరదప్పిన
దిర మొప్పగ విధవ ఇంట దీర్పరియైనన్
గరణము వైదికుఁడయినను
మరణాంతకమౌనుగాని మానదు సుమతీ!

నవరస భావాలంకృత

నవరస భావాలంకృత
కవితాగోష్ఠియును మధుర గానంబును
నవివేకి కెంతఁజెప్పినఁ
జెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ!

నవ్వకుమీ సభలోపల

నవ్వకుమీ సభలోపల
నవ్వకుమీ తల్లిదండ్రి నాధులతోడన్
నవ్వకుమీ పరసతితో
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!

పగవల దెవ్వరితోడను

పగవల దెవ్వరితోడను
వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్
దెగనాడవలదు సభలను
మగువకు మనసీయవలదు మహిలో సుమతీ!

పతికడకుఁ దన్నుగూర్చిన

పతికడకుఁ దన్నుగూర్చిన
సతికడకును వేల్పుకడకు సద్గురు కడకున్
సుతుకడకు రిత్తచేతుల
మతిమంతులు చనరు నీతిమార్గము సుమతీ!

పనిచేయునెడల దాసియు

పనిచేయునెడల దాసియు
ననుభవమున రంభ మంత్రి యాలోచనలన్
దనభుక్తి యెడలఁ దల్లియు
ననఁ దన కులకాంత యుండనగురా సుమతీ!

పరనారీ సోదరుఁడై

పరనారీ సోదరుఁడై
పరధనముల కాసపడక పరులకు హితుడైఁ
పరుల దనుఁబొగడ నెగడక
పరుఁలలిగిన నలుగనతఁడు పరముడు సుమతీ!

పరసతి కూటమి గోరకు

పరసతి కూటమి గోరకు
పరధనముల కాసపడకు పరునెంచకుమీ
సరిగాని గోష్టి సేయకు
సిరిచెడి జుట్టంబుకడకుఁ జేరకు సుమతీ!

పరసతుల గోష్టినుండి

పరసతుల గోష్టినుండి
పురుషుడు గాంగేయుడైన భువి నిందబడున్
బరుసతి సుశీయైనను
బరుసంగతినున్న నింద పాలగు సుమతీ!

పరుల కనిష్టము సెప్పకు

పరుల కనిష్టము సెప్పకు
పొరుగిండ్లకు బనులులేక పోవకు మెపుడున్
బరుఁగదిసిన సతి గవయకు
ఎరింగియు బిరుసై సహయము నెక్కకు సుమతీ!

పర్వముల సతులఁ గవయకు

పర్వముల సతులఁ గవయకు
ముర్వీశ్వరుకరుణ నమ్మి యబ్బకు మదిలో
గర్వింపనాలి బెంపకు
నిర్వహణము లేనిచోట నిలువకు సుమతీ

పలుదోమి సేయు విడియము

పలుదోమి సేయు విడియము
తలగడిగిన నాఁటినిద్ర తరుణులయెడలం
బొలయలుక నాటి కూటమి
వెల యింతని చెప్పరాదు వినురా సుమతీ!

 

పాటెరుగని పతికొలువును

పాటెరుగని పతికొలువును
గూటంబున కెరుకపడని కోమలిరతియు
జేటెత్తజేయు చెలిమియు
నేటికి నెదిరీదినట్టు లెన్నగ సుమతీ

పాలను గలిసిన జలమును

పాలను గలిసిన జలమును
బాలవిధంబుననే యుండుఁ బరికింపగ
బాల చవిఁజెరచు గావున
బాలసుఁడగువాని పొందు వలదుర సుమతీ!

పాలసునకైన యాపద

పాలసునకైన యాపద
జాలింబడి తీర్పఁదగదు సర్వజ్ఞునకుఁ
దే లగ్నిబడగఁ బట్టిన
మేలెరుగునె మీటుగాక మేదిని సుమతీ!

పిలువని పనులకు బోవుట

పిలువని పనులకు బోవుట
కలయని సతి రతియు రాజు గానని కొలువు
బిలువని పేరంటంబును
వలవని చెలిమియును జేయవలదుర సుమతీ

పురికిని బ్రాణము కోమటి

పురికిని బ్రాణము కోమటి
వరికిని బ్రాణంబు నీరు వసుమతిలోనం
గరికిని బ్రాణము తొండము
సిరికిని బ్రాణము మగువ సిద్ధము సుమతీ!

పుత్రోత్సాహము తండ్రికి

పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!

పులిపాలు దెచ్చిఇచ్చిన

పులిపాలు దెచ్చిఇచ్చిన
నలవడఁగ గుండెగోసి యరచే నిడినం
దలపొడుగు ధనము బోసిన
వెలయాలికి గూర్మిలేదు వినురా సుమతీ!

పెట్టిన దినములలోపల

పెట్టిన దినములలోపల
నట్టడవులకైనవచ్చు నానార్థములున్
బెట్టని దినములఁ గనకపు
గట్టెక్కిన నేమిలేదు గదరా సుమతీ!

పొరుగున పగవాడుండిన

పొరుగున పగవాడుండిన
నిర వొందగ వ్రాతగాఁడె ఏలికయైనన్
ధరఁగాఁపు కొండెమాడినఁ
గరణాలకు బ్రతుకులేదు గదరా సుమతీ!

బంగారు కుదువబెట్టకు

బంగారు కుదువబెట్టకు
సంగరమునఁ బారిపోకు సరసుఁడవగుచో
నంగడి వెచ్చములాడకు
వెంగలితో జెలిమి వలదు వినురా సుమతీ!

బలవంతుడ నాకేమని

బలవంతుడ నాకేమని
పలువురితో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ!

మండలపతి సముఖంబున

మండలపతి సముఖంబున
మెండైన ప్రధానిలేక మెలఁగుట యెల్లన్
గొండంత మదపుటేనుగు
తొండము లేకుండినట్లు తోచుర సుమతీ!

మంత్రిగలవాని రాజ్యము

మంత్రిగలవాని రాజ్యము
తంత్రము సెడకుండ నిలచుఁ దరచుగ ధరలో
మంత్రి విహీనుని రాజ్యము
జంత్రపుఁగీలూడినట్లు జరుగదు సుమతీ!

మాటకు బ్రాణము సత్యము

మాటకు బ్రాణము సత్యము
కోటకుఁ బ్రాణంబు సుభట కోటి ధరిత్రిన్
బోటికిఁ బ్రాణము మానము
చీటికిఁ బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ!

మానఘనుఁ డాత్మధృతిఁ జెడి

మానఘనుఁ డాత్మధృతిఁ జెడి
హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్
మానెడు జలములలోపల
నేనుఁగు మెయి దాఁచినట్టు లెరగుము సుమతీ!

నాది నొకని వలచియుండగ

నాది నొకని వలచియుండగ
మదిచెడి యొక క్రూరవిటుడు మానక తిరుగున్
బొది జిలుక పిల్లి పట్టిన
జదువునె యా పంజరమున జగతిని సుమతీ!

రా పొమ్మని పిలువని యా

రా పొమ్మని పిలువని యా
భూపాలునిఁ గొల్వ ముక్తి ముక్తులు గలవే
దీపంబు లేని ఇంటను
చెవుణికీళ్లాడినట్లు సిద్ధము సుమతీ!

రూపించి పలికి బొంకకు

రూపించి పలికి బొంకకు
ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలోఁ
గోపించురాజుఁ గొల్వకు
పాపుదేశంబు సొరకు పదిలము సుమతీ!

లావుగలవానికంటెను

లావుగలవానికంటెను
భావింపఁగ నీతిపరుఁడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాఁడెక్కినట్లు మహిలో సుమతీ!

వరదైన చేను దున్నకు

వరదైన చేను దున్నకు
కరవైనను బంధుజనుల కడకేగకుమీ
పరులకు మర్మము సెప్పకు
పిరికికి దళవాయితనము బెట్టకు సుమతీ!

వరి పంటలేని యూరును

వరి పంటలేని యూరును
దొరయుండని యారు తోడు దొరకని తెరువున్
ధరను బతిలేని గృహమును
అరయంగా రుద్రభూమి యనదగు సుమతీ!

వినదగు నెవ్వరుచెప్పిన

వినదగు నెవ్వరుచెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
కనికల్ల నిజము దెలిసిన
మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతీ!

వీడెము సేయని నోరును

వీడెము సేయని నోరును
జేడెల యధరామృతంబుఁ జేయని నోరును
బాడంగరాని నోరును
బూడిద కిరవైన పాడు బొందర సుమతీ!

వెలయాలివలనఁ గూరిమి

వెలయాలివలనఁ గూరిమి
గలుగదు మరి గలిగెనేని కడతేరదుగా
పలువురు నడిచెడి తెరుపునఁ
బులు మొలవదు మొలిచెనేని బొదలదు సుమతీ!

వెలయాలు సేయు బాసలు

వెలయాలు సేయు బాసలు
వెలయఁగ నగపాలి పొందు, వెలమల చెలిమిన్
గలలోఁన గన్న కలిమియు,
విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ!

వేసరవు జాతి కానీ

వేసరవు జాతి కానీ
వీసముఁ దాజేయనట్టి వ్యర్థుడు గానీ
దాసి కొడుకైన గాని
కాసులు గలవాఁడే రాజు గదరా సుమతీ!

దేశ భాషలందు తెలుగు లెస్స

 

తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స
—శ్రీ కృష్ణదేవ రాయలు
 
 

హాని కలుగబోదు హరిమది నెంచెడు

హాని కలుగబోదు హరిమది నెంచెడు 
వాని కబ్దు పరము వసుధయందు 
పూని నిష్ఠమీరి పొదలక యుండుము 
విశ్వరాభిరామ వినురవేమ!

శాంతమే జనులను జయమునొందించును

శాంతమే జనులను జయమునొందించును 
శాంతముననె గురువు జాడ తెలియు 
శాంత భావ మహిమ జర్చింపలేమయా 
విశ్వదాభిరామ వినురవేమ! 

వ్రాతకంటె హెచ్చు పరమీదు దైవంబు

వ్రాతకంటె హెచ్చు పరమీదు దైవంబు 
చేతకంటె హెచ్చు వ్రాత లేదు 
వ్రాత కజుడు కర్త చేతకు దాకర్త 
విశ్వదాభిరామ వినురవేమ! 

వేషధారినెపుడు విశ్వసింపగరాదు

వేషధారినెపుడు విశ్వసింపగరాదు 
వేషదోషములొక విధయె యగును 
రట్టుకాదె మునుపు రావణు వేషంబు 
విశ్వదాభిరామ వినురవేమ! 

వెన్న చేతబట్టి వివరంబు తెలియక

వెన్న చేతబట్టి వివరంబు తెలియక 
ఘృతము కోరునట్టి యతని భండి 
తాను దైవమయ్యు దైవంబు దలచును 
విశ్వదాభిరామ వినురవేమ! 

వినియు వినకయుండు కనియు గనక యుండు

వినియు వినకయుండు కనియు గనక యుండు 
తలచి తలపకుండు తాను యోగి 
మనుజవరులచేత మణిపూజ గొనుచుండు 
విశ్వదాభిరామ వినురవేమ! 

లోభమోహములను ప్రాభవములు తప్పు

లోభమోహములను ప్రాభవములు తప్పు 
తలచిన పనులెల్ల తప్పి చనును 
తానొకటి దలచిన దైవమొండగుచుండు 
విశ్వదాభిరామ వినురవేమ 

లోకమందుబుట్టి లోకమందె పెరిగి

లోకమందుబుట్టి లోకమందె పెరిగి 
లోక విభవమోర్వలేక జనుడు 
లోకమందు జనికి లోబడి చెడిపోవును 
విశ్వదాభిరామ వినురవేమా!

ఝుషము నీరు వెడల జచ్చుటే సిద్ధము

ఝుషము నీరు వెడల జచ్చుటే సిద్ధము 
నీటనుండనేని నిక్కిపడును 
అండతొలుగు నెడల నందర పని అట్లే 
విశ్వదాభి రామ వినురవేమ 

రూపువంక పేరు రూఢిగా నిలుచును

రూపువంక పేరు రూఢిగా నిలుచును 
పేరువంక క్రియలు పెనగుచుండు 
నాశమౌను తుదకు నామరూప క్రియల్‌ 
విశ్వదాభిరామ వినురవేమ! 

యోగిననుచు గొంత యోగముగూర్చక

యోగిననుచు గొంత యోగముగూర్చక 
జగమునెల్లబట్ట చంపి తినుచు 
ధనము కొఱకు వాడు తగవాడుచుండిన 
యోగికాడు వాడె యోగువేమ

భూమిలోన బుట్టు భూసారమెల్లను

భూమిలోన బుట్టు భూసారమెల్లను 
తనువులోన బుట్టు తత్త్వమెల్ల 
శ్రమలోన బుట్టు సర్వంబు తానౌను 
విశ్వదాభిరామ వినురవేమ 

భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు

భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు 
దాన హీనుఁ జూచి ధనము నవ్వు 
కదన భీతుఁ జూచి కాలుఁడు నవ్వును 
విశ్వదాభిరామ వినురవేమ 

భయమంతయు దేహమునకె

భయమంతయు దేహమునకె 
భయ ముడిగిన నిశ్చయంబు పరమాత్మునకే 
లయమంతయు జీవునకే 
జయమాత్మకు ననుచు జగతిఁ జాటుర వేమా

భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు

భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు 
దాన హీనుఁ జూచి ధనము నవ్వు 
కదన భీతుఁ జూచి కాలుఁడు నవ్వును 
విశ్వదాభిరామ వినురవేమ

భోగంబుల కాశింపక

భోగంబుల కాశింపక 
రాగద్వేషంబు రంగుడదమలో 
వేగమె మోక్ష పదంబును 
రాగను నాతండు యోగిరాయుడు వేమా!

బొంది యెవరి సొమ్ము పోషింపబలుమారు

బొంది యెవరి సొమ్ము పోషింపబలుమారు 
ప్రాణ మెవరి సొమ్ము భక్తిసేయ, 
ధనమదెవరిసొమ్ము ధర్మమె తన సొమ్ము 
విశ్వదాభిరామ వినురవేమ

బ్రహ్మఘటము మేను ప్రాణంబు తగగాలి

బ్రహ్మఘటము మేను ప్రాణంబు తగగాలి 
మిత్రచంద్ర శిఖులు నేత్రచయము 
మఱియు బ్రహ్మమనగ మహిమీద లేదయా 
విశ్వదాభిరామ వినురవేమ

పరులమేలు చూసి పలుకాకి వలె

పరులమేలు చూసి పలుకాకి వలె 
వట్టిమాటలాడు వాడు అధముడు 
అట్టివాని బతుకుటదిఏల మంటికా? 
విశ్వదాభిరామ వినురవేమ

పట్టుపట్టరాదు పట్టివిడువరాదు

పట్టుపట్టరాదు పట్టివిడువరాదు 
పట్టెనేని బిగియ పట్టవలయు 
పట్టువిడుటకన్నా పడిచచ్చుటేమేలు 
విశ్వదాభిరామ వినురవేమ

పరుల మేలు చూచి పలుగాకి వలె నెప్పు

పరుల మేలు చూచి పలుగాకి వలె నెప్పు 
వట్టి మాటలాడు వాడధముడు 
అట్టి వాని బ్రతుకు టదియేల మంటికా 
విశ్వధాబిరామ వినురవేమ!

పదుగురాడుమాట పాడియై ధరజెల్లు

పదుగురాడుమాట పాడియై ధరజెల్లు 
నొక్కడాడుమాట యెక్కదెందు 
వూరకుండు వాని కూరెల్ల నోపదు 
విశ్వదాభిరామ వినురవేమ!

పరుల దత్తమొప్పి పాలనచేసిన

పరుల దత్తమొప్పి పాలనచేసిన 
నిల స్వదత్తమునకు విను మడియగు 
నవని పరుల దత్త మహపరింపగ రాదు 
విశ్వధాబిరామ వినురవేమ!

పప్పులేని కూడు పరులకోసహ్యమే

పప్పులేని కూడు పరులకోసహ్యమే 
యుప్పులేని వాడె యధిక బలుడు 
ముప్పులేని వాడు మొదటి సుజ్జానిరా 
విశ్వదాభిరామ వినురవేమ!

పగయుడగు గోపముడిగిన

పగయుడగు గోపముడిగిన 
పగయుడుగన్‌ కోర్కెలుడుగు బరజన్మంపుం 
దగులుడుగు భేదముడిగిన 
త్రిగుణము లుడుగంగ ముక్తి స్థిరమగు వేమా!

పతక మందు నొప్పు పలు రత్నముల పెంపు

పతక మందు నొప్పు పలు రత్నముల పెంపు 
బంగరందు కూర్ప బరువు గనును 
గాని యితర లోహమైన హీనము గాదె 
విశ్వదాభిరామ వినురవేమ!

పదుగురాడుమాట పాడియై ధరజెల్లు

పదుగురాడుమాట పాడియై ధరజెల్లు 
నొక్కడాడుమాట యెక్కదెందు 
వూరకుండు వాని కూరెల్ల నోపదు 
విశ్వదాభిరామ వినురవేమ!

పెట్టిపోయలేని వట్టి దేబెలు భూమి

పెట్టిపోయలేని వట్టి దేబెలు భూమి 
బుట్టిరేమి వారు గిట్టరేమి 
పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా! 
విశ్వదాభిరామ వినుర వేమా!

పుట్టు పుట్టలేదే పుడమిని జనులెల్ల

పుట్టు పుట్టలేదే పుడమిని జనులెల్ల 
పుట్టి గిట్టలేదె పూర్వులెవరు 
పుట్టి గిట్టుటెల్ల వట్టి భ్రాంతులు సుమీ, 
విశ్వదాభిరామ వినుర వేమా!

పరధనంబులకును ప్రాణములిచ్చును

పరధనంబులకును ప్రాణములిచ్చును 
సత్యమంతలేక జారడగును 
ద్విజులమంచు నింత్రుతేజమించుకలేదు 
విశ్వదాభిరామ వినురవేమా!

పరుల విత్తమందు భ్రాంతి వాసినయట్టి

పరుల విత్తమందు భ్రాంతి వాసినయట్టి 
పురుషుడవనిలోన పుణ్యమూర్తి 
పరుల విత్తమరయ పాపసంచితమగు 
విశ్వదాభిరామ వినురవేమా!

పాల నీటి కలత పరమహంస మెఱుగును

పాల నీటి కలత పరమహంస మెఱుగును 
నీరు పాలు నెట్లు నేర్చునెమలి 
లజ్ఞుడైన హీనుడల శివు నెఱుగునా? 
విశ్వదాభిరామ వినురమేమా!

పగలుడుగ నాసలుడుగును

పగలుడుగ నాసలుడుగును 
వగపుడుగం గోర్కెలుడుగు వడి జన్మంబుల్‌ 
తగులుడుగు భోగముడిగిన 
త్రిగుణంబును నడుగ ముక్తి తెరువగు వేమా!

పంచ ముఖములందు బంచాక్షరి జనించె

పంచ ముఖములందు బంచాక్షరి జనించె 
పంచ వర్ణములను ప్రబలె జగము 
పంచముఖుని మీరు ప్రస్తుతి చేయుండీ 
విశ్వదాభిరామ వినురవేమ

పండువలన బుట్టె బరగ ప్రపంచము

పండువలన బుట్టె బరగ ప్రపంచము 
పండువలన బుట్టె పరము నిహము 
పండు మేలెఱింగె బ్రహ్లాదుడిలలోన 
విశ్వదాభిరామ వినురవేమ

న్యాయశాస్త్ర మరయ నన్యాయమున దించు

న్యాయశాస్త్ర మరయ నన్యాయమున దించు 
ధర్మశాస్త్ర మొసగు రుగ్మతంబు 
జ్యోతిషము జనముల నీతుల దప్పించు 
విశ్వదాభిరామ వినురవేమ!

నిజములాడు వాని నిందించు జగమెల్ల

నిజములాడు వాని నిందించు జగమెల్ల 
నిజము బల్కరాదు నీచులకడ 
నిజ మహాత్ముగూడ నిజమాడవలయురా 
విశ్వదాభిరామ వినుర వేమ!

నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు

నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు 
తళుకు బెళుకు రాలు తట్టెడేల 
చదువ పద్యమరయ జాలదా యొక్కటి 
విశ్వదాభిరామ వినుర వేమ!

నీతి జ్యోతిలేక నిర్మలంబగు నేది

నీతి జ్యోతిలేక నిర్మలంబగు నేది 
ఎట్లు కలగుబర మదెంతయైన 
ధనము గలిగియున్న దైవంబు గలుగదు 
విశ్వదాభిరామ వినుర వేమ!

నడుచునిచ్చు నతని బత్తెమిచ్చిన వాని

నడుచునిచ్చు నతని బత్తెమిచ్చిన వాని 
కడుపు చల్లజేసి ఘనత విడుచు 
నడుప నేర నేర నతడు నాలి ముచ్చేగదా 
విశ్వదాభిరామ వినురవేమ!

నలుగురు కల చోటను దా

నలుగురు కల చోటను దా 
దల చూపుచు మెలగుచుండి ధన్యాత గనగా 
దలచెడి యాతడు నిచ్చలు 
గల మాటలే పలుకుచుండగా దగు వేమా!

నిజము తెలిసియున్న సుజినుడానిజమునె

నిజము తెలిసియున్న సుజినుడానిజమునె 
పలుకవలయుగాని పరులకొరకు 
చావకూడ దింక నోపదవ్యం పల్క 
విశ్వదాభిరామ వినురవేమ

నిజమాకల్ల రెండు నీలకంఠుడెఱుంగు

నిజమాకల్ల రెండు నీలకంఠుడెఱుంగు 
నిజములాడకున్న నీతిదప్పు 
నిజములాడునపుడు నీ రూపమనవచ్చు 
విశ్వదాభిరామ వినురవేమా!

నోరు పలకవచ్చు నుడి వ్రాయగరాదు

నోరు పలకవచ్చు నుడి వ్రాయగరాదు 
వ్రాతకన్న సాక్షి వలవదన్న 
పరగలేని వ్రాత భంగ పాటుందెచ్చు 
విశ్వదాభిరామ వినురవేమా!

నిమిషమైనను మది నిల్చి నిర్మలముగ

నిమిషమైనను మది నిల్చి నిర్మలముగ 
లింగ జీవావేశులను గాంచి భంగపడక 
పూజ మదియందు జేరుట పూర్ణపదవి 
పరము గోరిన నిదిచేయ బాగువేమా

నేయి వెన్న కాచి నీడనే యుంచిన

నేయి వెన్న కాచి నీడనే యుంచిన 
బేరి గట్టిపడును పెరుగురీతి 
పోరిపోరి మదిని పోనీక పట్టుము 
విశ్వదాభిరామ వినురవేమ

నీళ్ల మునుగునేల? నిధుల మెట్టగనేల

నీళ్ల మునుగునేల? నిధుల మెట్టగనేల 
మొనసి వేల్పులకును మ్రొక్కనేల 
కపట కల్మషములు కడుపులో నుండగా 
విశ్వదాభిరామ వినురవేమా

నీవనినను నేననినను

నీవనినను నేననినను 
భావమ్మున నెఱుకయొక్క పద్ధతియగునా 
భావంబు దెలిసి మదిని 
ర్భావముగా నిన్ను గనుట పరమగు వేమా

నరుడెయైన లేక నారాయణుండైన

నరుడెయైన లేక నారాయణుండైన 
తత్త్వబద్ధుడైన దరణి నరయ 
మరణమున్నదనుచు మదిని నమ్మగవలె 
విశ్వదాభిరామా వినురవేమ

దేవుడనగ వేరే దేశముందున్నాడె

దేవుడనగ వేరే దేశముందున్నాడె 
దేహితోడ నెపుడు దేహమందె 
వాహనములనెక్కి పడిదోలుచున్నాడు 
విశ్వదాభిరామ వినురవేమ 

దొంగమాటలాడ దొరుకునె మోక్షము

దొంగమాటలాడ దొరుకునె మోక్షము 
చేతగాని పలుకు చేటుదెచ్చు 
గురువుపద్దు కాదు గునహైన్య మదియగు 
విశ్వదాభిరామ వినురవేమా! 

దశగలారినెల్ల దమ బంధువు లటండ్రు

దశగలారినెల్ల దమ బంధువు లటండ్రు 
దశయలేమి నెంత్రు తక్కువగను 
దశయన గమ ధన దశమొక్కటే దశ 
విశ్వదాభిరామ వినురవేమా!

ధూమాదుల నావృతమై

ధూమాదుల నావృతమై 
వ్యోమంబునకెగని కలియు నుపములు తనలో 
శ్రీమించు శివుని జేరును 
గామాదుల గలియడతడు ఘనముగ వేమా 

ద్వారంబంధమునకు దలుపులు గడియలు

ద్వారంబంధమునకు దలుపులు గడియలు 
వలెనె నోటికొప్పుగల నియతులు 
ధర్మమెరిగి పలుక ధన్యుండౌ భువిలోన 
విశ్వదాభిరామా వినురవేమ 

తనగుణము తనకు నుండగ

తనగుణము తనకు నుండగ 
నెనయంగా నోరుని గుణము నెంచును మదిలో 
దన గుణము తెలియ కన్యుని 
బనిగొని దూషించువాడు వ్యర్థుడు వేమా! 

తపమువేల? యరయ ధాత్రిజనులకెల్ల

తపమువేల? యరయ ధాత్రిజనులకెల్ల 
నొనర శివుని జూడ నుపమ గలదు 
మనసు చదరనీక మహిలోన జూడరా 
విశ్వదాభిరామ వినురవేమా!

తనదు మనసుచేత దర్కించి జ్యోతిష

తనదు మనసుచేత దర్కించి జ్యోతిష 
మెంత చేసే ననుచు నెంచి చూచు 
తన యదృష్టమంత దైవ మెఱుంగడా 
విశ్వదాభిరామ వినురవేమా! 

తన విరక్తి యనెడి దాసి చేతను జిక్కి

తన విరక్తి యనెడి దాసి చేతను జిక్కి 
మిగిలి వెడలవేక మిణుకుచున్న 
నరుడి కేడముక్తి వరలెడి చెప్పడీ 
విశ్వదాభిరామ వినురవేమా! 

తలపులోన గలుగు దా దైవమే ప్రొద్దు

తలపులోన గలుగు దా దైవమే ప్రొద్దు 
తలచి చూడనతకు తత్వమగును 
వూఱకుండ నేర్వునుత్తమ యోగిరా 
విశ్వదాభిరామ వినురవేమా! 

ఫ్రెంచి వాకిట్లో తెలుగు మల్లె చెట్టు

ఫ్రెంచి వాకిట్లో తెలుగు మల్లె చెట్టు

3000 సంవత్సరాల చరిత్ర ఉన్న మన తెలుగు బాషని మనం తక్కువ చేసి చూస్తున్న ఈ రోజుల్లో, పరాయి దేశం వారు మన భాషపై పెంచుకుంటున్న మమకారం చూసి మురిసిపోవలా??? లేదా మనం కూడా మన భాషను పరిరక్షించుకోవటానికి అడుగులు వేయాలా?? అన్నది అంధరూ ఆలోచించుకోవాలి.
మూలం: ఈనాడు దినపత్రిక

నేడు టంగుటూరి ప్రకాశం పంతులు గారి జన్మదినం

సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు, టంగుటూరి ప్రకాశం పంతులు. 1940, 50లలోని ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకడు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించాడు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెనుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందినవాడు.

జ్ఞానియైనవాని మానక పూజించు

జ్ఞానియైనవాని మానక పూజించు 
మనుజుడెప్పుడు పరమునను ముదంబు 
సుఖమునందుచుండుసూరులు మెచ్చగ 
విశ్వదాభిరామ వినురవేమ!

జన్నములను మరియు జన్నియల ననేక

జన్నములను మరియు జన్నియల ననేక 
ముల నొనర్చియున్న ఫలముకాన 
రాక యుండు నీతి లేకున్న మాత్రాన 
విశ్వదాభిరామ వినురవేమ!

జాతి, మతము విడిచి చని యోగికామేలు

జాతి, మతము విడిచి చని యోగికామేలు
జాతితో నెయున్న నీతివలదె
మతముబట్టి జాతి మానకుంట కొఱంత
విశ్వదాభిరామ వినురవేమా

జాలినొందరాదు జవదాటి కనరాదు

జాలినొందరాదు జవదాటి కనరాదు 
అది మూలమైన ఆత్మమఱుగు 
పోరిచేరి పొంది పూర్ణము నందురా 
విశ్వదాభిరామ వినురవేమా

జనన మరణములన స్వప్న సుషుప్తులు

జనన మరణములన స్వప్న సుషుప్తులు 
జగములందు నెండ జగములుండు 
నరుడు జగమునంట నడుబాటు కాదొకో 
విశ్వదాభిరామ వినురవేమా!

జాణలమని యంద్రు చపలాత్ములగువారు

జాణలమని యంద్రు చపలాత్ములగువారు 
తెలివిలేక తమ్ముతెలియలేరు 
కష్టమైన యడవి గాసీలుచున్నారు 
విశ్వదాభిరామ వినురవేమా!

జ్ఞానమెన్న గురువు జ్ఞానహైన్యము బుద్ధి

జ్ఞానమెన్న గురువు జ్ఞానహైన్యము బుద్ధి 
రెంటినందు రిమ్మరేచునపుడు 
రిమ్మ తెలిపెనేని రెండొక రూపురా 
విశ్వదాభిరామ వినురవేమా!

గంగి గోవుపాలు గరిటడైనను చాలు

గంగి గోవుపాలు గరిటడైనను చాలు 
కడవెడైనను నేమి ఖరముపాలు 
భక్తికల్గుకూడు పట్టెడైనను చాలు 
విశ్వదాభిరామ వినురవేమ

గుణములోగలవాని కులమెంచగానేల

గుణములోగలవాని కులమెంచగానేల 
గుణము కలిగెనేని కోటిసేయు 
గణములేక యున్న గుడ్డిగవ్వయులేదు 
విశ్వదాభిరామ వినురవేమ

శుభముల నొందని చదువును

శుభముల నొందని చదువును
అభినయమున రాగరసము నందని పాటల్
గుభగుభలు లేని కూటమి
సభమెచ్చని మాటలెల్లఁ జప్పన సుమతీ!

సరసము విరసము కొరకే

సరసము విరసము కొరకే
పరిపూర్ణ సుఖంబు అధిక బాధల కొరకే
పెరుగుట విరుగుట కొరకే
ధర తగ్గుట హెచ్చుకొరకే తధ్యము సుమతీ!

మేలెంచని మాలిన్యుని

మేలెంచని మాలిన్యుని
మాలను నగసాలివాని మంగలి హితుగా
నేలిన నరపతి రాజ్యము
నేలఁగలసిపోవుగాని నెగడదు సుమతీ!

సిరి దా వచ్చిన వచ్చును

సిరి దా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి దాఁ బోయిన బోవును
కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!

స్త్రీల ఎడ వాదులాడక

స్త్రీల ఎడ వాదులాడక
బాలురతో జెలిమిచేసి భాషింపకుమీ
మేలైన గుణము విడువకు
ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతీ!

మా తెలుగు తల్లికి మల్లె పూ దండ

మా తెలుగు తల్లికి మల్లె పూదండ అనేది తెలుగులో ప్రాచుర్యం కలిగిన, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచే రాష్ట్ర గీతంగా అధికారికంగా స్వీకరించబడిన ఒక గేయం. ఈ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి. ఈ గేయంలో తెలుగునాట ప్రముఖమైన నదులను, సంస్కృతి, సాహిత్యాలను, చరిత్రలో ప్రసిద్ధ వ్యక్తులను రచయిత సంస్మరించాడు.
 

"మా తెలుగు తల్లికి మల్లె పూ దండ

మా కన్న తల్లికి మంగళారతులు

కడుపులొ బంగారు కనుచూపులొ కరుణ
చిరునవ్వులొ శిరులు దొరలించు మా తల్లి

గలగలా గోదారి కదలి పోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను

మా గురించి

తెలుగుబిడ్డ™, ఎటువంటి లాభాపేక్ష లేని ఒక స్వచ్చంద సేవా సంస్థ. మన తెలుగు భాష వైభవాన్ని, తెలుగు వారి గొప్పతనాన్ని చాటి చెప్పటానికి ఉద్దేశింపబడినది.

మా లక్ష్యం

మనది తెలుగుజాతి. రెండువేల అయిదువందల సంవత్సరాల ఘనమైన చరిత్రగల మహోన్నత జాతి.

కొండముచ్చు పెండ్లికి కోతి పేరంటాలు

కొండముచ్చు పెండ్లికి కోతి పేరంటాలు 
మొండి వాని హితుడు బండవాడు 
దుండగీడునకును కొండెడు దళవాయి 
విశ్వదాభిరామా వినురవేమ

కనులు పోవువాడు కాళ్లు పోయినవాడు

కనులు పోవువాడు కాళ్లు పోయినవాడు 
ఉభయులరయుగూడి యుండినట్లు 
పేద పేద గూడి పెనగొని యుండును 
విశ్వదాభిరామా వినురవేమ

కలిమిగల్గనేమి కరుణ లేకుండిన

కలిమిగల్గనేమి కరుణ లేకుండిన 
కలిమి తగునె దుష్టకర్ములకును 
తేనెగూర్పనీగ తెరువున బోవదా 
విశ్వదాభిరామ వినురవేమ

కదలనీయకుండ గట్టిగా లింగంబు

కదలనీయకుండ గట్టిగా లింగంబు 
కట్టివేయనేమి ఘనత కలుగు 
భావమందు శివుని భావించి కానరా 
విశ్వదాభిరామ వినురవేమ

కపటి వేషమూని కడగండ్లు పడనేల

కపటి వేషమూని కడగండ్లు పడనేల 
విపిన భూమి తిరిగి విసుగనేల 
యుపముతోనే ముక్తి ఉన్నది చూడరా 
విశ్వదాభి రామ వినుర వేమ

కోపమున ఘనత కొంచెమైపోవును

కోపమున ఘనత కొంచెమైపోవును 
కోపమునను గుణము కొరతపడును 
కోపమణచనేని కోరికలీడేరు 
విశ్వదాభిరామ వినురవేమ

ఐదు వేళ్లు బలిమి హస్తంబు పనిచేయు

ఐదు వేళ్లు బలిమి హస్తంబు పనిచేయు 
నం దొకండు విడ్డ పొందు చెడును 
స్వీయుడొకడు విడిన జెడుకదా పనిబల్మి 
విశ్వదాభిరామ వినురవేమ!

ఐకమత్యమొక్క టావశ్యకం బెప్డు

ఐకమత్యమొక్క టావశ్యకం బెప్డు 
దాని బలిమి నెంతయైన గూడు 
గడ్డి వెంట బెట్టి కట్టరా యేనుంగు 
విశ్వదాభిరామ వినురవేమ!

ఎలుగు తోలు తెచ్చి ఏడాది యుతికినా

ఎలుగు తోలు తెచ్చి ఏడాది యుతికినా 
నలుపు నలుపేకాని తెలుపుకాదు 
కొయ్యబొమ్మ తెచ్చి కొట్టితే గుణియోనె 
విశ్వదాభిరామ వినురవేమ

ఎండిన మా నొకటడవిని

ఎండిన మా నొకటడవిని 
మండిన నందగ్ని పుట్టి యూడ్చును చెట్లన్‌ 
దండిగల వంశమెల్లను 
చండాలుండొకడు పుట్టి చదుపును వేమా!

ఇంటి ఇంటిలోననీశ్వరుడుండగ

ఇంటి ఇంటిలోననీశ్వరుడుండగ 
నంటి చూడలేక యడవులందు 
నుంట మేటంచునుందురా జోగులై 
విశ్వదాభిరామ వినురవేమ!

ఇంగలంబు తోడ నిల సల్పుతోడను

ఇంగలంబు తోడ నిల సల్పుతోడను 
పరుని యాలితోడ పతితుతోడ 
సరసమాడుటెల్ల చావుకు మూలము 
విశ్వదాభిరామ వినురవేమ!

ఆత్మబుద్ధి వలన నఖిలంబ తానయ్యె

ఆత్మబుద్ధి వలన నఖిలంబ తానయ్యె 
జీవబుద్ధి వలన జీవుడయ్యె 
మోహబుద్ధిలయము ముందర గనుగొను 
విశ్వదాభిరామ వినురమేమ!

ఆలిమాటలు విని అన్నదమ్ముల రోసి

ఆలిమాటలు విని అన్నదమ్ముల రోసి
వేరేపోవువాడు వెర్రివాడు
కుక్కతోక పట్టి గోదారీదినా?
విశ్వదాభిరామ వినుర వేమ!

ఆశయనెడి త్రాళ్ళ నఖిల జనంబులు

ఆశయనెడి త్రాళ్ళ నఖిల జనంబులు 
కట్టుపడుచు ముక్తిగానరైరి 
జ్ఞానఖడ్గమునను ఖండింప రాదొకో 
విశ్వదాభిరామ వినురవేమా!

ఆశయనెడు దాని గోసివేయగాలేక

ఆశయనెడు దాని గోసివేయగాలేక 
మొహబుద్ది వలన మునుగువారు 
కాశివాసులైన గనబోరు మోక్షము 
విశ్వదాభిరామ వినురవేమా!

చిక్కియున్నవేళ సింహంబునైనను

చిక్కియున్నవేళ సింహంబునైనను 
బక్క కుక్కయైనా బాధసేయు 
బలిమిలేని వేళ పంతములు చెల్లవు 
విశ్వదాభిరామ వినురవేమ

చిత్తశుద్ధి కలిగిచేసిన పుణ్యంబు

చిత్తశుద్ధి కలిగిచేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు కొదవగాదు
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంతో
విశ్వదాభిరామ వినుర వేమ!

చనువారెల్లను జనులం

చనువారెల్లను జనులం 
జనిపోయిన వారి పుణ్య సత్కథలెల్లన్‌ 
వినవలె గనవలె మనవలె 
నని మషులకు దెలుసగూడ దంత్యము వేమా

చిత్తమనేడి వేరే శిథిలమైనప్పుడే

చిత్తమనేడి వేరే శిథిలమైనప్పుడే 
ప్రకృతి యనెడి చెట్టు పడును పిదప 
గోర్కులనెడి పెద్దకొమ్మలెండును గదా 
విశ్వదాభిరామ వినురవేమా!

అడియాస కొలువుఁ గొలువకు

అడియాస కొలువుఁ గొలువకు 
గుడిమణియము సేయఁబోకు కుజనులతోడన్‌ 
విడువక కూరిమి సేయకు 
మడవినిఁదో డరయఁకొంటి నరుగకు సుమతీ!

అనువుగాని చోట అధికులమనరాదు

అనువుగాని చోట అధికులమనరాదు 
కొంచెముందుటెల్ల కొదువకాదు 
కొండ యద్దమందు కొంచమై ఉండదా 
విశ్వదాభిరామ వినురవేమ

అల్పబుద్ధివానికధికారమిచ్చిన

అల్పబుద్ధివానికధికారమిచ్చిన 
దొడ్డవారినెల్ల తొలగగొట్టు 
చెప్పుదినెడు కుక్క చెరకు తీపెరుగునా 
విశ్వదాభిరామ వినుర వేమ

అగ్నిబానా మేసి యంబుధి నింకించు

అగ్నిబానా మేసి యంబుధి నింకించు
రాముడవలి కేగ రాక, నిలిచి
చెట్లు గిరులు తెచ్చి సేతువు గట్టడా
విశ్వదాభిరామ వినురవేమ!

అనువుగాని చోట అధికుల మనరాదు

అనువుగాని చోట అధికుల మనరాదు 
కొంచెముండుటెల్ల కొదువగాదు 
కొండ యద్దమందు కొంచెమై యుండదా 
విశ్వదాభిరామ వినురవేమ!

అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను

అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను 
సజ్జనుండు పలుకు చల్లగాను 
కంచు మోగినట్లు కనకంబు మోగునా 
విశ్వదాభిరామ వినుర వేమ!

అతిథి రాక చూచి యదలించి పడవైచి

అతిథి రాక చూచి యదలించి పడవైచి 
కఠిన చితులగుచు గానలేరు 
కర్మమునకు ముందు ధర్మము గానరో 
విశ్వదాభిరామ వినురవేమా!

అన్నదానమునకు నధిక సంపదగల్గి

అన్నదానమునకు నధిక సంపదగల్గి 
యమరలోక పూజ్యుడగును మీఱు 
అన్నమగును బ్రహ్మమది కనలేరయా 
విశ్వదాభిరామ వినురవేమ

అర్ధ యంకణమున కాధారమైనట్టి

అర్ధ యంకణమున కాధారమైనట్టి 
యొంటిమేడ గుంజు నొనరనిల్పె 
నింటికొక మగండె యిల్లాండ్రునేద్గురు 
విశ్వదాభిరామ వినురవేమ